Butta Bomma Review: బుట్టబొమ్మ మూవీ రివ్యూ & రేటింగ్!

మరిన్ని వార్తలు

నటీనటులు: అనిఖా సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ట, నవ్య స్వామి తదితరులు

దర్శకుడు : శౌరి చంద్రశేఖర్ టి రమేష్

నిర్మాతలు: నాగ వంశీ ఎస్, సాయి సౌజన్య

సంగీత దర్శకులు: గోపీ సుందర్

సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు

ఎడిటర్: నవీన్ నూలి

 

 

రేటింగ్: 2.5/5

 

 

మలయాళంలో మంచి కంటెంట్ వున్న కథలు వస్తుంటాయి. ఎక్కువ రీమేకులు అక్కడ నుంచి తెచ్చుకున్న కథలే. ఇప్పుడు ఈసారి ‘బుట్టబొమ్మ’ వచ్చింది. మలయాళంలో విజయవంతమైన ‘కప్పెల’కు రీమేక్‌గా రూపొందిన చిత్రమిది. సితార సంస్థ నిర్మించడం, టీజర్‌, ట్రైలర్లు ఆసక్తికరంగా ఉండటంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. మరి బుట్టబొమ్మ ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి పంచింది? రీమేక్ మ్యాజిక్ వర్క్ అవుట్ అయ్యిందా ? 

 

 

కథ :

 

 

అరకు లో దూది కొండకు చెందిన మధ్యతరగతి అమ్మాయి సత్య (అనిక సురేంద్రన్‌). టైలరింగ్‌ చేసుకునే తల్లి, రైసు మిల్లులో పని చేసే తండ్రి..స్కూల్ లో చదువుకునే చెల్లి... ఇదీ సత్య కుటుంబం. ఓ కెమెరా ఫోన్‌ కొనుక్కోని.. రీల్స్‌ చేసి ఫేమస్‌ అవ్వాలన్నది సత్య కల. కానీ ఓ రాంగ్‌ నంబర్‌ సత్య జీవితాన్ని మార్చేస్తుంది.

 

 

కనీసం ఒక్కసారైనా చూడకుండానే ఫోన్‌లో పరిచయమైన మురళి (సూర్య వశిష్ఠ)ని ప్రేమిస్తుంది. తన తల్లిదండ్రులు మరో వ్యక్తితో పెళ్లి సంబంధం ఖాయం చేయడంతో చెప్పాపెట్టకుండా మురళిని కలవడం కోసం విశాఖపట్నంకు వెళ్తుంది. కానీ ఆ తర్వాత సత్య జీవితం విచిత్రమైన మలుపులు తిరుగుతుంది. మరి మురళిని కలవడం కోసంవైజాగ్‌ వెళ్లిన సత్యకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? ఈ కథలో ఆర్కే (అర్జున్‌ దాస్‌) పాత్ర ఏమిటి ? అనేది మిగతా కథ.    

 

 

విశ్లేషణ :

 

 

కప్పేల చూసిన వారికి ఈ కథపై ఇప్పటికే ఒక ఐడియా వుంటుంది. ఫస్ట్ హాఫ్ ప్రేమకథలా సాగితే.. సెకండ్ హాఫ్ నుంచి అది థ్రిల్లర్‌ జానర్‌లోకి టర్న్‌ తీసుకుంటుంది. అయితే ఈ కథలో వేగం లేకపోవడం ప్రధానమైన సమస్య. కథలో సంఘర్షణ సెకండ్ హాఫ్ వరకూ మొదలవ్వదు. దీంతో ఫస్ట్ హాఫ్ అంతా సాగడీత ధోరణి కనిపిస్తుంది. ఓ రాంగ్‌ కాల్‌తో ప్రేమలో పడటమన్న పాయింట్‌ను తెలుగు తెరపై ఇప్పటికే బోలెడన్ని సార్లు చూశాం. కాబట్టి ఇలాంటి లవ్‌ ట్రాక్‌ను మళ్లీ తెరపై చూపించాలంటే కొత్తగా ఎదో ప్రయత్నించాల్సింది. కానీ అది జరగలేదు. 

 

 

అయితే సత్యకు ఇంట్లో పెళ్లి సంబంధం ఖాయం చేయడం.. మురళిని కలవడం కోసం ఆమె వైజాగ్‌కు వెళ్లడం.. అక్కడ కొందరు ఆమెను ఫాలో చెయ్యడం.. ఇలా విరామానికి ముందు సినిమా ఒక్కసారిగా థ్రిల్లర్‌ జానర్‌లోకి టర్న్‌ తీసుకుంటుంది. సత్య - మురళిల కథలోకి అర్జున్‌ పాత్ర ప్రవేశించాక కథలో ఒక్కసారిగా వేగం పెరుగుతుంది. ఆర్కే పాత్రను తీర్చిదిద్దుకున్న తీరు బాగుంది. అయితే చాలా చిన్న కథ ఇది. ఆ చిన్న కథని కూడా సాగదీసినట్లు తీయడం ఆకట్టుకోదు. దీంతో బుట్టబొమ్మ కాస్త బోరింగ్ బొమ్మగా తయారైయింది. 

 

 

 

నటీనటులు :

 

 

సత్య పాత్రలో సహజంగా కనిపించిది అనిక. తన వయసుతగ్గ పాత్ర ఇది. మురళి పాత్రకు సూర్య వశిష్ఠ న్యాయం చేశాడు.. ఆర్కే పాత్రలో అర్జున్‌ నటన ఆకట్టుకుంటుంది. ఆ పాత్రకు ఆయన్ని తీసుకోవడం సరైన్‌ ఎంపిక.

 

 

మిగతా పాత్రలన్నీ పరిధి మేరకే ఉంటాయి. తల్లి తండ్రులు గా కనిపించిన నటులు సహజంగా నటించారు. మిగతా పాత్రలు పరిధిమేర నటించారు. 

 

 

టెక్నికల్:

 

 

పరిమిత బడ్జెట్ లో తీసిన సినిమా ఇది. కంటెంట్ తగ్గ ఖర్చు కనిపించింది. కెమరా , సంగీతం బావుంది. గణేష్‌ రావూరి సంభాషణలు అక్కడక్కడా మెరిశాయి. ఇందులో ఒక సీన్ వుంది.

 

 

కూతురు ఓ అబ్బాయితో సైకిల్ పై వస్తే.. బెత్తం పట్టుకొని కూతురిని కొట్టడానికి వచ్చిన తండ్రి ఎదురుగా.. ‘’రోజు ఇరవై కిలో మీటర్లు నడుస్తుంటే కాళ్ళు నొప్పులు వస్తున్నాయ్ నాన్న.. నడవలేని పరిస్థితిలో ఆ అబ్బాయి సైకిల్ ఎక్కాను’’ చెబుతుంది కూతురు. సైకిల్ కొనివ్వలేని తన అసమర్ధత చూసి బాధపడతాడు తండ్రి. అసలు కథతో సంబంధం లేనప్పటికీ గుర్తుపెట్టుకునే సీన్ ఇది. 

 

 

ప్లస్ పాయింట్స్

 

 

కథ నేపధ్యం

రెండు మలుపులు 

సెకండ్ హాఫ్ 

 

 

మైనస్ పాయింట్స్

 

 

కథనంలో వేగం లేకపోవడం 

ఫస్ట్ హాఫ్ 

పాత్రల్లో బలం లేకపోవడం 

 

ఫైనల్ వర్దిక్ట్ : బోరింగ్ బొమ్మ


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS