నాగార్జునకి 'అన్నమయ్య'ని మించి..

మరిన్ని వార్తలు

'అన్నమయ్య' సినిమా భక్తి రస చిత్రాల్లో ఓ అద్భుతం. దర్శకేంద్రుడు రాఘవేంద్రుని దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో విజువల్‌గా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలో నాగార్జున తన నటనతో ప్రేక్షకుల్ని భక్తి రసంతో మంత్ర ముగ్దుల్ని చేశాడు. ఆ తర్వాత వచ్చిన రాఘవేంద్రరావు డైరెక్షన్‌లోనే తెరకెక్కిన 'శ్రీరామదాసు', 'పాండురంగడు' చిత్రాలు కూడా విజయాన్ని అందుకున్నా కానీ 'అన్నమయ్య' స్థాయిని అందుకోలేకపోయాయి. ఆయన డైరెక్షన్‌లోనే నాగార్జున హీరోగా వస్తోన్న తాజా చిత్రం 'ఓం నమో వేంకటేశాయ'. ఈ చిత్రం ట్రైలర్‌ విడుదలయ్యాక చిత్రంపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. 'అన్నమయ్య' స్థాయిని అందుకోగలిగే కెపాసిటీ ఈ చిత్రానికి ఉందంటూ సినీ ప్రముఖుల చర్చించుకుంటున్నారు. అనుష్క ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపిస్తోంది. 'కృష్ణమ్మ'గా అనుష్క ట్రైలర్‌లో చాలా అందంగా కనిపిస్తోంది. ప్రగ్యా జైశ్వాల్‌, విమలారామన్‌, జగపతిబాబు తదితరులు నటిస్తోన్న ఈ సినిమాను దర్శకేంద్రుడు చాలా ప్రతిష్ఠాత్మకంగా భావించి తెరకెక్కించారు. ఆడియో వేడుక సందర్భంలో ఈ చిత్రం తనకి చివరి చిత్రం కానుందని కూడా ఆయన తెలిపారు. అంటే ఈ సినిమాను ఇంకెంత అద్భుతంగా భావించి తెరపై ఆవిష్కరించారో తెలుస్తోంది. కీరవాణి పాటలు ఈ సినిమాకి ప్రాణం. నాగార్జున కెరీర్‌లో మరో మైలురాయిగా ఈ సినిమా నిలిచిపోతుందనడంలో అతిశయోక్తి కాదు. ఈ చిత్రం ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS