'అల్లుడు అదుర్స్' మూవీ రివ్యూ & రేటింగ్!

మరిన్ని వార్తలు

నటీనటులు : బెల్లంకొండ శ్రీనివాస్, నభా నటేష్, సోను సూద్ తదితరులు 
దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్
నిర్మాత‌లు : గొర్రెల సుబ్రహ్మణ్యం
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫర్ : చోట కె నాయుడు
ఎడిటర్: తమ్మిరాజు

రేటింగ్: 2/5

అల్లుడు శీను తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఆరంభంలోనే అదుర్స్ అనిపించాడు. అయితే తర్వాత హిట్ లేకుండా పోయింది. ఆ మద్య వచ్చిన రాక్షసుడు హిట్ టాక్ తెచ్చుకుంది కానీ శీను కోరుకునే కమర్షియల్ విజయాన్ని ఇవ్వలేకపోయంది. అందుకే ఈ సారి అన్నీ కమర్షియల్ హంగులతో మళ్ళీ అల్లుడు సెంటిమెంట్ ని నమ్ముకొని 'అల్లుడు అదుర్స్' తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి శీను కోరుకుంటున్న విజయాన్ని ఈ ఇల్లుడు ఇచ్చాడా ? ఇంతకీ సినిమా ఎలావుందో తెలుసుకోవాలంటే రివ్యూ లోకి వెళ్ళాల్సిందే.  


కధ: 


శీను (బెల్లంకొండ శ్రీనివాస్) తొమ్మిదో క్లాస్ లోనే వసుంధర (అను ఇమ్మాన్యుయేల్)ని ప్రేమిస్తాడు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల శీనుని వదిలివెళ్ళిపోతుంది వసుంధర. దీంతో మనసు ముక్కలైపోయిన శీను .. ఇక ఎవరినీ ప్రేమించకూడదని నిర్ణయించుకుంటాడు. పెరిగి పెద్దయిన తర్వాత కౌముది (నభా నటేష్) చూసిన వెంటనే ప్రేమలో పడిపోతాడు. కానీ కౌముదికి ప్రేమ అంటే గిట్టదు. అయితే పది రోజుల్లో ప్రేమలో దించేస్తానని తండ్రి ( ప్రకాష్ రాజ్ ) తో ఛాలెంజ్ చేస్తాడు. ఈ దశలో వసుంధర మళ్ళీ శీను జీవితంలోకి వస్తుంది. అయితే అప్పటికే ఆమె గజ( సొనూ సూద్) ప్రేమలో వుంటుంది. ఇప్పుడు శీను ఏం చేశాడు ? అసలు ఈ గజ ఎవరు ? గజాకి, శీనుకి మధ్య వున్న వైరం ఏమిటి? ఈ ముగ్గురి కధ చివరికి ఏమయింది? అనేది తెలియాలంటే థియేటర్ లో అల్లుడు బొమ్మ చూడాలి.   


విశ్లేషణ:

 

చాలా ఈజీగా అనిపించే అతి కష్టమైన ఫార్ముల కమర్షియల్ సినిమా. ఈ ఫార్ముల ఇప్పటికీ చాలా మంది దర్శకులకు అంతు చిక్కదు. ఒకసారి లెక్క సరిగ్గా వచ్చింది కదా అని ఏ లెక్కకైనా అదే సూత్రం వాడితే మాత్రం లెక్క తప్పడం కాదు.. తలబొప్పి కట్టే ఫలితం వస్తుంది. అల్లుడు అదుర్స్ కి కూడా ఇలాంటి జండూబామ్ రిజల్ట్ వచ్చింది. చిన్నప్పుడు చదివిన ఆవు పులి వ్యాసాన్ని మన దర్శకులు బాగా బట్టీ పట్టేశారు. సప్త సముద్రాల దాటి ఓ మనిషి అని కధ మొదలుపెట్టినా.. మళ్ళీ రొటీన్ గా .. అతడు ఓ అమ్మాయిని ప్రేమించాడు... అతడికో విలన్ తగిలాడు... విలన్ ని కుమ్మేశాడు.. మధ్యలో ఓ ఐటెం సాంగ్ కూడా వేసుకున్నాడు.. ఇలా ముగించేస్తారు. అల్లుడు అదుర్స్ కూడా ఇలాంటి రొటీన్ రొట్టే. ఇంకోలా చెప్పాలంటే.. కందిరీగ సినిమాని కిందామీద చేసిన అల్లుడు అదుర్స్ ని చూపించాడు దర్శకుడు సంతోష్ శ్రీనివాస్. 


సంతోష్ శ్రీనివాస్ నుండి ప్రేక్షకుడు పెద్దగా ఏం ఆశించడు. జస్ట్ టైం పాస్ అయిపోతే చాలు అనుకుంటాడు. అయితే ఈ టైం పాస్ వినోదం కూడా పంచలేకపోయింది అల్లుడు అదుర్స్. కామెడీ ఆనుకున్న సీన్లు తేలిపోయాయి.. ప్రతిసారి కందిరీగ' సినిమానే గుర్తుకొస్తూ ఉంటుంది. కాన్సెప్ట్‌ కొత్తగా లేనప్పుడు కనీసం సన్నివేశాల్లో కొంచెం వైవిధ్యం చూపించి కొత్త సినిమా చూస్తున్నాం అనే ఫీలింగ్ కలిగించాలి. దర్శకుడు అలాంటి ప్రయత్నం ఏం చేయలేదు. చాలా పేలవమైన సీన్స్ తో నడిపించాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఇంచు కూడా కధ ముందుకు సాగదు. నాలుగు లవ్ సీన్స్, మూడు కామెడీ బిట్లు..ఇలా మొదటి సగంకు మంగళం పాడేశారు.

 

ఇంక సెకండ్ హాఫ్ లో లోనై మెరుపులు ఉంటాయని ఆశించిన ప్రేక్షకుడికి నిరాశ తప్పదు. కామెడీ కోసం తెగ ప్రయత్నించారు. బ్యాటింగ్ చేయడానికి బౌలర్లు వరసకట్టినట్లు ఎవరెవరో వస్తుంటారు.. వెళ్తుంటారు. ఒక దశలో ఇది ఓ కామెడీ స్కిట్టా అనే ఫీలింగ్ లోకి వచ్చేస్తాం. కధకు సహకరించని పాత్రలు ఇందులో అనేకం. అందుకే ఎవరికీ ఒక రిజిస్ట్రేషన్ వుండదు. ఇక హారర్ కామెడీ అయితే కాస్త వెగటుగా అనిపిస్తుంది. మొత్తానికి పరమ రొటీన్ గా శుభం కార్డ్ వేసి ఇదే మా సంక్రాంతి సందడని చెప్పింది అల్లుడు అదుర్స్ టీం. 


నటీనటులు:

 

కధ, కధనంలో కొత్తదనం లేనప్పుడు నటీనటులు ఏం చేస్తారు ? అందరూ సోసో గానే చేశారు. హీరో చుట్టూ నడిచే కధ ఇది. శ్రీనివాస్ ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తాడు. డ్యాన్సలు, ఫైట్లు తిరుగులేదు. కానీ కామెడీ చేయడం అంత తేలికకాదు. ఆ సీన్స్ లో తేలిపోయాడు. ఇద్దరు హీరోయిన్లు ఓకే. బిగ్ బాస్ క్రేజ్ తో మోనాల్ ని ఓ పాట కోసం తెచ్చారు. ఆ పాట మాస్ కి నచ్చుతుంది. ప్రకాష్ రాజ్ ని వాడుకోవడం రాలేదు. కరోనా తర్వాత ఇండియాలోనే రియల్ హీరో అయిపోయాడు సోనూ సూద్. ఇప్పుడు క్రూరమైన విలన్ గా ఆయన్ని చూపిస్తే అది యాక్టింగ్ అనే సంగతి తెలిసిపోతుంది. సంతోష్ శ్రీనివాస్ కి ఈ ఛాలెంజ్ ఎదురైయింది. అందుకే ఎలా చూపించాలో అర్ధం కాక అతుకుల బొంతలా విలన్ పాత్రని డిజైన్ చేయాల్సివచ్చింది. మిగతా నటీనటులు అలా వచ్చి ఇలా వెళ్లిపోవదానికే పరిమితమయ్యారు.  


సాంకేతికంగా : 


నిర్మాణ విలువలు బావున్నాయి. చోటా కె. నాయుడు ప్రతి ఫ్రేమ్ ని రిచ్ గా చూపించారు. కొన్ని స్టయిలీష్ షాట్స్ వున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ మెరుపులు లేవు కానీ ఓకే. దర్శకుడు రాసుకున్న కొన్ని పంచ్ డైలాగులు పేలాయి. ఆర్ట్ విభాగానికి మంచి మార్కులు పడతాయి. నిర్మాణం విషయంలో రాజీ పడలేదు. 

 

ప్లస్ పాయింట్స్: 

కొన్ని కామెడీ సీన్స్ 

నిర్మాణ విలువలు 


మైనస్ పాయింట్స్: 

రొటీన్ ఫార్ముల 
పండని వినోదం 
కొత్తదనం లేకపోవడం 


ఫైనల్ వ‌ర్డిక్ట్‌: ప్రేక్షకుడు 'బెదుర్స్'


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS