ఘాజీ- ఇప్పుడు ఎక్కడ చూసినా ఎవరు మాట్లాడినా ఈ చిత్రం గురించే..
అంతగా అందరి అభినందనలు చూరగొన్న చిత్రంగా దీనికి ప్రత్యేకంగా గుర్తింపు దక్కింది. అయితే, ఇప్పుడు ఈ సినిమా పై కాపీ చిత్రమనే విమర్శలు మొదలయ్యాయి. వివరాల్లోకి వెళితే, 1995లో వచ్చిన క్రిమ్సన్ టైడ్ అనే ఇంగ్లీష్ చిత్రంలోని కధకు ఇది పోలి ఉందని, ఆ కధలో కూడా సబ్ మెరైన్ కెప్టెన్ కి అతని జూనియర్ ఆఫీసర్ కి జరిగే సంఘర్షణ నేపధ్యంలో సాగే కధ.
అయితే కొంతమంది మాత్రం, ఘాజీ డైరెక్టర్ ఆ నేపధ్యాన్ని తీసుకొని ఉంటే ఉండొచ్చు కాని ఆ కధనాన్ని మనకు సరిపోయే విధంగా చక్కగా మార్చుకున్నాడు అని వాదిస్తున్నారు. వీరి వాదనలు ఇలా ఉండగా, అప్పుడే యు ట్యుబ్ లో క్రిమ్సన్ టైడ్ గురించి వెతకడం మొదలుపెట్టారు అని వినికిడి.
ఏదైతేనేమి మనవరకు ఇది తొలి అండర్ వాటర్ వార్ సినిమా అలాగే ఇలాంటి తొలి ప్రయత్నాన్ని చేసిన ఘాజీ టీంకి మనవాళ్ళు కూడా తమ మద్దతు బాగానే తెలియచేసారు అని చెప్పాలి (కల్లెక్షన్స్ పరంగా చూస్తే).