'దర్బార్‌' బొమ్మ బ్లాక్‌ బస్టర్‌ అట.!

మరిన్ని వార్తలు

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా 'దర్బార్‌' మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందే ప్రమోషన్స్‌తో రికార్డులు సృష్టించిన 'దర్బార్‌'కి పోజిటివ్‌ టాక్‌ వస్తోంది. జనవరి 8 నుండే భారీగా ప్రీమియర్‌ షోలు నిర్వహించారు. ప్రీమియర్స్‌ నుండి వచ్చిన పోజిటివ్‌ టాక్‌తో ఈ సినిమాకి అన్నిచోట్లా ఓపెనింగ్స్‌ బాగా వచ్చాయని సమాచారం. 'రజనీకాంత్‌ వన్‌ మేన్‌ షో.. బొమ్మ సూపర్‌ హిట్‌..' అనే హ్యాష్‌ ట్యాగ్స్‌తో సోషల్‌ మీడియా హోరెత్తిపోతోంది. ఇంతవయసులోనూ రజనీకాంత్‌ అదే స్టైల్‌, రొమాన్స్‌, యాక్షన్‌.. ఇరగదీసేశాడు అంటున్నారు.

 

ఈ మధ్య వరుస ఫ్లాపులతో విసిగించిన సూపర్‌ స్టార్‌ 'దర్బార్‌'తో లోటు తీర్చేశారనీ, మురుగదాస్‌ టేకింగ్‌, అనిరుధ్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌, స్టోరీ, నెరేషన్‌.. అన్నీ సినిమాకి సరిగ్గా సెట్‌ అయ్యాయనీ, 'దర్బార్‌' సంక్రాంతి బ్లాక్‌ బస్టర్‌ అంటూ అభిమానులు ఆనందంతో ఊగిపోతున్నారు. నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో నివేదా థామస్‌ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమా రూపొందింది. అనిరుధ్‌ రామ చంద్రన్‌ రజనీ స్టైల్‌కి తగ్గట్లు అదిరిపోయే మ్యూజిక్‌ అందించారు. మొత్తానికి 'దర్బార్‌'తో సూపర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ని ఫుల్‌గా శాటిస్‌ఫై చేసినట్లే అనిపిస్తోంది. టాక్‌ ఈ రేంజ్‌లో ఉంది కాబట్టి, తెలుగు రాష్ట్రాల్లోనూ 'దర్బార్‌'కి మంచి రెస్పాన్స్‌ వస్తుందనడంలో సందేహం లేదేమో. మరో రెండు రోజుల్లో మహేష్‌ బాబు 'సరిలేరు..' ప్రేక్షకుల ముందుకు రానుంది. సో ఈ రెండు రోజులూ మాస్‌ సెంటర్స్‌లో 'దర్బార్‌'కి పక్కా పైసా వసూల్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS