ప్రస్తుతం తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతోంది. మొదట పాన్ ఇండియా సినిమాగా ప్రయాణం చేసి అనుకోకుండా పాన్ వరల్డ్ స్థాయికి చేరుకుంది. దానికి తగ్గట్టే బడ్జెట్ లెక్కలు కూడా పెరిగాయి. ఇపుడు తెలుగులో రిలీజ్ అయ్యే దాదాపు అన్ని సినిమాలు ఓవర్సిస్ లో కూడా బాగానే వసూళ్లు సాధిస్తున్నాయి. థియేట్రికల్ రైట్స్, మిగతా భాషల రైట్స్, ఓటీటీ అంటూ పెట్టిన మొత్తం 70 పర్శంట్ ముందే వచ్చేస్తున్నాయి. దాంతో టైర్ 2 హీరోల సినిమాలకి కూడా భారీ బడ్జెట్ పెడుతున్నారు. తెలుగు సినిమా బడ్జెట్ 100 కోట్లు అంటే అది తక్కువ బడ్జెట్ లెక్క. ఇదే విషయాన్ని తాజాగా తమ్మారెడ్డి భరద్వాజ ప్రస్తావిస్తూ, SSMB29 బడ్జెట్ గూర్చి చెప్పి అంచనాలు పెంచేశారు.
జక్కన్నతో మహేష్ చేస్తున్న సినిమా అనౌన్స్ చేసిన దగ్గరనుంచి ఎలాంటి న్యూస్ వచ్చినా క్షణాల్లో వైరల్ అయిపోతోంది. రీసెంట్ గా టాలీవుడ్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కూడా SSMB29 గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఈ మూవీపై మరిన్ని అంచనాలు పెంచాయి. మహేశ్, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ బడ్జెట్ 1000 కోట్లు వరకు చేరుకుంటుందని, కారణం ఫారెన్ కంట్రీస్ లో చిత్రించటం, అంతర్జాతీయ నటీ నటులు నటిస్తుండటంతో వారి రెమ్యూనరేషన్ ఇలా అన్ని కలిపి 1000 కోట్లు దాటొచ్చునని టీమ్ భావిస్తోందన్నారు.
SSMB29 కి 1000 కోట్లు పెట్టినా ఏం నష్టం రాదని, భయం లేదని, అదంతా జక్కన్న ప్రతిభపై ఉన్న నమ్మకం అని తెలిపారు తమ్మారెడ్డి. 1000 కోట్లు పెడితే 2వేలు నుంచి 3వేల కోట్ల వసూల్ చేసే సత్తా రాజమౌళి మేకింగ్ కి ఉందని కితాబు ఇచ్చారు. బాహుబలి తరువాత తెలుగు సినిమా స్థాయి పెరిగింద న్నారు తమ్మారెడ్డి, 100 కోట్లు అంటే ఇప్పుడు చాలా మాములు బడ్జెట్ అని తెలిపారు. RRR తరువాత 300 కోట్లు కూడా చిన్న బడ్జెట్ అయిపోయిందన్నారు. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన తెలుగు సినిమా SSMB29 తరవాత ప్రపంచం నలుమూలలా తెలుగు సినిమా కీర్తి వ్యాపిస్తుంది అని నమ్మకంగా చెప్పారు తమ్మారెడ్డి.