కల్కిలో బుజ్జి గాడి కాస్ట్ ఎంత?

మరిన్ని వార్తలు

కల్కి మానియాలో ఉన్న సినీప్రియులకి రోజు కొక అప్డేట్ వస్తోంది. ఈ మూవీకి సంబంధించి ఈ రోజు రామోజీ ఫిలింసిటీలో సాయంత్రం 5 గంటలకు గ్రాండ్ ఈవెంట్ నిర్వహించే పనిలో ఉన్నారు మేకర్స్. ఈ ఈవెంట్ లో బుజ్జి పాత్రను పరిచయం చేయనున్నారు. ఈ ఈవెంట్ కి ప్రభాస్ ఫాన్స్ తరలి రానున్నారు.  ఈ లోగా ఒక్కో విషయం బయటకి వచ్చి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. రీసెంట్ గా కమల్ హాసన్ పారితోషికం గూర్చి న్యూస్ వచ్చింది. కేవలం సినిమాలో 20  నిముషాలు కనిపించినందుకు 10 కోట్లు తీసుకున్నట్లు టాక్. ఇప్పుడు ప్రభాస్ వాహనానికి పెట్టిన ఖర్చు రికార్డ్ స్థాయిలో ఉంది. 


రీసెంట్ గా కీర్తి సురేష్ వాయిస్ తో కల్కి సినిమాలో ప్రభాస్ పాత్ర అయిన భైరవ, అతని వాహనం బుజ్జిల గూర్చి ఓ వీడియో చూపించారు. జంతువులని,  మనుషులని ముద్దుగా  పిలుచుకునే ఈ పేరు మొదటి సారి ఓ వాహనానికి వాడటం కొత్తగా ఉంది. బుజ్జి అంటే ఇంకేదో అనుకున్నారు కానీ వాహనం అని తెలిసింది.  వాహనం అంటే ఏ కారో, బండో కాదు దర్శకుడు నాగ్ అశ్విన్ కల్కి కోసం స్పెషల్ గా తయారుచేయించారట. నాగ అశ్విన్ ఆనంద్ మహేంద్రని కలిసి కల్కి సినిమా కోసం స్పెషల్ గా వెహికల్స్ కావాలి అని తనకు నచ్చినట్టు డిజైన్ చేయించుకున్నాడు. 


ఆవాహనానికి 7 కోట్లు ఖర్చుపెట్టినట్టు సమాచారం. మూవీలో కొన్ని వార్ సన్నివేశాలు ఉంటాయని, ఆ సీన్స్ లో ఈ వెహికల్ ఉపయోగించినట్టు తెలుస్తోంది. ఇది గాల్లోకి కూడా ఎగురుతుంది. అందుకనే దీనికి ఇంత ఖర్చు చేసినట్లు టాక్. ఒక  స్టార్ హీరోయిన్ రెమ్యునరేషన్ అంత ఉంది ఈ వెహికల్ కాస్ట్.  ఇది తెలిసిన ప్రభాస్ ఫాన్స్ ఆశ్చర్యపోతున్నారు. సినిమాలో బుజ్జిని చూడాలని తహ తహ లాడుతున్నారు. ఇలా చాలా కొత్త కొత్త విశేషాలు కల్కి లో చోటు చేసుకున్నాయని  తెలుస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS