తారాగణం: ఆది, వైభవి శాండిల్య, రష్మి గౌతమ్, బ్రహ్మాజీ, హిమజ, రఘుబాబు తదితరులు.
సంగీతం: సాయి కార్తీక్
సినిమాటోగ్రఫీ: కార్తీక్ పళని
దర్శకత్వం: ప్రభాకర్
నిర్మాత: బన్నీ వాసు
యావరేజ్ యూజర్ రేటింగ్: 2/5
కథా కమామిషు..
కిరణ్ (ఆది) ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంటాడు. వాటి నుంచి బయటపడే క్రమంలో మరిన్ని ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. తన తండ్రి (పోసాని కృష్ణమురళి)కి ఓ రిసార్ట్ ఉండేదని తెలుసుకుని, దాన్ని తెరచి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలనుకుంటాడు కిరణ్. తన ఫ్రెండ్స్ (రష్మి, బ్రహ్మాజీ), వైభవి)తో కలిసి ఆ రిసార్ట్‌లోకి వెళతాడు. అక్కడ అతని సమస్యలు ఇంకా ఎక్కువవుతాయి. ఓ దెయ్యం వారిని వెంటాడుతుంది. మరి ఆ దెయ్యం నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి కిరణ్ బయటపడ్డాడా? లేదా? అనేది తెరపై చూడాల్సిన అసలు కథ.
నటీనటులెలా చేశారు..
ఇప్పటిదాకా చేసిన సినిమాలతో పోల్చితే కొంచెం డిఫరెంట్‌గా తన యాక్టింగ్, బాడీ లాంగ్వేజ్ ఉండేలా చూసుకోవడానికి ప్రయత్నించాడు ఆది. తన వరకూ బాగానే చేశాడు. మాస్ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలా ఉంది రశ్మి క్యారెక్టర్. ఆమె పాత్రకి కొంచెం హాట్‌నెస్ బాగానే అద్దాడు దర్శకుడు, ఆ హాట్ అప్పీల్ పండించడానికి బాగానే ప్రయత్నించిందామె. శాంబవి చూడ్డానికి బాగానే ఉన్నా పెర్ఫామెన్స్ పరంగా పెద్దగా రాణించలేకపోయింది. బ్రహ్మాజీ నవ్వులు పూయించాడు. దెయ్యం పాత్రలో హిమజ ఓకే. మిగతా పాత్రలన్నీ తమ పరిధి మేర ఓకే అనిపిస్తాయి.
విశ్లేషణ...
కామెడీని హర్రర్‌తో మిక్స్ చేయడం కమర్షియల్‌గా సినిమాని వర్కవుట్ చేసేందుకు ఓ మార్గంగా ఎంచుకుంటున్నారు చాలామంది దర్శకులు. ఈ సినిమా విషయంలోనూ అదే జరిగింది. అయితే దాన్ని పెర్‌ఫెక్ట్‌గా మిక్స్ చేయడంలోనే సినిమా రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. హర్రర్ ఎలిమెంట్‌తో కామెడీ పెర్‌ఫెక్ట్‌గా కనెక్ట్ కావాల్సి ఉంటుంది. ఈ సినిమాలో అది చాలావరకు లోపించిందని చెప్పాలి. కాన్‌ఫ్లిక్ట్స్‌ని సరిగ్గా డీల్ చేయలేకపోవడం, నటీనటుల్ని సరిగ్గా వాడుకోలేకపోవడం మైనస్‌లుగా కనిపిస్తాయి. కొన్ని హర్ర్ సీన్స్, కాసిన్ని కామెడీ సీన్స్ ఫర్వాలేదన్పిస్తాయి. ఫస్టాఫ్ ఓకే అన్పించినా, సెకెండాఫ్‌లో 'ఏదోలా లాగించేయడం' థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రేక్షకుడ్ని నిరాశపరుస్తుంది.
సాంకేతిక వర్గం పనితీరు..
దెయ్యం సినిమాలకు కామెడీ అద్దడం కొత్తేమీ కాదు. ఈ తరహా సినిమాలు చాలానే వచ్చాయి. కొంచెం కొత్తదనం గురించి దర్శకుడు ఆలోచించాల్సి ఉంది. కథనం విషయంలోనూ అక్కడక్కడా లూప్ హోల్స్ బయటపడ్తాయి. డైలాగ్స్ ఓకే. సంగీతం ఇలాంటి సినిమాలకు మెయిన్ ఎలిమెంట్స్‌లో ఒకటిగా ఉంటుంది. ఇంకాస్త బెటర్‌గా ఉండి ఉంటే బాగుండేది. కాస్ట్యూమ్స్, ఆర్ట్ డిపార్ట్‌మెంట్ ఓకే అన్పిస్తాయి. నిర్మాణపు విలువలు బాగానే ఉన్నాయి.
ఫైనల్ వర్డ్..
నెక్స్‌ట్ నువ్వే - నవ్వించలేదు, భయపెట్టలేదు.