నటీనటులు: శ్రియ, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్ తదితరులు
దర్శకత్వం: సుజనా రావు
నిర్మాతలు: రమేష్ కరటూరి, వెంకీ పుషడపు, జ్ఞాన శేఖర్ వి.ఎస్
సంగీత దర్శకుడు: ఇళయరాజా
సినిమాటోగ్రఫీ: జ్ఞాన శేఖర్ వి.ఎస్
ఎడిటింగ్: రామకృష్ణ అర్రం
రేటింగ్: 3/5
శ్రియ, నిత్యమేనన్.. ఇళయరాజా మ్యూజిక్,.. సాయిమాధవ్ బుర్రా మాటలు .. ఈ టైటిల్ కార్డ్స్ చూస్తే ఆటోమేటిక్ గా సినిమాపై ఆసక్తి పెరుగుతుంది. ‘గమనం’ సినిమా ఆసక్తి పెరగడానికి కూడా ఇదే కారణం. అందులోనూ శ్రియ దివ్యాంగురాలుగా చూపించడం ఇంకా ఆసక్తిని పెంచింది. మూడు కథ సమాహారంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘గమనం’ తెరపై ఎలా కదిలిందో చూద్దాం..
కథ:
ఒక్కటి కాదు.. మూడు కథల సమాహారం గమనం. కమల(శ్రియ) చెవులు వినబడవు. దుబాయ్‌కి వెళ్లిన భర్త కోసం ఎదురుచూస్తూ చంటి బిడ్డతో కలిసి ఓ మురికివాడలో జీవిస్తుంటుంది. భర్త మాటలు వినాలని ఆమె కోరిక. రెండో కథలో క్రికెటర్ కావడమే లక్ష్యంగా శ్రమిస్తున్న అలీ (శివ కందుకూరి), తన పక్కింటి అమ్మాయి జారా (ప్రియాంక జవాల్కర్)తో ప్రేమలో పడతాడు. తర్వాత ఏమైయింది ? మూడో కథలో పుట్టినరోజంటే ఏమిటో తెలియని అనాథ పిల్లలైన ఇద్దరు కేక్ కోసమని మూడు వందలు సంపాదించాలనుకుంటారు. ఓ ప్రకృతి విపత్తుతో ఆ మూడు కథలు ఎలాంటి మలుపులు తిరిగాయి ? అనేదే మిగతా కథ.
విశ్లేషణ:
గమనం గురించి ఒక్కమాటలో చెప్పాలంటే... మూడు జీవితాలను సమాంతరంగా గా ఆవిష్కరించిన కథ ఇది. కొత్త దర్శకురాలు సుజనా రావు చేసిన ప్రయత్నం చాలా వరకు ఫలించింది. కమర్షియల్ హంగులు జోలికి పోకుండా చాలా నిజాయితీగా మూడు కధలని తెరపై ఆవిష్కరించిన తీరుని ఖచ్చితంగా ప్రశంసించాలి. కమల కధలో ఎమోషన్ అద్భుతంగా పడింది. భర్త కోసం ఎదురుచూపులు, భర్త మాటలు వినాలనుకునే తాపత్రయం.. ప్రేక్షకుడిని కదిలిస్తాయి, కమల తన భర్తని కలిస్తే బావుటుందనే భావన తెరపై కధని చూస్తున్న ప్రేక్షకుడిలో కనిపిస్తుంది. కమల కథలో ఆ బాధ ఉంటుంది. ఆ బాధని ప్రేక్షకుడు కూడా ఫీల్ అవుతాడు. అంతలా కనెక్ట్ అయ్యింది కమల కధ.
రెండో కధలో క్రికెటర్ కావడానికి అలీ చేసే ప్రయత్నాలు ఆకట్టుకుంటాయి. ఆ పాత్రలో శివ కందుకూరి ఒదిగిపోయాడు. మన పక్కింటి అబ్బాయ్ లా అనిపిస్తాడు. అలీ జారా ప్రేమ కధ తెరపై ఫ్రెష్ గా వుంటుంది. మూడో కధలో అనాథ పిల్ల ఇద్దరు కేక్ కోసం చేసిన ప్రయత్నాలు, ఆ క్రమంలో వచ్చిన సీన్స్ చాలఎమోషనల్ గా వుంటాయి. ఈ కధలో డైలాగ్స్ అద్భుతంగా అనిపిస్తాయి. ఓ సీన్ లో పెద్ద భవనం చూసిన ఓ బాల కార్మికుడు… `ఇంత పెద్ద ఇల్లు కట్టారంటే.. ఎంత చెత్త ఏరుకున్నాడో` అంటాడు.
ఈ డైలాగ్ భలే టచింగ్ గా వుంటుంది. గమనంలో మూడు కధలు కూడా బలమైన కథ, కదిలించే ఎమోషన్లతో సాగుతాయి. అయితే కొన్ని చోట్ల సాగాదీత కొన్ని సన్నీవేషాలు వుంటాయి. అయితే ఒక నిజాయితీ గల కధ చెప్పే ప్రయత్నంలో తెరపై సహజమైన ఎమోషన్లు ఆవిష్కరించడానికి నిదానం కొన్ని సార్లు తప్పనిసరి అవుతుంది. గమనంలో కూడా కొన్నిచోట్ల నిదానం కనిపిస్తుంది. అయితే బలమైన కధలు చెప్పాలనే నిజాయితీ గల ప్రయత్నం జరిగింది.
నటీనటులు:
శ్రియ పాత్ర బావుంది. తన అనుభవంతో మంచి నటన కనబరిచింది. చెవులు వినిపించని మహిళగా చక్కటి అభినయం ప్రదర్శించింది. శివ కందుకూరి, ప్రియాంక ఇద్దరూ పాత్రలకు న్యాయం చేశారు. వీధి బాలలుగా నటించిన ఇద్దరు చిన్నారులు ఓకే. నిత్యా మీనన్ ఎప్పటిలానే చక్కగా కనిపించింది. సంజయ్ స్వరూప్, సుహాస్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు.
టెక్నికల్ గా:
సాంకేతికంగా సినిమా వున్నంతంగా వుంది. కెమెరా పనితనం ఇంకా బాగుంది. వర్షం నేపథ్యం లో సన్నివేశాలు బాగా తీశారు. సాయి మాధవ్ బుర్రా మాటలు కొన్ని చోట్ల మెరుస్తాయి. ఇళయరాజా నేపధ్య సంగీతం బావుంది. కమర్షియల్ కోణం లో ఏమాత్రం ఆలోచించకుండా తీసిన సినిమా ఇది. ఇలాంటి ప్రయత్నాలను మెచ్చుకుని తీరాలి.
ప్లస్ పాయింట్స్
శ్రియా..
రాజ్ కందుకూరి
కొన్ని డైలాగులు
కెమెరా పనితనం
మైనస్ పాయింట్స్ :
నెమ్మదిగా సాగే కధనం
ఫైనల్ వర్దిక్ట్ : ఒక మంచి ప్రయత్నం.