పవన్ కళ్యాణ్ కొత్త సినిమా కాటమరాయుడు షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో జరుగుతుంది. ఈ చిత్రం యొక్క చిత్రీకరణ త్వరగా ముగించి రాబోయే ఉగాదికి రిలీజ్ చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
కాని అసలు విషయానికి వస్తే, కాటమరాయుడు టీం కొన్ని సీన్స్ అవుట్ పుట్ తో అంతగా సంతృప్తి చెందలేదనేది ఇన్సైడ్ టాక్. అందుకే ఆ కొన్ని సీన్స్ ని మళ్ళీ రీ-షూట్ చేసే యోచనలో ఉన్నారట, దీనికి పవన్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఏదేమైనా సినిమాని మాత్రం ఉగాది బరిలో నిలిపేందుకు టీం మొత్తం శాయశక్తుల కృషి చేస్తున్నారు.
ఇదంతా పక్కన పెడితే, ఫ్యాన్స్ మాత్రం 26న విడుదలకబోయే టీజర్ కోసం ఎదురు చూస్తున్నారు. ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సంక్రాంతికే విడుదల కావాల్సి ఉన్న టీజర్ వాయిదా పడింది. అయితే పవన్ మరి ఈ సంవత్సరం పాత సంవత్సరంలా నిరాశ పరుస్తాడో లేక అభిమానుల మనసు గెలుస్తాడో చూడాలంటే ఇంకొన్ని రోజులు ఆగక తప్పదు.