పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పకర్లేదు. ఎందుకంటె, పవన్ కి ఫాలోయింగ్ మనం తరుచూ ఆడియో ఫంక్షన్లలో చూస్తూనే ఉంటాము.
అయితే దీన్ని మాత్రం బాహుబలి 2 కథా రచయత అయిన విజయేంద్రప్రసాద్ ఇంకొక కోణంలో చూశారు. బాహుబలి 2లో ఇంటర్వెల్ సమయంలో వచ్చే సన్నివేశం గురించే సినిమా చూసిన అందరు మాట్లాడుకుంటున్నారు. అయితే ఆ సీన్ రాయడం వెనుక జరిగిన కథని ఆయన చెప్పారు.
విషయంలోకి వస్తే, బాహుబలి 2 ఇంటర్వెల్ సీన్ ఎలా రాయాలో అని ఆలోచిస్తున్న సమయంలో విజయేంద్రప్రసాద్ ఓ ఆడియో ఫంక్షన్ చూసారట. అందులో పవన్ కళ్యాణ్ లేకపోయినా, ఆయన ఫ్యాన్స్ మాత్రం ఆయన పేరుని పిలవడం ఈ సన్నివేశం రాయడానికి స్ఫూర్తి అట.
అయితే ఇప్పటికే బాహుబలి 2 చిత్రం చూసినవారికి ఆ సన్నివేశం గురించి ఇప్పటికే అర్ధమవుతుంది. ఇక చూడనివారు మాత్రం తాము చూసినప్పుడు బాహుబలి2 ఇంటర్వెల్ కి పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ కి సంబంధం ఇట్టే తెలిసిపోతుంది.
మొత్తానికి పవన్ ఫాలోయింగ్ బాహుబలి 2 పైన కూడా పడింది.