నటీనటులు: శరణ్ కుమార్, యస్విక నిష్కల, ఉర్వి సింగ్, సునీల్
దర్శకుడు : శశిధర్ చావలి
నిర్మాతలు: బి.ఎన్. రావు
సంగీత దర్శకులు: మణి శర్మ
సినిమాటోగ్రఫీ: తన్వీర్ అంజుమ్
ఎడిటర్: శశిధర్ చావలి
రేటింగ్ : 2/5
సూపర్ స్టార్ కృష్ణ కుటుంబ నేపధ్య వున్న దాదాపు ఏడు మంది హీరోలు ఇండస్ట్రీలో వున్నారు. ఇప్పుడు విజయ నిర్మల మనవడు శరణ్ కుమార్ (నరేశ్ కజిన్ రాజ్‌కుమార్ కొడుకు) హీరోగా పరిచయం అయ్యారు. శరణ్ కుమార్ హీరోగా శశిధర్ చావలి దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘మిస్టర్ కింగ్’. యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలాంటి వినోదాల్ని పంచింది ? అసలు మిస్టర్ కింగ్ కథ ఏమిటి ?
కథ:
శివ (శరణ్) ఆదర్శభావాలు కలిగిన కుర్రాడు. పార్ట్ టైం ఆర్జేగా పని చేస్తుంటాడు గానీ ఇంధనం లేకుండా ఎగిరే విమానం తయారు చేయడం అతని డ్రీమ్ ప్రాజెక్ట్. శివ ఇంటి ప్రక్కనే ఉండే సీతారామరాజు (మురళీ శర్మ) కూతురు ఉమాదేవి (యశ్విక నిష్కల)తో ప్రేమలో పడతాడు. సీతారామరాజు అన్న కూతురు వెన్నెల (ఉర్వీ ) కూడా శివని ఇష్టపడుతుంది. ఉమాదేవి శివని ఇష్టపడుతుందని సీతారామరాజుకు తెలుస్తుంది. తన కూతురుని పెద్దగా ఆదాయం లేని ఓ ఆర్జేకు ఇవ్వటానికి ఇష్టపడడు. అన్న కూతురు వెన్నెలని శివతో పెళ్లి చేయడానికి ప్లాన్ వస్తాడు. తర్వాత ఏం జరుగుతుంది? శివ తన ప్రేమని గెలిపించుకున్నాడా ? అతని డ్రీం ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యిందా ? అనేది మిగతా కథ.
విశ్లేషణ:
తను నమ్ముకున్న విలువలే జీవితంగా బ్రతికే ఓ కుర్రాడి కథ ఇది. వినడానికి లైన్ బావుంది కానీ ఈ కథని దర్శకుడు డీల్ చేసిన విధానం మాత్రం చాలా నీరసంగా వుంటుంది. శివ తన గతం టాక్సీ డ్రైవర్ సునీల్ కి చెప్పుకోవడంతో కథ మొదలౌతుంది. ఉమాదేవి, వెన్నెలతోనడిపిన ట్రై యాంగిల్ లవ్ స్టొరీ చాలా వీక్ గా వుంటుంది. ఏ దశలోనూ ప్రేమకథపై ఆసక్తి ఏర్పడదు. ఇంటర్వెల్ ఆడిన యంగేజ్ మెంట్ డ్రామా తేలిపోయింది. అంతకుముందు ప్రాజెక్ట్ వాయు మిషన్ కూడా అంత ఎక్సయిటింగా వుండదు.
విరామం తర్వాత మిస్టర్ కింగ్ మరీ బోరింగ్ గా తయారైయింది, కథని పక్కన పెట్టి సోషల్ కామెంటరీకి ఎక్కువ ప్రాధన్యత ఇచ్చాడు. సీన్లు అన్నీ ఫోర్స్ద్ గా వుంటాయి తప్పితే ఏది కథకు తగ్గట్టు వుండదు. అసలు దర్శకుడు చెప్పదలచుకున్న ఎమోషన్ ఏమిటో అర్ధం కాదు. ఈ కథని ముగించిన తీరు కూడా ఆకట్టుకోదు. చివర్లో ప్రేమ గెలిపుంచుకోవడానికి హీరోయిన్ చెస్ గేమ్ ఆడుతుంది. చూస్తున్న ప్రేక్షకుడి చెస్ గేమ్ తెలియకపోతే.. ఏమిటి గొడవ అనే ఫీలింగ్ కలుగుతుంది. అంత సాగదీశారు. చివర్లో అందరూ ఊహించే విధంగానే శుభం కార్డ్ పడుతుంది.
నటీనటులు :
శరన్ కుమార్ లుక్ బావుంది. కానీ నటనలో ఇంకా పెరుగావ్వాలి. డైలాగులు చెప్పడంలో కొన్ని చోట్ల ఇబ్బంది పడ్డాడు. డ్యాన్సులు ఫైట్లు చేసే అవకాశం లేదు. యశ్విక, ఉర్వీ ఓకే అనిపించారు.
మురళి శర్మకి మంచి పాత్ర దక్కింది. సునీల్ గెస్ట్ రోల్ లాంటి పాత్ర. వెన్నెల కిషోర్ నవ్వించే ప్రయత్నం చేశాడు.తనికెళ్ళ భరణి పాత్ర కూడ ఓకే అనిపిస్తుంది, మిగతా నటీనటులు పరిధిమేర కనిపించారు.
టెక్నికల్:
మణిశర్మ మ్యూజిక్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. రెండు పాటలు వినడానికి బావున్నాయి. నేపధ్య ససంగీతం చేయడానికి బలమైన సన్నివేశం లేదు. ఎడిటింగ్ షార్ఫ్ గా ఉండాల్సింది. చాలా లాగ్ వుంది.
కెమరాపని తనం డీసెంట్ గా వుంది. నిర్మాత కథకు కావాల్సింది ఇచ్చారు. దర్శకుడు ఒకే కథలో చాలా అంశాలు చెప్పాలనుకున్నాడు. దీంతో ఏ ఎమోషన్ కూడా సరిగ్గా రిజిస్టర్ కాలేదు.
ప్లస్ పాయింట్స్
సంగీతం
నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్
కథ, కథనం
ఎమోషన్ లేకపోవడం
పూర్ డైరెక్షన్
ఫైనల్ వర్దిక్ట్ : మిస్టర్ కింగ్.. చాలా బోరింగ్!