ప్రముఖ నటులు జీవిత, రాజశేఖర్ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. రాజశేఖర్ భార్య జీవిత అన్నయ్య 'మురళి శ్రీనివాస్' కొద్దిసేపటి క్రితం మరణించారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యం తో బాధపడుతూ, ఈ రోజు తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు.
మురళి శ్రీనివాస్ పార్ధీవ దేహాన్ని చివరి సారి చూసేందుకు ఈరోజు ఉదయం 9.30 నుండి 11 గంటల వరకు ఫిలిం చాంబర్ లో ఉంచుతారు. తరువాత మహాప్రస్థానం లో ఆయన అంతక్రియలు నిర్వహించబోతున్నారు. రాజశేఖర్ అమ్మ కూడా కొద్దిరోజుల క్రితమే అనారోగ్యంతో మరణించారు.
రాజశేఖర్ హీరోగా నటించిన 'పి.ఎస్.వి గరుడవేగ' చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇలాంటి ఆనంద సమయంలో జీవితా రాజశేఖర్ ఇంట విషాదం నెలకొనడంతో అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.