తరుణ్‌ అది రిపీట్‌ చేస్తాడా?

మరిన్ని వార్తలు

తరుణ్‌ హీరోగా నటించిన 'నువ్వే కావాలి' సినిమా అప్పట్లో ఓ సెన్సేషన్‌. ఆ సినిమాకి ఇప్పటికీ ఆ క్రేజ్‌ అలానే ఉంటుంది. తరుణ్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది ఆ సినిమా. ఛైల్డ్‌ ఆర్టిస్ట్‌గా పరిచయమైన తరుణ్‌కి లవర్‌ బోయ్‌ ఇమేజ్‌ని తెచ్చి పెట్టింది ఆ సినిమా. ఆ తరువాత అలాంటి హిట్‌ని తరుణ్‌ మళ్లీ అందుకోలేకపోయాడు. కొన్ని కెరీర్‌ బెస్ట్‌ హిట్స్‌ి ఉన్నప్పటికీ అవేమీ 'నువ్వే కావాలి' సినిమా అంతటి బెస్ట్‌ సక్సెస్‌లు కావనే చెప్పాలి. అలా అలా తరుణ్‌ని మెల్ల మెల్లగా మర్చిపోతున్న తరుణంలో 'ఇది నా లవ్‌స్టోరీ' అంటూ తన లవర్‌ బోయ్‌ ఇమేజ్‌కి కొన్ని తుది మెరుగులు దిద్ది ప్రేక్షకుల్ని మళ్లీ మెప్పిస్తానంటున్నాడు యంగ్‌ హీరో తరుణ్‌. రమేష్‌ గోపి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని రామ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రూపొందిస్తున్నారు. ఓవియా ఈ సినిమాతో కథానాయికగా పరిచయం అవుతోంది. కాగా ఈ సినిమాలో తరుణ్‌ రెండు డిఫరెంట్‌ గెటప్స్‌లో కనిపిస్తున్నాడు. తరుణ్‌ మంచి నటుడు. అయితే కాలం కలిసి రావడం లేదు. కానీ ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు తరుణ్‌. స్టోరీ డిఫరెంట్‌ హార్ట్‌ టచ్చింగ్‌ లవ్‌ స్టోరీ. లవ్‌స్టోరీస్‌కి ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. అయితే కొంచెం కొత్తగా చూపిస్తే మరింత ఆదరిస్తారు ప్రేక్షకులు. తరుణ్‌కి యూత్‌లోనే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్‌లో కూడా మంచి ఫాలోయింగ్‌ ఉంది. అందర్నీ ఈ సినిమాతో సేటిస్‌ఫై చేసి తీరతానంటున్నాడు. ఇంత గ్యాప్‌ తీసుకుని ఎంతో నమ్మకంతోనే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నానని తరుణ్‌ అంటున్నాడు. ఏమో చూద్దాం ఈ సినిమా తరుణ్‌కి 'నువ్వే కావాలి' అంతటి హిట్‌ అందిస్తుందో లేదో! 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS