ఫ్యాషన్‌ డిజైనర్‌ సన్‌ ఆఫ్‌ లేడీస్‌ టైలర్‌ మూవీ రివ్యూ రేటింగ్స్

మరిన్ని వార్తలు

తారాగణం: సుమంత్‌ అశ్విన్‌, అనీషా ఆంబ్రోస్‌, మానస హిమవర్ష, మనాలీ రాథోడ్‌, కృష్ణ భగవాన్‌ తదితరులు.
సంగీతం: మణిశర్మ
సినిమాటోగ్రఫీ: నగేష్‌ బానెల్లి
దర్శకత్వం: వంశీ
నిర్మాత: మధుర శ్రీధర్‌
నిర్మాణం: మధుర ఎంటర్‌టైన్‌మెంట్‌  

* కథా కమామిషు...

సీనియర్‌ దర్శకుడు వంశీ సినిమాల్లో కొత్తదనం కన్పిస్తుంటుంది. ఎన్నిసార్లు చూసినా వంశీ సినిమాల్లోని గోదావరి అందాలు ప్రత్యేకతను సంతరించుకుంటూనే ఉంటాయి. ఆయన సినిమాల్లోనే గోదారి రెట్టించిన అందంగా కన్పిస్తుంది? అన్న ప్రశ్నకు బహుశా గోదావరిపై ఆయనకున్న మమకారమే కారణమేమో అని సమాధానమిస్తారు కొందరు. వంశీ దర్శకత్వంలో వచ్చిన అలనాటి మేటి చిత్రం 'లేడీస్‌ టైలర్‌'. ఆ లేడీస్‌ టైలర్‌ కొడుకు ఫ్యాషన్‌ డిజైనర్‌ అయితే? అన్న ఆలోచనే చిలిపిగా ఉంటుంది. అంత చిలిపిదనం 'లేడీస్‌టైలర్‌'లో కన్పిస్తుంది. అందుకే, ఈ ఫ్యాషన్‌ డిజైనర్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తండ్రి నుంచి వారసత్వంగా టైలరింగ్‌ అనుభవాన్ని సాధించిన గోపాలం, గొప్ప ఫ్యాషన్‌ డిజైనర్‌ అయిపోవాలనుకుంటాడు. కానీ అతనుండేది పల్లెటూళ్ళో. అక్కడ ముగ్గురమ్మాయిలతో రొమాంటిక్‌ అనుభవాలు అతని జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పాయి? అతని ఆశయం ఏమయ్యింది? అనే ప్రశ్నలకు సమాధానం తెరపైనే దొరుకుతుంది.

 

*నటీనటులెలా చేశారు..? 

సుమంత్‌ అశ్విన్‌ నటుడిగా ఇప్పటికే తానేంటో ప్రూవ్‌ చేసుకున్నాడు. ఈ సినిమాలోనూ తన పాత్రకు పూర్తి న్యాయం చేసేందుకు ప్రయత్నించాడు. అతని హావభావాలు ఆకట్టుకుంటాయి. చాలా ఈజ్‌తో తన పాత్రలో ఒదిగిపోయాడు సుమంత్‌ అశ్విన్‌. రొమాంటిక్‌ సన్నివేశాల విషయంలో అయినా, సరదా సరదా సన్నివేశాల్లో అయినా తన నటనతో ఆకట్టుకున్నాడు. హీరోయిన్లలో అనీషా ఆంబ్రోస్‌, మనాలి రాథోడ్‌, మానస హిమవర్ష ముగ్గురూ వంశీ సినిమాల్లో సహజంగా కనిపించే అందమైన హీరోయిన్లలానే ఉన్నారు. సీనియర్‌ నటుడు కృష్ణభగవాన్‌ తన టైమింగ్‌తో మునుపటి జోష్‌ని చూపించగా, మిగతా పాత్రధారులంతా తమ పాత్రల పరిధి మేర బాగానే చేశారు.

*సాంకేతిక వర్గం పనితీరు... 

సాంకేతిక వర్గం గురించి మాట్లాడుకునేటప్పుడు ముందుగా సినిమాటోగ్రాఫర్‌ గురించి మాట్లాడుకోవాలి. వంశీ సినిమాల్లో డిఫరెంట్‌ కలర్‌ కనిపిస్తుంది. అలాగే, డిఫరెంట్‌ పేటర్న్‌లో లొకేషన్స్‌ కనిపిస్తాయి. ఈ సినిమాలోనూ అంతే. వంవీ ఆలోచనలకు తగ్గట్టుగా సినిమాటోగ్రఫీ వర్క్‌ కనిపిస్తుంది. ఓవరాల్‌గా సినిమా వంశీ మార్క్‌ మూడ్‌లోనే సాగుతుంది. సినిమాటోగ్రాఫర్‌ పనితీరుకి మంచి మార్కులు పడతాయి. మణిశర్మ సంగీతం ఈ సినిమాకి అదనపు బలం. పాటలు తెరపై చూడ్డానికీ, వినడానికీ బాగున్నాయి. కథ పరంగా ఓకే. కథనం కూడా బాగానే ఉంది. డైలాగ్స్‌ ఆకట్టుకుంటాయి. నిర్మాణపు విలువలు బాగున్నాయి. సినిమా రిచ్‌గా తెరకెక్కింది. ప్రతిఫ్రేమ్‌ నీట్‌గా డిజైన్‌ చేసినట్లుంటుంది.

 

*విశ్లేషణ...

ఒకప్పటికీ ఇప్పటికీ వంశీ సినిమాల్లో చాలా తేడా. కాస్టింగ్‌ పరంగానే ఆ తేడా స్పష్టంగా కన్పిస్తుంది. వంశీ కథల్లో అప్పటి నటీనటులు ఒదిగిపోయారు. ఇప్పటితరం ఆ జోరుని అందుకోవడం అంత తేలిక కాదు. ఉన్నంతలో బాగా చేయడానికి నటీనటులంతా ప్రయత్నించారు. అలాగే వంశీ సైతం ఇదివరకటి మ్యాజిక్‌ చేయడంలో కొంత తడబడ్డారేమో అనిపిస్తుంది. గోపాలం చిలిపి చేష్టలు, హీరోయిన్ల అందచందాలు, అంతకు మించి గోదావరి అందాలు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి.

*ఫైనల్‌ వర్డ్‌:

లేడీస్ టైలర్ ని మించలేకపోయాడు..

యావరేజ్ యూజర్ రేటింగ్: 2.5/5

రివ్యూ బై శేఖర్

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS