'రైతు' అందుకే లేటా?

మరిన్ని వార్తలు

బాలకృష్ణ వందో చిత్రంగా 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమా షూటింగ్‌ సమయంలోనే 101వ సినిమాని కూడా ఓకే చేసి పెట్టాడు. క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ డైరెక్షన్‌లో ఈ సినిమా ఉండబోతోందని అప్పుడే చెప్పాడు బాలయ్య. అరతేకాదు ఈ సినిమా చేయాలన్నది తన కోరిక అని కూడా చెప్పారు. రైతు గెటప్‌లో బాలయ్య అదిరిపోయే లుక్‌లో కనిపిస్తారనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు వందో చిత్రం 'గౌతమీ పుత్ర శాతకర్ణి' రిలీజ్‌కు రెడీ అయ్యింది. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌, అందరూ ఆహ్వానించదగ్గ సబ్జెక్ట్‌. అదీ క్రిష్‌ డైరెక్షన్‌. ఇంత వరకూ ఎవరూ టచ్‌ చేయని సబ్జెక్ట్‌ ఇలా ఈ సినిమాకి ఉన్న అనేక ప్లస్‌ పాయింట్స్‌తో ఈ సినిమా సగం విజయం అందేసుకుంది ఇప్పటికే. చిత్ర యూనిట్‌ కూడా చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది ఈ సినిమా విషయంలో. అయితే బాలయ్య నెక్స్ట్‌ సినిమాపైనే ఇప్పుడు అందరి దృష్టి. తన తదుపరి సినిమా 'రైతు'నే చెయ్యాలనుందని బాలయ్య అన్నారు. కానీ ఈ సినిమా విషయంలో చిన్న కన్య్ఫూజన్‌ ఉందట. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో అమితాబ్‌ బచ్చన్‌ నటించనున్నారనే విషయం తెలిసిందే. అరతేకాదు డైరెక్టర్‌ కృష్ణవంశీ, బాలయ్య ఇద్దరూ ఆయన్ని స్వయంగా కలిసి ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్‌ గురించి ఆడిగారట. అయితే బిగ్‌బీ నుంచి ఏ రకమైన రెస్పాన్స్‌ రాలేదని బాలయ్య తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూస్‌ ద్వారా మనకు స్పష్టమవుతోంది. దాంతో ఈ సినిమా సెట్స్‌ పైకి వెళుతుందా లేదా అనేది సస్పెన్స్‌గానే ఉంది. అయితే ఈ సినిమా కాకపోతే బాలయ్య ఎవరితో సినిమా చేస్తారనేది త్వరలోనే తెలియనుంది. 

ALSO READ : HOW


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS