Like Share & Subscribe: లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌’ మూవీ రివ్యూ & రేటింగ్!

మరిన్ని వార్తలు

నటీనటులు: సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా, బ్రహ్మాజీ, సుదర్శన్, నరేన్, మైమ్ గోపి తదితరులు
దర్శకుడు : మేర్లపాక గాంధీ
నిర్మాత: వెంకట్ బోయనపల్లి
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, రామ్ మిరియాల
సినిమాటోగ్రఫీ: ఎ వసంత్
ఎడిటర్: రాము తూము


రేటింగ్: 2/5


సంతోష్ శోభన్ ఎక్ మినీ కథ ఓటీటీలో మంచి విజయం సాధించింది. ఈ సినిమా కథ ఇచ్చింది దర్శకుడు మేర్లపాక గాంధీ. ఇప్పుడు ఈ ఇద్దరూ కలసి చేసిన సినిమా ‘లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌’. జాతిరత్నాలు ఫేమ్ ఫారియా అబ్దుల్లా హీరోయిన్ కావడం శ్యామ్ సింగరాయ్ నిర్మాత వెంకట్ బోయినపల్లి నిర్మించడంతో సినిమాపై బజ్ ఏర్పడింది. కామెడీ ఎంటర్ టైనర్ లో అందించడంలో తనకంటూ ఒక స్పెషల్ మార్క్ తెచ్చుకున్న మేర్లపాక గాంధీ ఈ సినిమాతో ఎలాంటి వినోదాల్ని పంచాడు? అసలు లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌’ కథేంటి ? 

వసుధ (ఫారియా) పాపులర్ యూట్యుబర్. ట్రావెల్ వ్లాగర్ గా అరకు వస్తోంది. విప్లవ్ (సంతోష్ శోభన్) గువ్వా విహారి అనే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెడతాడు. ఐతే అతని ఛానల్ కి ముఫ్ఫై మందే సబ్‌స్క్రైబ్‌ చేసుంటారు. అవి కూడా జెన్యూన్ కాదు పాపులర్ యూట్యుబర్ కావాలని జాక్ డేనియల్స్ (సుదర్శన్ ) డీవోపీ తో అరుకువెళ్తాడు. అక్కడ వసుధని చూసి ప్రేమిస్తాడు. ఇంతలో పీపీఎఫ్ దళం వసుధ, విప్లవ్ , సుదర్శన్ ని కిడ్నాప్ చేస్తుంది. అసలు పీపీఎఫ్ దళం వీరిని ఎందుకు కిడ్నాప్ చేసింది ? దళం నుండి ఈ ముగ్గురు ఎలా బయటపడ్డారు ? అనేది మిగతా కథ. 


ఒక సీరియస్ కథని లైటర్ వెయిన్ లో చెప్పాలని భావించాడు దర్శకుడు. అడవిలో పీపీఎఫ్ కథ, ఇద్దరు యూట్యుబర్స్ కథకి లింక్ చేసి కామెడీగా నడిపించాలని చూశాడు. దర్శకుడు ఆలోచన బావుంది కానీ.. అతను అనుకున్న కామెడీ మాత్రం వర్క్ అవుట్ కాలేదు. 1990లో పీపీఎఫ్ తో కథని సీరియస్ గా మొదలుపెట్టిన దర్శకుడు 2022 లో వసుధ, విహారి ట్రాక్ తో నవ్వులు పంచాలాని చూశాడు. అయితే దర్శకుడు రాసుకున్న సీన్లు ఏవీ సరిగ్గా పేలలేదు. పీపీఎఫ్ చేతికి ఈ ముగ్గురు చిక్కుతారని, అలాగే బయటపడతారని మొదటి సీన్ లోనే అర్ధమైపోతుంది. దీంతో అడవిలో జరుగుతున్న డ్రామా అంతా సిల్లీ వ్యవహారంలా అనిపిస్తుంది. 


సినిమా సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి కథ ఎంతకీ ముందుకు జరగదు. ప్రతి సీను ఊహకి అందిపోతూ చాలా నీరసంగా నవ్వురాని జోకులతో వెళుతుంటుంది. దీనితో తర్వాత ఏమౌతుందనే ఆసక్తి వుండదు. దర్శకుడు మేర్లపాక గాంధీ స్క్రీన్ ప్లే గమ్మత్తుగా వుంటుంది. అయితే ఇందులో మాత్రం ఆ మ్యాజిక్ కనిపించదు. చాలా సాదాసీదాగా సన్నివేశాలు జరుగుతుంటాయి. పైగా ఈ కథకు నక్సల్ నేపధ్యం నప్పలేదు. బ్రహ్మన్న గ్యాంగ్ తో కామెడీ చేయాలని చూశారు కానీ అది వర్క్ అవుట్ కాలేదు. తప్పిపోయిన ముగ్గురు దళం నాయకుల గురించి దర్శకుడు రాసుకున్న ట్విస్ట్ మరీ సిల్లీగా వుంది. ఈ సినిమాకి లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌’ పేరు పెట్టారు కానీ అడవిలో అయోమయం అనే పేరు యాప్ట్. ఇందులో పాత్రలు అంత అయోమయంగా వుంటాయి. 


నటీనటులు:


సంతోష్ శోభన్ తన మొదటి సినిమా నుండే మంచి నటుడని పేరు తెచ్చుకున్నాడు . ఇందులో కూడా అతడి నటన డీసెంట్ గా వుంటుంది. పాటల్లో డ్యాన్సుల్లో హుషారుగా చేశాడు. ఫారియా మంచి నటి. అయితే ఆమె నటనకు ఆస్కారం వుండే పాత్ర కాదిది.


నాటకం సాంగ్ లో చక్కని ప్రదర్శన కనబరిచింది. లచ్చుమమ్మ పాటలో గ్లామర్ తో ఆకట్టుకుంది. బ్రహ్మాజీ కి కీలక పాత్ర దొరికింది. ఇందులో ఆయన ఒక్కరే కాస్త రిలీఫ్. సుదర్శన్ పాత్రని మరింత హిలేరియస్ గా రాయాల్సింది. మిగతానటీనటులు పరిధిమేర చేశారు.


సాంకేతిక వర్గం:


ప్రవీణ్ లక్కరాజు మ్యూజిక్ ఓకే. రామ్ మిరియాల ఇచ్చిన లచ్చుమమ్మా పాట బావుంది. వసంత్ డీవొపీ డీసెంట్ గా వుంది.


మేర్లపాక డైలాగ్స్ కొన్ని పేలాయి. అయితే రైటింగ్ మాత్రం బలం లేదు. నిర్మాత కథకు కావాల్సింది సమకూర్చారు. 


ప్లస్ పాయింట్స్


కొన్ని కామెడీ సీన్లు 
నిర్మాణ విలువలు 


మైనస్ పాయింట్స్


బలహీనమైన కథ 
సంఘర్షణ లేకపోవడం 
పేలవమైన స్క్రీన్ ప్లే 


ఫైనల్ వర్డిక్ట్ : డిస్ లైక్ అండ్ అన్ సబ్‌స్క్రైబ్‌!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS