ఆఫీసర్ తెలుగు మూవీ రివ్యూ & రేటింగ్

మరిన్ని వార్తలు

తారాగణం: నాగార్జున, మైరా సరీన్, అన్వర్ ఖాన్, బేబీ కావ్య తదితరులు
నిర్మాణ సంస్థ: R కంపెనీ ప్రొడక్షన్
సంగీతం: రవిశంకర్
ఛాయాగ్రహణం: భరత్ & రాహుల్
ఎడిటర్: అన్వర్ అలీ & కమల్
రచన-దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ

రేటింగ్: 3/5

దాదాపు రెండు దాశాబ్దాల తరువాత కింగ్ నాగార్జున-ఆర్జీవీ ల కలయికలో ఆఫీసర్ అనే చిత్రం ఈరోజు విడుదలవుతున్నది. అయితే ఈమధ్య కాలంలో ఆర్జీవీ సరైన ఫాంలో లేకపోవడం అలాగే నాగార్జున కూడా సోలో హీరోగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా సినిమా చేయడం లేదు. అలాంటి ఈ విచిత్ర పరిస్థితిలో ఆఫీసర్ చిత్రం ఎలా ఉండబోతున్నదో ఈ క్రింద సమీక్షలో చూద్దాం...

కథ:

శివాజీ (నాగార్జున)-నిబంధనలు లోబడి పనిచేసే ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్. ఈయనకి ముంబై లో పెద్ద పొలీస్ ఆఫీసర్ అయిన నారాయణ్ పసారి పైన ఉన్న ఆరోపణల, మాఫియా సంబంధాల గురించి విచారణ చేపట్టే పనిని అప్పగిస్తారు.

ఇక ఈ సందర్భంగా నారాయణ-శివాజీ ల మధ్య జరిగే సంఘర్షణ నే ఈ చిత్ర కథ అని చెప్పొచ్చు.  నారాయణ లాంటి శక్తివంతమైన పోలీసుని దాటుకుని శివాజీ విచారణ ముగించాడా లేదా అనేది తెరపైన చూడాల్సిందే..

నటీనటుల పనితీరు:

నాగార్జున: శివాజీ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి ఒక నిజయీతీ గల ఆఫీసర్ గా అధ్బుతంగా నటించాడు. ఇక తన బాడీని కూడా ఫిట్ గా ఉంచుకునే నాగ్, ఈ పాత్రకి చక్కగా సరిపోయాడు.

మైరా సరీన్: ఈ సినిమాలో మైరా హీరోయిన్ కాదు, కేవలం ఒక లేడీ పొలీస్ ఆఫీసర్ మాత్రమే అని చెప్పాలి. ఇక తన నటన గురించి చెప్పుకునే అంతలా సన్నివేశాలు ఏమి లేవు.

కావ్య: శివాజీ కూతురిగా చాలా చక్కగా చేసింది. తండ్రి అంటే అమితమైన ప్రేమ ఉన్న పాపగా చక్కగా ఒదిగిపోయింది.

నారాయణ పసారిగా చేసిన అన్వర్ ఖాన్ నటనాపరంగా మంచి మార్కులే వేయించుకున్నాడు. కాని ఆ పాత్రకి డబ్బింగ్ అంతగా నప్పలేదు.

 

విశ్లేషణ:

ఒక ఇరవయ్యేళ్ళ తరువాత నాగ్-ఆర్జీవీ కలిసి ఓ సినిమా చేస్తున్నారు అంటే ఆ చిత్రం పైన అంచనాలు ఎక్కువగానే ఉంటాయి, ఈ ‘ఆఫీసర్’ విషయంలో కూడా అదే జరిగింది. అయితే ఈ సినిమాలో కథా, కథనం కన్నా సౌండ్ ఎఫ్ఫెక్ట్స్ అలాగే టెక్నికల్ అంశాల పైనే ఎక్కువ దృష్టి పెట్టాడు.

నాగార్జున సినిమాలో హీరోయిన్ ని పెట్టకుండా దాదాపుగా వర్మ ఒక ప్రయోగమే చేశాడు అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో రొటీన్ కమర్షియల్ అంశాల కన్నా వర్మ మార్క్ యాక్షన్ సీక్వెన్స్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. వర్మ వీరభిమానులకి ఈ సినిమా నచ్చుతుంది.

అయితే సాధారణ ప్రేక్షకులకి, ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇదే నచ్చే సినిమా మాత్రం కాదు.

సాంకేతిక వర్గం పనితీరు:

టెక్నికల్ అంశాలకి పెద్ద పీట వేయడంతో, సౌండ్ ఎఫెక్ట్స్ కి ఈ సినిమాలో మంచి ప్రాధాన్యం దక్కింది. సినిమా చూస్తున్నంత సేపు కూడా సౌండ్ ఎఫెక్ట్స్ మనకి ప్రత్యేకంగా తెలుస్తుంటాయి. కెమేరాపనితనం కూడా బాగుంది.

బలాలు:

నాగార్జున
సౌండ్ ఎఫ్ఫెక్ట్స్
కథనం

బలహీనతలు:

కథలో బలం లేదు
యాక్షన్ సీక్వెన్సులు ఎక్కువ

ఆఖరి మాట: వర్మ ఫ్యాన్స్ కి బాగా నచ్చుతుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS