మ‌త్తు వ‌ద‌ల‌రా 2 మూవీ రివ్యూ & రేటింగ్‌

మరిన్ని వార్తలు

చిత్రం: మత్తు వదలరా 2
దర్శకత్వం: రితేష్ రానా 
కథ - రచన: రితేష్ రానా 


నటీనటులు:  శ్రీ సింహ కోడూరి, సత్య , వెన్నెల కిషోర్ , ఫరియా అబ్దుల్లా , సునీల్   


నిర్మాతలు: చిరంజీవి పెదమల్లు , హేమలత పెదమల్లు 


సంగీతం: కాల భైరవ 
సినిమాటోగ్రఫీ : సురేష్ సారంగం 
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ 


బ్యానర్: క్లాప్ ఎంటర్టైన్ మెంట్ , మైత్రీ మూవీ మేకర్స్  
విడుదల తేదీ: 13 సెప్టెంబర్ 2024 
 

ఐక్లిక్ మూవీస్ రేటింగ్‌: 3/5

ఇంగ్లీష్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


ఆస్కార్ గ్రహీత, సంగీత ద‌ర్శ‌కుడు కీరవాణి కొడుకు హీరో శ్రీ సింహ. అయినా కష్ట పడి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి వ‌స్తున్నాడు. శ్రీ సింహా రాజమౌళి సినిమాల్లో చైల్డ్ యాక్టర్ గా కెరియర్ మొదలు పెట్టాడు. సుకుమార్ దగ్గర రంగస్థలం సినిమాకు అసిస్టెంట్ డైరక్టర్ గా వర్క్ చేసాడు. తరవాత 'మత్తు వదలరా' మూవీతో హీరో గా మారాడు. 2019 లో వచ్చిన 'మత్తు వదలరా' కామెడీ థ్రిల్లర్ గా మంచి విజయం సాధించింది.  హీరోగా నటించిన శ్రీ సింహ మొదటి సినిమాకే బెస్ట్ మేల్ డెబ్యూట్ గా సైమా అవార్డు అందుకున్నాడు. మళ్ళీ 5 ఏళ్ళ తరవాత పార్ట్ 2 తెరకెక్కింది. శ్రీ సింహా, సత్య కామెడీ టైమింగ్ కి ఫరియా అబ్దుల్లా కూడా యాడ్ అయ్యింది. ఈ మూవీలో ఫరియా ఒక రాప్ సాంగ్ రాసి, స్వయంగా తానే పాడి, కొరియో గ్రఫీ కూడా చేసింది. ఇప్పటికే రిలీజైన ఈ మూవీ ట్రైలర్ కి మంచి పాజిటీవ్ బజ్ వచ్చింది. ప్రభాస్ లాంటి స్టార్ హీరో ఈ మూవీని ప్రమోట్ చేయటంతో ఇంకొంచెం హైప్‌ పెరిగింది. ఈ రోజు థియేటర్స్  లో సందడి చేయటానికి వచ్చిన  'మత్తువదలరా 2' విజయం అందుకుందో లేదో ఈ రివ్యూలో చూద్దాం.                                   

 

కథ:

ఈ సినిమా సీక్వెల్ కావటంతో మొదటి కథకి కొనసాగింపుగా ఉంది. బాబు మోహన్ (శ్రీ సింహ) ఏసుదాసు (సత్య) వీళ్ళిద్దరూ డెలివరీ ఏజెంట్ లుగా ప‌ని చేస్తూ ఉద్యోగం పోగొట్టుకుంటారు. దీనితో ఉద్యోగాలకోసం తిరుగుతూ 'హాయ్ ఎమర్జెన్సీ టీమ్స్ రిక్రూట్మెంట్' లో లంచ మిచ్చి ఉద్యోగం కొనుక్కుంటారు. దొంగతనాలు, కిడ్నాప్ లు చేసే వీళ్ళు ఇక్కడ కూడా తమ టాలెంట్ చూపిస్తూ ఉంటారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతున్న వీరి ఉద్యోగం ప్లస్ దొంగ తనాలకి బ్రేక్ వస్తుంది. చిన్న పొరపాటు కారణంగా ఆకాష్(అజయ్) కిడ్నాప్ అండ్ మర్డర్ కేసులో బాబు, యేసు దొరుకుతారు. ఉద్యోగం పేరుతో దొంగతనాలు చేసే ఈ బ్యాచ్ నిజంగా మర్డర్ చేసిందా? ఆకాష్ ను చంపింది ఎవరు? మర్డర్ కేసులో ఇరుకున్న వీరిని అండర్ కవర్ ఏజెంట్ నిధి(ఫరియా అబ్దుల్లా) ఎలా కాపాడింది. ఇందులో హీ.టీం హెడ్ దీప(రోహిణి) పాత్ర ఏమిటి? అనే వివరాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే. 

 

విశ్లేషణ:
 
ఈ సినిమా ఫస్ట్ పార్ట్ కి ఇది కొనసాగింపని మొదటి నుంచి చెప్తూనే ఉంది టీమ్. మొదటి నుంచి ఈ సినిమా పై అంచనాలున్నాయి. పైగా ప్రభాస్ లాంటి స్టార్ ప్రమోషన్ నిర్వహించటంతో ఎదో స్టఫ్ ఉందని మరిన్ని అంచనాలు మొదలయ్యాయి. దర్శకుడు రితేష్ రానా కూడా అంచనాలను అందుకున్నాడనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా సాగి బోర్ కొట్టించినా, ఇంటర్వెల్ ముందు నుంచి కథ పుంజుకుని ఆడియన్స్ ని కథలోకి తీసుకు వెళ్తుంది. బాబు, యేసు ఇద్దరూ అనూహ్యంగా ఒక మర్డర్ కేసులో ఇరుక్కోవటం, ఆ కేసు నుంచి బయట పడడానికి వారు చేసిన ప్రయత్నాలు వినోదాత్మ‌కంగా తెరకెక్కించారు. సత్యా కామెడీ టైమింగ్ తో మరో సారి మార్క్స్ కొట్టేసాడు. కామెడీ కోసం ఎక్కువగా స్పూఫ్ ల‌ను వాడుకొన్నారు. పాత సీన్లని, డైలాగులను కలగూర గంప‌లా మిక్స్ చేసి ఆడియన్స్ కి అందించటమే. ఇంతక ముందు అల్లరి నరేష్ సినిమాల్లో కనిపించే 'స్ఫూఫ్' కామెడి  ఈ మూవీలో హైలెట్ గా నిలిచింది. కథ ఏమి లేకుండా కేవలం నవ్వించే ప్రయత్నం చేసాడు దర్శకుడు. ప్రేక్షకుడు ఏం ఆశించి ధియేటర్ కి వేళ్తాడో అది అందించటంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.  మర్డర్ మిస్టరీని కామెడీగా చూపించి ఆడియన్స్ ని మెప్పించాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం డ్రగ్స్, దొంగతనాలు చుట్టూ తిరిగే కథలో సెకండ్ హాఫ్ లో కూడా అదే చూపించటం కొంచెం బోరింగ్ ఉంటుంది. కొత్తగా ఏం చెప్పలేకపోయారు. అయితే అక్క‌డ‌క్క‌డ‌ సిట్యువేషనల్ కామెడీతో ప్రేక్షకులను అలరించారు. ఫస్ట్ పార్ట్ లో చెప్పిన కథనే సీక్వెల్ కూడా తీసుకుని ఈ సారి పబ్ ల బాగోతం బయట పెట్టారు. లాజిక్కులు వెతక్కుండా  హాయిగా నవ్వుకోవటానికి ఈ మూవీ చూడొచ్చు. సోషల్ మీడియా ఫాలోవర్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. కడుపుబ్బా నవ్విస్తూనే కొంచెం ఎమోషనల్ టచ్ ఇచ్చి దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్  ని ప్రేక్షకుడి ముందు ఉంచాడు.    

 

నటీ నటులు:

బాబు మోహన్ పాత్రలో శ్రీ సింహ చ‌లాకీగా నటించాడు. శ్రీ సింహా ఫస్ట్ మూవీ మత్తువదలరా తో హిట్ అందుకున్నాడు. ఆ తరవాత సరైన హిట్ లేదు. మళ్ళీ మత్తువదలరా 2 ఆ లోటు తీర్చింది. యేసు పాత్రలో కనిపించిన సత్య ఈ మూవీకి హీరో అని చెప్పాలి. మూవీ మొత్తం నడిపించింది సత్య కామెడీయే. కొని చోట్ల హీరో పాత్రని కూడా డామినేట్ చేసాడు సత్య. ఈ మూవీలో సత్య కామెడీ టైమింగ్ కి ఆడియన్స్ ఫిదా అయిపోతారు. ఇక నుంచి మరిన్ని అవకాశాలతో సత్య బిజీగా మారటం ఖాయం. కథ లేకపోయినా కేవలం కామెడీ టైమింగ్ తో సత్య నడిపించగలడని భరోసా ఇచ్చాడు. సత్య- శ్రీ సింహ కాంబోలో అల్లరి బాగా కుదిరింది. జాతిరత్నాలు తరవాత పెద్దగా గుర్తింపు లేని పాత్రలు చేసింది ఫరియా అబ్దుల్లా. ఈ మూవీలో మళ్ళీ ఇంపార్టెన్స్ ఉన్న క్యారక్టర్ చేసి మెప్పించింది. గ్లామర్ కి ఛాన్స్ లేని పాత్రలో కూడా తన స్టయిల్లో గ్లామర్ ఒలికించింది. వెన్నెల కిషోర్, అజయ్, సునీల్, రోహిణి, రాజా చేబ్రోలు వంటి వాళ్లు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. సునీల్ పాత్ర సీరియస్ గా సాగింది. 

 

టెక్నికల్ :

దర్శకుడు రితేష్ రానా తన కథలని సింపుల్ గా డ్రగ్స్, గన్స్, మనీ చుట్టూ తిరిగేలా రాసుకుంటూ ఉంటాడు. ఇవి అయితే కథతో సంబంధం లేకుండా సాగిపోవచ్చు. లాజిక్కులు పెద్దగా వెతకరు. అందుకే మళ్ళీ అదే రూట్ ఎంచుకున్నాడు దర్శకుడు రితేష్. తన అంచనా తప్పుకాలేదు. తాను ఎంచుకున్న మార్గంలోనే విజయం సాధించాడు. కమెడియన్ సత్యని ఎంచుకోవటంతోనే సగం విజయం సాధించాడు. ఈ మూవీకి మ్యూజిక్ అందించిన కాలభైరవ కూడా ఆడియన్స్ ని మెప్పించాడు. సినిమాకి సంగీతం కూడా ప్లస్ అయ్యింది. మూవీ ఏ  టెంపొలో సాగుతోందో అదే టెంపోలో మ్యూజిక్ మ్యాచ్ చేసాడు. పాటలు కన్నా బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్లస్ అయింది. సినిమాటోగ్రాఫర్ సురేష్ సారంగం అందించిన విజువల్స్ కూడా హైలెట్ గా నిలిచాయి. ప్రతి ఫ్రేమ్ చాలా బాగుంది. కార్తీక్ శ్రీనివాస్ చేసిన ఎడిటింగ్ పర్ఫెక్ట్ గా కుదిరింది. డైలాగ్స్ లో సింగిల్ లైన‌ర్స్ బాగా మెప్పించాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. 

 

ప్లస్ పాయింట్స్ 

సత్య 
కామెడీ 
మ్యూజిక్  


మైనస్ పాయింట్స్ 

హీరో క్యారక్టర్ 
సెకండాఫ్‌ 

 

ఫైనల్ వర్దిక్ట్ :  కామెడీ 'మత్తు'..!

ALSO READ : IN ENGLISH


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS