'అఖండ' మూవీ రివ్యూ& రేటింగ్

మరిన్ని వార్తలు

నటీనటులు: నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్, జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణ తదితరులు
దర్శకత్వం : బోయపాటి శ్రీను
నిర్మాతలు: మిర్యాల రవీందర్‌రెడ్డి
సంగీత దర్శకుడు: త‌మన్‌ ఎస్‌‌‌
సినిమాటోగ్రఫీ: సి. రాంప్రసాద్‌
ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వరరావు


రేటింగ్: 3/5


నందమూరి బాలకృష్ణ-  బోయ‌పాటి శ్రీను.. పక్కా మాస్ కమర్షియల్ కాంబినేషన్. ‘సింహా’, ‘లెజెండ్‌’ చిత్రాలు బాక్సాఫీసుని షేక్ చేశాయి. రికార్డుల వర్షం కురిపించాయి. అలాంటి ఇద్దరి కలయికలో సినిమా అంటే సహజంగానే భారీ అంచనాలువుంటాయి. వీరి కలయికలో ఇప్పుడు మూడో సినిమాగా 'అఖండ' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అఖండ ఫస్ట్ లుక్ తోనే సినిమాపై భారీ అంచనాలు ఏర్పడిపోయాయి.

 

ట్రైలర్ రిలీజైన తర్వాత మాస్ కి పూనకాలు మొదలైయ్యాయి. తొలిసారి బాలయ్యని అఘోరగా చూసి ఫ్యాన్స్  థ్రిల్ అయిపోయారు. సినిమా ఎప్పుడా? అని ఎదురుచూశారు. సినిమాపై బోలెడు అంచనాలు పెట్టుకున్నారు. మారా అంచనాలని అఖండ అందుకున్నాడా ? బాలయ్య- బోయపాటి హ్యాట్రిక్ కొట్టారా ? ఇంతకీ ఏమిటీ అఖండ క‌థ ? 


క‌థ:


ముర‌ళీ కృష్ణ (బాల‌కృష్ణ ) అనంతపురంలో ఓ రైతు. ఫ్యాక్షనిజాన్ని అరికట్టి ఎంతోమందిని రైతులుగా తీర్చిదిద్దుతాడు. పేద ప్రజ‌ల‌కు విద్య, వైద్యం అందిస్తుంటాడు. అదే జిల్లాకి క‌లెక్టర్ గా శ‌ర‌ణ్య (ప్రగ్యా జైస్వాల్‌) వస్తుంది. మురళీకృష్ణని ఇష్టప‌డుతుంది. ఇద్దరూ మూడుముళ్ళతో ఒక్కటౌతారు. ఒక బిడ్డ కూడా పుడుతుంది. కట్ చేస్తే.. అనంతపురంలో వ‌ర‌ద‌రాజులు (శ్రీ‌కాంత్)  క్రూరమైన వ్యక్తి. యురేనియం మైనింగ్ చేస్తుంటాడు.

 

యురేనియం త‌వ్వకాలతో చిన్నారుల ప్రాణాల‌కి ప్రమాదం ఏర్పడుతుంది. మైనింగ్ మాఫియా ఆపడానికి ముర‌ళీకృష్ణ వరదరాజులుతో తలపడతాడు. అయితే చేయని నేరాన్ని మురళి కృష్ణ పై నెట్టి అరెస్ట్ చేయిస్తాడు వరదరాజులు. ఈ దశలో మురళీ కృష్ణని రక్షించడానికి అఖండ రంగప్రవేశం చేస్తాడు. ఇంతకీ ఎవరీ అఖండ ? మురళీ కృష్ణకి అఖండకి మధ్య వున్న బంధం ఏమిటి ? వరదరాజులు ముఠాని అఖండ ఎలా అంతం చేశాడు ? అనేది మిగిలిన క‌థ. 


విశ్లేషణ


బాలకృష్ణని ఎలా చూపించాలో బోయపాటికి తెలిసినంతగా ఈ మధ్య కాలంలో మరో దర్శకుడికి తెలీదనే మాట నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే బాలయ్యకు 'సింహా' తర్వాత అలాంటి హిట్టు మళ్ళీ పడలేదు. లెజండ్ తర్వాత మళ్ళీ బ్లాక్ బస్టర్ రాలేదు.  ఇప్పుడు మరోసారి బోయపాటి బాలయ్య కలిశారు. బోయపాటికి గత సినిమా 'వినయ విధేయ రామ' లాంటి ఫ్లాఫ్ వున్నా.. బాలయ్యతో సినిమా అనేసరికి అదీ పక్కకు వెళ్ళిపోయింది. ఈసారితో హ్యాట్రిక్ పక్కా అనే అంచనాలతోనే థియేటర్ లో అడుగుపెట్టాడు ప్రేక్షకుడు. ప్రేక్షకుడు వూహించినట్లే  హ్యాట్రిక్ వచ్చేసింది.  


బాలయ్య అంటే మాస్. హీరోయియిజం, ఎమోషన పీక్స్. సింహ.. లెజెండ్ లో కూడా ఇదే వుంది. అఖండకి వచ్చేసరికి కూడా ఈ మూడింటిని  చక్కగా పట్టుకున్నాడు బోయపాటి. ''ప్రతి సీను క్లైమాక్స్ లా వుంటుంది''అని కామన్ గా ఓ డైలాగ్ వుంటుంది. అఖండలో కూడా ప్రతి ఫైట్ క్లైమాక్స్ లా వుంటుంది. ప్రతి ఎలివేషన్ హీరో ఎంట్రీలా వుంటుంది. ఇది మాస్ కి తెగ నచ్చుతుంది.  బాలయ్య అభిమానులు కోరుకునే అన్నీ ఎలిమెంట్స్ అఖండలో వున్నాయి. వాటిని మిక్స్ చేసిన విధానం కూడా బావుంది. బేసిగ్గా బోయపాటి హీరో పరిమితుల్లేకుండా ఉంటాడు. ఇందులో హీరో అఘోర అనేసరికి ఇంక హద్దులు చెరిపేశారు బోయపాటి. 


ఫస్ట్ హాఫ్ లో ముర‌ళీకృష్ణ - శ‌ర‌ణ్యల ట్రాక్,,. వరదరాజులు మైనింగ్ మాఫియా ఆగడాలతో సాగుతుంది. సెకండ్ హాఫ్ కి ముందు అఖండ పాత్ర రంగ ప్రవేశం వుంటుంది.  అఖండ పాత్ర ప్రవేశం త‌ర్వాత సినిమా పూర్తిగా మారిపోతుంది. అక్కడి నుంది ఇంక యుద్దకాండమే. అఘోరాగా బాలయ్యని చూడటం, ఆ పాత్ర మలచిన విధానం ఫ్యాన్స్ కి తెగ నచ్చుతుంది. బేసిగ్గా బాలయ్యని పవర్ ఫుల్ గా చూపిస్తారు బోయపాటి. అఖండకి వచ్చేసరికి అది మరో లెవెల్ కి వెళ్ళింది. చిన్నారులు, దేవాల‌యాలు, ప్రకృతి గురించి బాలయ్య చెప్పిన డైలాగ్స్ గూజ్ బప్స్ తెప్పిస్తాయి. అఖండ పాత్రని మలచిన విధానం ఫ్యాన్స్ ని తెగ ఆకట్టుకుంటుంది. బాలయ్య అభిమానులు, మాస్ ని ఇష్టపడే ప్రేక్షకులకు అఖండ ఓ పండగే.  


ఎవరెలా చేశారు ? ముందుగా బాలయ్య ఎనర్జీకి హ్యాట్సప్ చెప్పాలి. బాలయ్య తెరపై కనిపించి విధానం చూస్తుంటే తన అభిమానులు నిరాశ పరచకూడదనే తపన ప్రతి ఫ్రేమ్ లో కనిపించింది.  ఫైట్లు, డైలాగ్స్ , డ్యాన్స్ .. ఇలా అన్నీ ఎలిమెంట్స్ ని జై బాలయ్య అనిపిస్తారు. ముర‌ళీకృష్ణ పాత్రలో కూల్ గా కనిపించారు. అఖండ పాత్ర అయితే బాలయ్య ఫ్యాన్స్ ని తెగ నచ్చేస్తుంది. లౌడ్ సౌండ్, యాక్షన్ ని ఇష్టపడే ప్రేక్షకులు భలే ఎంజాయ్ చేస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే అఖండ బాలయ్య వన్ మ్యాన్ షో. ప్రగ్యా జైస్వాల్‌ అందంగా కనిపించింది. ఆమె పాత్ర అఖండ రంగ ప్రవేశంలో కీలకం. వరదరాజులు పాత్రలో శ్రీకాంత్  క్రూరంగా కనిపించాడు. అయితే లెజండ్ లో జగపతి పాత్ర పేలినట్లు వరదరాజులు పాత్రకు అంత ఎఫెక్ట్ లేదు. జగపతి బాబు పాత్రని అంతగా వాడుకోలేదు. పూర్ణతో పాటు మిగతా నటీనటులు పరిధి మేర చేశారు. 


సాంకేతికత:


త‌మ‌న్ సంగీతం అదిరిపోయింది. అఘోరా నేప‌థ్యంలో వ‌చ్చే స‌న్నివేశాల్లో నేప‌థ్య సంగీతం థియేటర్ లో మాములుగా లేదు.  జైబాల‌య్య, అఖండ  పాట‌లు బాగున్నాయి. రామ్‌ప్రసాద్ కెమెరా ప‌నిత‌నం చక్కగా కుదిరింది.  రామ్‌ల‌క్ష్మణ్‌ లకి ఎక్కవ మార్కులు పడతాయి. యాక్షన్ ని మరో లెవల్ లో డిజైన్ చేశారు. ఎడిటర్ యాక్షన్ సీన్స్ ని కొంచెం శార్ఫ్ చేయాల్సింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి.


ప్లస్ పాయింట్స్


బాలయ్య నటన
యాక్షన్, మ్యూజిక్ 
డైలాగ్స్ 


మైనస్ పాయింట్స్


మితిమీరిన హింస, 
రొటీన్ గా అనిపించే క్లైమాక్స్ 


ఫైనల్ వర్దిక్ట్ :  'అఖండ' విజయం


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS