చిరంజీవి రీ ఎంట్రీ సినిమా గురించి ఎందరో డైరెక్టర్లు క్యూ కట్టారు. కానీ ఆ అరుదైన అవకాశం వినాయక్‌కి దక్కింది. అంతేకాదు ఆ టైంలో 'అఖిల్' పరాజయంతో వినాయక్ చాలా నిరాశలో ఉన్నాడు. అలాంటి టైంలో మెగాస్టార్ పిలిచి వినాయక్‌కి తన 150వ చిత్రాన్ని తెరకెక్కించే అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు. అందుకే ఆ అవకాశాన్ని ఎంతో అపురూపంగా భావించి, బాస్‌తో తెరకెక్కించిన సినిమా 'ఖైదీ నెంబర్ 150'. ఈ సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న టైంలోనే చిరంజీవి, వినాయక్‌తో మరో సినిమా చేయాలని చెప్పారట. అయితే అది ఎప్పుడన్నదీ క్లారిటీ లేదు. కానీ చిరంజీవి 151వ సినిమా మాత్రం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోందన్న సంగతి కాన్‌ఫామ్ అయ్యింది. ఈ సినిమా కొణిదెల ప్రొడక్షన్స్‌లో రామ్ చరణే నిర్మించనున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత చిరంజీవి, అల్లు అరవింద్ నిర్మాణంలో ఓ సినిమా చేయనున్నాడు. ఒకవేళ ఈ సినిమాకి వినాయక్‌కి ఛాన్స్ ఉందేమో అని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారమ్. గతంలో ఈ కాంబినేషన్‌లో అల్లు అర్జున్ హీరోగా 'బద్రీనాధ్' సినిమా తెరకెక్కింది. మళ్లీ ఇన్నాళ్లకు మెగాస్టార్‌తో ఈ కాంబినేషన్‌లో తెరకెక్కే సినిమా ఇదే కావచ్చు. ఒకవేళ ఇదే నిజమైతే వినాయక్, చిరును ఇంకెంత బాగా చూపించాలా అని స్కెచ్ ప్రిపేర్ చేసేసుకుంటున్నాడట. అదీ కాక రీ ఎంట్రీలో వచ్చిన ఫస్ట్ సినిమా కావడంతో 'ఖైదీ' సినిమా పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఇక తర్వాత వచ్చే సినిమాకి వినాయక్ ఇంకా అదిరిపోయే అవుట్ పుట్‌ని ఇవ్వగలడేమో కూడా.