నటీనటులు: అశోక్ గల్లా, నిధి అగర్వాల్, జగపతి బాబు, నరేష్ తదితరులు
దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య టి
నిర్మాత: పద్మావతి గల్లా
సంగీత దర్శకుడు: జిబ్రాన్
సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి, రిచర్డ్ ప్రసాద్
ఎడిటర్: ప్రవీణ్ పూడి
రేటింగ్: 2.5/5
సినీ గ్లామర్ తో రాజకీయాల్లో అడుగుపెట్టడం కామన్. కానీ రాజకీయ నేపధ్యం వున్న వాళ్ళు .. సినిమా పరిశ్రమలోకి అరుదుగా వస్తుంటారు. ముఖ్యంగా తెలుగు పరిశ్రమలో ఇది అరుదుగా జరుగుతూ వుంటుంది. ఆమధ్య కాలంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ తనయుడు హీరోగా అదృష్టం పరీక్షించుకున్నాడు. ఇప్పుడు మరో రాజకీయ వారసుడు వెండితెరపైకి వచ్చాడు. గుంటూరు ఎంపీ జయదేవ్ గల్లా తనయుడు అశోక్ 'హీరో'గా పరిచయమయ్యాడు. గల్లా జయదేవ్ అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ నేపధ్యం కూడా కలిసొచ్చింది. అందుకే అశోక్ హీరో సినిమాపై ఆసక్తి పెరిగింది. పండగ కానుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రివ్యూలోకి వెళితే...
కథ:
అర్జున్ (అశోక్ గల్లా) మిడిల్ క్లాస్ కుర్రాడు. హీరో కావాలని కల. చాలా మంది దర్శకులని కలసి ఆడిషన్స్ ఇస్తుంటాడు. అర్జున్ గర్ల్ ఫ్రండ్ సుబ్బు (నిధి అగర్వాల్). ఎదురింట్లోనే వుంటుంది. ఇలావుండగా ఒక రోజు అర్జున్ కి ఒక గన్ పార్శిల్ వస్తుంది. ఇది అర్జున్ జీవితాన్ని తలకిందులు చేస్తుంది. అర్జున్ ఆ తుపాకీతో ఏం చేసాడు? ఎంతకీ ఆ తుపాకీ ఎవరిదీ ? హీరో అవ్వాలనుకున్న అర్జున్ కల నెలవేరింది ? అనేది మిగతా కథ.
విశ్లేషణ:
'భలే మంచి రోజు' ఫేమ్ శ్రీరామ్ ఆదిత్య మొదటి సినిమా నుంచి జోనర్ మార్చడం లేదు. చిన్న లైన్ అనుకుని దాని చుట్టూ కామెడీ అల్లుతున్నాడు. అది కూడా క్రైమ్ కామెడీ. ఐతే భలే మంచి రోజు వర్క్ అవుట్ అయినట్లు మరో సినిమా కాలేదు. 'హీరో'కి వచ్చేసరికి కూడా అదే ఫాలో అయ్యాడు. చిన్నలైన్ అనుకోని దానికి మాఫియా, బ్లాక్ కామెడీని జోడించి నవ్వించాలని అనుకున్నాడు. అయితే ఆ చిన్న లైను రెండుగంటల పాటు వినోదం పంచడానికి సరిపడలేదు.
ఈజీగా కనిపించే కష్టమైన జోనర్ కామెడీ. ప్రేక్షకుడిని నవ్వించడం అంత తేలిక కాదు. స్లాప్ స్టిక్ కామెడీలు చేయాలంటే రైటింగ్ టేబుల్ మీద బలంగా వుండాలి. హీరోలో రైటింగ్ బలం కనిపించదు. ఏదో టైం పాస్ చేయాలనే ఉద్దేశమే తప్పితే సహజంగా నవ్వు తప్పించే రైటింగ్ కనిపించదు. ఇందులో చెప్పుకోవడానికి పెద్ద కధ వండదు. వున్న కథ కూడా సిల్లీగా వుంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా హీరో చేసిన స్పూఫ్లు, ఇమిటేషన్లతో నడిపించారు.
కథ ఎంతకీ ముందుకు వెళ్ళదు. ఇంటర్వెల్ తర్వాత కూడా చిన్న పాయింట్ చుట్టూ డ్రాగ్ చేస్తున్నారనే సంగతి జీవితంలో మొదటి సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి కూడా అర్ధమైపోతుంది. అంత వీక్ గా వుంటుంది ప్లాట్. అయితే సినియర్ హీరోగా బ్రహ్మాజీ పాత్ర కొంత ఊరట. ఇలాంటి సినిమాల్లో ట్విస్ట్ దాని చుట్టూ ఉన్న ఎమోషన్ చాలా ముఖ్యం. కానీ ఇందులో ఆ ట్విస్ట్ చుట్టూ వున్న నేపధ్యం మరీ సిల్లీగా వుంటుంది. మాఫియాకి మిడిల్ క్లాస్ టచ్ ఇస్తూ ఒక కామెడీ ఎంటర్ట్రైనర్ తీయాలని దిగాడు దర్శకుడు. కానీ అది మిస్ ఫైర్ అయ్యింది.
నటీనటులు:
అశోక్ కి మొదటి సినిమా ఇది. చూడటానికి బావున్నాడు. డ్యాన్సులు, యాక్షన్ ఓకే. మొదటి సినిమాకి తగ్గట్టు చిన్న కథనే ఎంచుకున్నాడు. కానీ అది మరీ సిల్లీగా వుంది. నటన పరంగా పెద్ద స్కోప్ లేదు. చాలా చోట్ల మహేష్ బాబు, కృష్ణ ఇమిటేషన్లు కనిపిస్తాయి. నిధి అగర్వాల్ అందంగా వుంది. అమె పాత్ర కూడా పెద్ద స్కోప్ లేదు. జగపతి బాబు పాత్రని మలిచిన విధానం పెద్దగా ఆకట్టుకోదు. వెన్నల కిషోర్, సత్య.. మిగతా నటులు పరిధిమేర చేశారు.
టెక్నికల్ గా:
జిబ్రాన్ ఇచ్చిన రెండు పాటలు బావున్నాయి. చిత్రీకరణ కూడా కొత్తగా వుంది. నేపధ్య సంగీతం ఓకే. కెమరా పనితనం బావుంది. విజువల్స్ రిచ్ గా వున్నాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి.
ప్లస్ పాయింట్స్:
కొన్ని కామెడీ సీన్లు
బ్రహ్మజీ ఎపిసోడ్
నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్
కథలో బలం లేకపోవడం
సాగదీత స్క్రీన్ ప్లే
పండని రొమాంటిక్ ట్రాక్
ఫైనల్ వర్దిక్ట్ : సిల్లీ హీరో