నందమూరి సినిమాని పట్టిన అనూప్ రూబెన్స్

మరిన్ని వార్తలు

అనూప్ రూబెన్స్- ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. దీనికి కారణం కాటమరాయుడు టైటిల్ సాంగ్ అని ప్రత్యేకంగా చెప్పకర్లేదు. అయితే ఇప్పుడు అతనికి వచ్చిన బాలకృష్ణ 101వ సినిమా ఆఫర్ తో అనూప్ రేంజ్ ఒక్కసారిగా డబల్ అయిందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

ఇప్పటికే అధికారికంగా మొదలయిన బాలయ్య-పూరి సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ గా అనూప్ రూబెన్స్ ని పూరి సెలెక్ట్ చేసినట్టు సమాచారం. ఆల్రెడీ తారక్-పూరి-అనూప్ కాంబినేషన్ లో వచ్చిన టెంపర్ సినిమా ఆడియో సూపర్ హిట్ అయింది.

ఇది దృష్టిలో పెట్టుకొనే పూరి అనూప్ కి ఓటు వేశాడు అన్నది ఇన్సైడ్ వర్గాల టాక్. మరి మ్యూజిక్ అబ్బాయి కి ఇచ్చిన రేంజ్ లో బాబాయి కి ఇస్తాడో లేక డోస్ పెంచుతాడో చూడాలి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS