'ఆక్సిజన్' మూవీ రివ్యూ & రేటింగ్స్

మరిన్ని వార్తలు

తారాగణం: గోపీచంద్, రాశి ఖన్నా, అను ఇమాన్యుల్, జగపతి బాబు తదితరులు
నిర్మాణ సంస్థ: శ్రీసాయిరామ్ క్రియేషన్స్
ఎడిటర్: ఉద్ధవ్
ఛాయాగ్రహణం: చోటా కె నాయుడు & వెట్రి
సంగీతం: యువన్ శంకర్ రాజా
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: చిన్నా
నిర్మాత: ఎస్. ఐశ్వర్య
రచన-దర్శకత్వం: ఏఏం. జ్యోతి కృష్ణ 

యావరేజ్ యూజర్ రేటింగ్: 2.5/5

చాలా కాలంగా సరైన్ హిట్ కోసం ఎదురు చూస్తున్న గోపీచంద్ ఒక్కసారిగా అకస్మాత్తుగా ‘ఆక్సిజన్’ అంటూ ప్రేక్షకుల ముందుకి వచ్చేశాడు. వాస్తవానికి ఈచిత్రం ఎప్పుడో విడుదల అవ్వాల్సి ఉన్నా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చి ఈరోజు విడుదలైంది. ఇక ఏఏం రత్నం పెద్ద కుమారుడు ఏఏం జ్యోతికృష్ణ దాదాపుగా 14 ఏండ్ల తరువాత తీసిన తెలుగు చిత్రం ‘ఆక్సిజన్’ కావడం గమనార్హం. మరి ఈ ఇద్దరి కలియకలో వచ్చిన చిత్రం ఎలా ఉందొ ఈ క్రింది సమీక్షలో చూద్దాం..

కథ..

రఘుపతి (జగపతిబాబు) ఒక పెద్ద వ్యాపారవేత్త, గుర్తు తెలియని వ్యక్తులు ఆయన అన్నని, అన్న కొడుకిని దారుణంగా చంపేస్తారు. ఈ పగలకి దూరంగా తన కూతురు అయిన శృతి (రాశి ఖన్నా) పంపించేయాలి అన్న ఆలోచనతో అమెరికాలో ఉండే కృష్ణ ప్రసాద్ (గోపీచంద్) కి ఇచ్చి పెళ్ళి చేద్దామనుకుంటాడు.

ఆ తరుణంలో రఘుపతి కుటుంబం మీద శత్రువులు దాడి చేయడం ఆ దాడిని కృష్ణప్రసాద్ ప్రతిఘటించడం జరుగుతుంది. దీనితో కృష్ణప్రసాద్ ని అందరు తమలో ఒకడిగా చూసుకుంటారు ఆ కుటుంబం. ఆ సమయంలోనే ఆ ఇంటిలోని మరో ఇద్దరు కుటుంబసభ్యులని చంపేస్తారు.

అసలు వారిని ఎందుకు చంపారు? వారు రఘుపతి కుటుంబాన్ని టార్గెట్ చేయడానికి కారణాలు ఏంటి? అన్నవి తెరపై చూడాలి.

 

నటీనటుల ప్రతిభ:

గోపీచంద్: ఈ సినిమాకి ఎంతవరకు నటించాలో అంతవరకు నటించాడు. తన పాత్ర పరిది మేరకు బాగానే చేశాడు. అయితే సెకండ్ హాఫ్ లో వచ్చే గోపీచంద్ పాత్ర మాత్రం అందరికి షాక్ ఇస్తుంది.

రాశి ఖన్నా: సినిమా మొదటి నుండి చివరి వరకు ఈ పాత్ర మనకి కనిపిస్తుంది. అయితే నటనకి అంత పెద్ద అవకాశామేమి లేదు.

 

జగపతిబాబు: రఘుపతి పాత్రలో ఇంటి పెద్దగా కనిపిస్తాడు. ఇక ఆయన నుండి ఆడియన్స్ కి ఒక సర్ప్రైజ్ ఉంటుంది.

అను ఇమాన్యుల్: గీత పాత్రలో బాగా నటించింది. ఈ పాత్రకి నటన ప్రదర్శించే స్కోప్ ఉండడంతో ఆమె ఈ అవకాశాన్ని బాగానే ఉపయోగించుకుంది.

అలీ, కిక్ శ్యాం, బ్రహ్మాజీ, కాలకేయ ప్రభాకర్, అమిత్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

విశ్లేషణ:

దర్శకుడు జ్యోతికృష్ణ దాదాపు 14 ఏళ్ళ తరువాత చేస్తున్న చిత్రం కావడంతో కథ పరంగా ఒక మంచి పాయింట్ నే ఎంచుకున్నాడు. సామాజిక దురలవాటు పైన కథ రాసుకోవడం, దానికి ‘ఆక్సిజన్’ అని టైటిల్ పెట్టడం కూడా అభినందించదగ్గ విషయమే. అయితే అది ప్రేక్షకులకి చూపించే విధానంలోనే అంతగా సక్సెస్ కాలేకపోయాడు.

ఆయన చెప్పాలనుకున్న పాయింట్ సెకండ్ హాఫ్ లో రివీల్ చేస్తాడు, దీనితో ఫస్ట్ హాఫ్ చాలా రొటీన్ గా ఒకరకంగా చెప్పాలంటే ప్రేక్షకుల సహనానికి కూడా కొన్ని సన్నివేశాలు పరీక్ష పెడతాయి. అయితే ఇంటర్వెల్ లో ఇచ్చే ట్విస్ట్ మాత్రం దాదాపుగా ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలతో పోలిస్తే చాలా బాగా ఉంది అని కచ్చితంగా చెప్పొచ్చు.

ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, ఈ సినిమా అసలు కథ అనేది ఈ భాగంలోనే ఉండడంతో, ప్రేక్షకులు ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ చిత్రం చూసిన తరువాత దర్శకుడు ఈ కథని మరింత బాగా తీసి ఉండవలసింది అన్న అభిప్రాయం కలుగుతుంది.
గోపీచంద్ వంటి ఫిజిక్ ఉన్న హీరోని ఈ కథకి ఎంచుకోవడం వరకు దర్శకుడు సక్సెస్ అయినా ఇంకా ఆయన నుండి ఇంకాస్త ఎనర్జీ రాబట్టి ఉంటె బాగుండేది.

సాంకేతిక వర్గం:

చోటా కె నాయుడు & వెట్రి కెమెరా పనితనం అందరిని ఆకర్షిస్తుంది. యువన్ శంకర్ రాజా సంగీతం మాత్రం అందరిని నిరాశపరుస్తుంది. చిన్నా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.

ప్లస్ పాయింట్స్:

+ కథ
+ సెకండ్ హాఫ్
+ ఇంటర్వెల్ సీన్
+ ఛాయాగ్రహణం

మైనస్ పాయింట్స్:

- రొటీన్ ఫస్ట్ హాఫ్
- సంగీతం

ఆఖరి మాట: ‘ఆక్సిజన్’- ఇంకా బాగా తీయొచ్చు.

రివ్యూ బై సందీప్
 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS