ఎన్టీఆర్ బయోపిక్ లో జూ ఎన్టీఆర్ ఎవరు?

మరిన్ని వార్తలు

పెద్ద ఎన్టీఆర్ గారి జీవితం పైన ఆయన కొడుకు బాలకృష్ణ నిర్మిస్తున్న ఎన్టీఆర్ చిత్రానికి సంబందించిన ఒక కీలక సమాచారం బయటికివచ్చింది.

అదేంటంటే- ఈ సినిమాలో ఎన్టీఆర్ హీరోగా మారక ముందు ఆయనఉద్యోగం చేసే సమయం అలాగే హీరోగా ప్రయత్నం చేసే సమయాల్లో ఆయన పాత్రలో ఒక యంగ్ హీరో నటించనున్నాడట. అయితే బాలయ్య మాత్రం తన తండ్రి పాత్రలో ఆయన హీరోగా మారిన సమయం నుండి కనిపిస్తారు అని సమాచారం.

ఇక ఈ విషయం బయటకి రావడంతో అందరు ఇప్పుడు ఆ యంగ్ హీరో ఎవరు అంటూ తెలుసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ అయితే ఈ చిత్రంలో చెయ్యట్లేదు అన్న సమాచారం ఉండడంతో ఇప్పుడు అందరిలోనూ ఈ పాత్రకి సంబంధించి ఆసక్తి పెరిగింది.

చూద్దాం.. ఏ యంగ్ హీరో ఈ పాత్ర చేయబోతున్నాడో...

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS