ఉన్నది ఒకటే జిందగీ సెన్సార్ రిపోర్ట్

మరిన్ని వార్తలు

రామ్ హీరోగా విడుదలకి సిద్ధం అయిన తాజా చిత్రం- ఉన్నదీ ఒకటే జిందగీ సెన్సార్ ప్రక్రియని పూర్తిచేసుకుంది.

ఫ్రెండ్ షిప్ థీం తో తెరకెక్కిన ఈ చిత్రానికి సెన్సార్ వారు క్లీన్ U సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎటువంటి కట్స్ కూడా చెప్పకపోవడంతో ఈ చిత్రం రిలీజ్ కి లైన్ క్లియర్ అయిపొయింది అనే చెప్పాలి. ఇక ఇప్పటికే ఉన్నదీ ఒకటే జిందగీ చిత్రాన్ని ఈ నెల 27వ తేదిన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

దేవిశ్రీప్రసాద్ అందించిన పాటలు ఇప్పటికే ఈ సినిమా పైన అంచనాలు పెంచగా ఇప్పుడు వచ్చిన సెన్సార్ రిపోర్ట్ ఆ అంచనాలని డబల్ చేశాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఈ చిత్రంలో రామ్ సరసన- లావణ్య & అనుపమ నటిస్తుండగా మరొక యంగ్ హీరో శ్రీకృష్ణ ప్రధాన పాత్రలో కనపడనున్నాడు.

చూద్దాం.. ఈ నేను శైలజా కాంబినేషన్ ఎటువంటి రిజల్ట్ ఇవ్వనుందో...

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS