జ‌యల‌లిత బ‌యోపిక్‌లో న‌టిస్తోందా?

By iQlikMovies - December 24, 2018 - 15:47 PM IST

మరిన్ని వార్తలు

బ‌యోపిక్ ల హంగామా ఉధృతంగా సాగుతోంది. తెలుగులోనే కాదు, త‌మిళంలోనూ బ‌యోపిక్‌ల‌దే హ‌వా. త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి  జయలలిత జీవితాధారంగా ఇప్పుడు అక్క‌డ రెండు బ‌యోపిక్‌లు రూపొందుతున్నాయి. ఓ బ‌యోపిక్‌లో అమ్మ పాత్ర‌లో నిత్య‌మీన‌న్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.  ఏ.ఎల్‌ విజయ్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో బ‌యోపిక్ రూపుదిద్దుకుంటోంది. ఇందులో జయ పాత్ర గా విద్యా బాలన్ క‌నిపించ‌నున్న‌ద‌ని టాక్‌. ఇప్ప‌టికే విద్యాబాల‌న్‌తో విజ‌య్ సంప్ర‌దింపులు జ‌రిపారు.

జ‌య‌ల‌లిత జీవితంలో కీల‌క‌మైన వ్య‌క్తి శ‌శిక‌ళ‌. ఆ పాత్ర‌లో ఎవ‌రు క‌నిపిస్తార‌న్న ఆస‌క్తి నెల కొంది. ఆ పాత్ర‌కు గానూ.. సాయి ప‌ల్ల‌విని ఎంచుకున్న‌ట్టు సమాచారం అందుతోంది. ప్ర‌స్తుతం త‌మిళంలో ఓ సినిమా చేస్తోంది సాయి ప‌ల్ల‌వి. సూర్య క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నారు. ఈ సినిమా కూడా త‌న ఖాతాలో వేసుకుంటే... త‌మిళంలోనూ సాయి ప‌ల్ల‌వి బిజీ అయిన‌ట్టే. మ‌రి నిత్య‌మీన‌న్ బ‌యోపిక్‌లో శ‌శిక‌ళ పాత్ర ఎవ‌రికి ద‌క్కుతుందో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS