బేబీ మూవీ రివ్యూ & రేటింగ్

మరిన్ని వార్తలు

చిత్రం: బేబీ
నటీనటులు: ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య, నాగబాబు తదితరులు
దర్శకత్వం: సాయి రాజేష్
 

నిర్మాత: ఎస్.కె.ఎన్
సంగీతం: విజయ్ బుల్గానిన్
ఛాయాగ్రహణం: ఎం.ఎన్. బాల్ రెడ్డి
కూర్పు: విప్లవ్ నైషధం
 

బ్యానర్స్: మాస్ మూవీ మేకర్స్ 
విడుదల తేదీ: 14 జులై 2023


ఐక్లిక్ మూవీస్ రేటింగ్‌: 2.75/5
 

స్టిఫెన్ శంకర్ అలియాస్ సాయి రాజేష్ సినిమా ప్రయాణం చాలా వెరైటీ గా జరిగింది. హృదయ కాలేయం అనే బఫూన్ కామెడీ తీసిన దర్శకుడే సాయి రాజేష్. ఐతే కలర్ ఫోటో తో ఒక్కసారిగా షాక్ ఇచ్చాడు. ఆయన కథతో తెరకెక్కిన ఆ సినిమా ఏకంగా జాతీయ అవార్డ్ గెలుచుకొంది. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో ‘బేబీ’ వచ్చింది. విడుదలకు ముందే ఓ రెండు మేఘాలు పాట హిట్టు కావడం, ఆనంద్ దేవరకొండ హీరో కావడం, ప్రమోషనల్ కంటెంట్ ఆకట్టుకోవడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. మరా ఆసక్తి సినిమాలో కొనసాగిందా ? ఇంతకీ ఈ బేబీ కథ ఏమిటి ? 


కథ: వైష్ణవి (వైష్ణవి చైత‌న్య), ఆనంద్ (ఆనంద్ దేవ‌ర‌కొండ‌) లది ఒకటే బస్తీ.  వీరి ప్రేమ స్కూల్ డేస్‌లోనే మొదలౌతుంది. ఐతే ప‌దో త‌ర‌గ‌తి త‌ప్పడంతో ఆనంద్ ఆటో డ్రైవ‌ర్‌గా మారిపోతాడు.  వైష్ణవిమాత్రం ఇంట‌ర్ పూర్తి చేసి ఓ పెద్ద ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో చేరుతుంది. అక్కడ కొత్త ప‌రిచ‌యాల వ‌ల్ల వైషూ ఆలోచ‌నా విధానంలో మార్పులు మొద‌ల‌వుతాయి. ఈ క్రమంలోనే ఆమె త‌న క్లాస్‌మెట్‌ విరాజ్ (విరాజ్ అశ్విన్)కు దగ్గరవుతుంది. స్నేహం పేరుతో మొద‌లైన ఆ బంధం రూటు మార్చుకొని శారీర‌కంగా బంధం వరకూ వెళుతుంది. మ‌రి ఆ త‌ర్వాత ఏమైంది?  వీరిద్దరి వ్యవ‌హారం ఆనంద్‌కు తెలిసిందా?  నిజం తెలిశాక ఆనంద్ ఏం చేశాడు ? చివరికి ఈ ట్రై యాంగిల్ లవ్ స్టొరీ ఏ తీరానికి చేరింది ? అన్నది తక్కిన కథ. 


విశ్లేషణ: ''మొద‌టి ప్రేమ‌కు మ‌ర‌ణం లేదు.మ‌న‌సు పొర‌ల్లో శాశ్వ‌తంగా స‌మాధి చేయ‌బ‌డి ఉంటుంది'' బేబీ ట్రైలర్ లో వినిపించిన డైలాగ్ ఇది. 'బేబీ' సినిమా ఈ పాయింట్ చుట్టూ తిరుగుతుంద‌ని ద‌ర్శకుడు ముందే చెప్పేశాడు.  ఆనంద్ మందుకి బానిసై తన గతాన్ని గుర్తు చేసుకోవడంతో కథ మొదలౌతుంది. తొలి ముఫ్ఫై నిమిషాల పాటు వైష్ణవి - ఆనంద్‌ల స్కూల్ డేస్ ప్రేమ‌క‌థే ప్రధానంగా సాగుతుంది. ఆ క్రమంలో రెండు మేఘాలు పాట నేపధ్యంలో వాడుకోవడం, కొన్ని స్కూల్ డేస్ మూమెంట్స్ ఆకట్టుకుంటాయి. 


వైషూ కాలేజీలో చేరిన‌ప్పటి కథలో మరో మలుపు వస్తుంది. కాలేజీలో ఫ్రెండ్స్‌ను చూసి వైషూ త‌న లైఫ్ స్టైల్ మార్చుకోవ‌డం..  అది చూసి ఆనంద్ మ‌రింత ఆందోళ‌న ప‌డ‌టం.. ఈ క్రమంలో ఇద్దరి మ‌ధ్య అభిప్రాయ భేదాలు.. ఇవన్నీ రొటీన్ గా వునప్పటికీ యువతకు కనెక్ట్ అయ్యేలా తీశాడు దర్శకుడు. విరాజ్‌ పాత్ర పరిచయంతో ఈ కథ ముక్కోణపు ప్రేమకథగా మలుపు తీసుకుంటుంది. విరామసన్నివేశం కూడా సెకండ్ హాఫ్ పై అంచనాలు పెంచుతుంది. 


ఐతే ఈ కథలో సెకండ్ కొంచెం ఇబ్బందిగా మారింది. ఇందులో వేగం వుండదు. విరాజ్, వైషు ల డేటింగ్, ఆనంద్ ఎడబాటు ఇవన్నీ సాగదీతగా వుంటాయి. తర్వాత బ్లాక్ మెయిలింగ్ ఎపిసోడ్ కూడా రొటీన్ వ్యవహారమే. ఇక క్లైమాక్స్ కూడా అంత కొత్తగా వుండదు. ఇలాంటి చిత్రాలు క్లైమాక్స్ హార్డ్ హిట్టింగ్ గా వుండాలి. కానీ ఇందులో మాత్రం సాదాసీదా ముగింపు వుంటుంది. ఐతే ఈత‌రం యువ‌త‌కు  క‌నెక్ట్ అయ్యేలా ఈ సినిమాని చిత్రీకకరించాడు. సినిమాలో క‌నిపించే చాలా స‌న్నివేశాలు ఈ కాలం యువ‌తీ యువ‌కుల మ‌ధ్య ఉన్న ప్రేమ‌కు.. వారి ఆలోచ‌నా విధానాల‌కు అద్దం ప‌ట్టేలాగే చేయడంలో దర్శకుడు కొంత విజయం సాధించాడు. 


నటీనటులు: ఆనంద్ దేవ‌ర‌కొండ మ‌రోసారి ఆక‌ట్టుకొన్నాడు. తన నటనలో మంచి యీజ్ కనిపించింది. చివర్లో ఎమోషనల్ సీన్స్ లో చాలా చక్కని అభినయం కనబరిచాడు. ఈ సినిమాతో వైష్ణ‌వి రూపంలో ఓ తెలుగ‌మ్మాయి క‌థానాయిక‌గా మారింది. టిక్ టాక్ వీడియోల‌తో ప్రాచుర్యం పొందిన వైష్ణవికి ఇది తొలి సినిమా. వైష్ణ‌వి పాత్ర‌లో ఆమె న‌ట‌న‌కు మంచి మార్కులు ప‌డ‌తాయి. అన్నీ ఎక్స్ ప్రెషన్స్  చ‌క్క‌గా ప‌లికించింది. అయితే ఈ పాత్రకు ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతుంది. చాలా సార్లు ఆర్క్ ని దాటి బిహేవ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. విరాజ్ స్క్రీన్ ప్రజన్స్ బావుంది కానీ  తన పాత్రని రాసుకోవ‌డంలో లోపం ఉంది. నాగబాబుది అంత బలమైన పాత్ర కాదు. మిగతా పాత్రలకు పెద్ద ప్రాధన్యత లేదు.
 
 
టెక్నికల్: విజయ్ బుల్‌గానిన్ సంగీతం అందించిన పాట‌ల్లో రెండు బావునాయి.  ఓ రెండు మేఘాలు పాట‌ని బిట్లు బిట్లుగా సినిమా అంతా వాడుకొన్నారు. చివ‌రి పాట కూడా వినడానికి బావుంటుంది. కెమెరా వ‌ర్క్, నిర్మాణ విలువలు డీసెంట్ గా ఉనాయి. ఎడిటింగ్ షార్ఫ్ వుండాల్సింది. ఈ కథ చెప్పడానికి ఇంత నిడివి అవసరం లేదు.  కేవలం యూత్ ని ద్రుష్టిలో పెట్టుకొని తీసిన సినిమా ఇది. ఆ యూత్ ఈ సినిమాకి ఎంతలా కనెక్ట్ అవుతారనేదాని బట్టి బేబీ ఫలితం ఆధారపడివుంది. 

 

ప్లస్ పాయింట్స్ 

యూత్ ఫుల్ కంటెంట్ 
ఆనంద్, వైష్ణవి
రెండు మేఘాలు పాట 


మైనస్ పాయింట్స్ 

రెగ్యులర్  ఎలిమెంట్స్  
సాగదీత 
క్లైమాక్స్ 


ఫైనల్ వర్దిక్ట్ : యూత్ కి నచ్చే బేబీ...


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS