'పెద్దన్న' మూవీ రివ్యూ & రేటింగ్!

మరిన్ని వార్తలు

నటీనటులు : రజినీకాంత్, కీర్తి సురేష్, నయనతార, మీనా, ఖుష్భు, జగపతి బాబు తదితరులు
దర్శకత్వం : శివ
నిర్మాత‌లు : కలానిది మారన్
సంగీతం : ఇమ్మన్
సినిమాటోగ్రఫర్ : వెట్రి పలనిసామి 
ఎడిటర్ : రూబెన్


రేటింగ్: 2.25/5


రజనీకాంత్ సినిమా అంటేనే ఒక సంచలనం. ఆయన నుంచి సినిమా వస్తుందంటే యావత్ సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తారు. అయితే కొనాళ్ళుగా రజనీ నుంచి నిఖార్సయిన సినిమా లేదు. కబాలి నిరాస పరిచింది.  రోబో 2 దెబ్బకొట్టింది. కాలా ఓకే అనిపించింది. పేటా కూడా పాస్ మార్కులతోనే బాక్స్ ఆఫీస్ దాటింది. ఇప్పుడు రజనీ నుంచి మరో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే ‘అన్నాత్తే’. తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో విడుదలైయింది.

 

ట్రైలర్ మాస్ కి నచ్చేసింది. రజనీ మార్క్ ఉంటుదని ఆశ రేపింది. రజనీతో పాటు కీర్తి సురేశ్‌ ,  నయనతార  ఖుష్బూ, మీనా, జగపతి బాబు, ప్రకాశ్‌రాజ్‌ ఇలా భారీ తారాగణం కనిపించింది. మరి ఇంత భారీ తారాగణం వున్న సినిమా ఫలితం ఏమిటి ? పెద్దన్న అంచనాలు అందుకున్నాడా ? అసలు ఏమిటీ పెద్ద కథ.


కథ:


వీరన్న (రజనీకాంత్ ) పంచాయితీ ప్రెసిడెంట్. వీరన్న చెల్లెలు (  కీర్తి సురేష్) . చెల్లెలు అంటే వీరన్నకు పంచప్రాణం. చెల్లికి ఎలాంటి కష్టం వచ్చిన క్షణాల్లో ముందుంటాడు వీరన్న. పెళ్లీడు వచ్చిన చెల్లికి వివాహం చేయాలని నిర్ణయిస్తాడు వీరన్న. ఇంతలో చెల్లి ఇంట్లో నుంచి పారిపోతుంది. ఇంతకీ చెల్లి ఎందుకు పారిపోయింది ? ఎక్కడికి పారిపోయింది ? తన చెల్లి కోసం వీరన్న ఏం చేశాడు ? అనేది వెండితెరపై చూడాలి.


విశ్లేషణ :


వీరం, వేదాళం, విశ్వాసం లాంటి సినిమాలు అందించాడు దర్శకుడు శివ. ఆ సినిమాల్లో గొప్ప కధలు లేకపోయిన కమర్షియల్ హంగులు జోడించి హిట్లు కొట్టాడు. పెద్దన్న ని కూడా అదే మార్క్ లో నడిపించే ప్రయత్నం చేశాడు. రజనీ మార్క్ ని అర్ధం చేసుకొని సిస్టర్ సెంటిమెంట్ జోడించి పెద్దన్న కధని తయారు చేశాడు. ఇది రజనీ కి సరిపోయే కధనే. అయితే ఈ కధ ఇరవై ఏళ్ళ క్రితం రజనీ చేయాల్సింది. అప్పటి కూడా పెద్దన్న ఫ్రెష్ గా అనిపించే ఛాన్స్ ఉంటుందా అంటే అనుమానమే. స్క్రిప్ట్‌లో ఒరిజినాలిటీ అస్సల్ కనిపించదు. రజనీ పాత సినిమాల్లో సీన్లు ఏరుకొని పెద్దన్నని తయారుచేసిన ఫీలింగ్ కలుగుతుంది ప్రేక్షకుడికి.


సినిమా మొదలైననప్పటి నుంచి చివరి వరకూ ప్రేక్షకుడి అంచనాల తగ్గట్టు ఎలాంటి మలపులు లేకుండా తర్వాత సీన్ ఇదీ అన్నట్టుగా సాగుతుంది. మొదటి సగం రజనీ మేనరిజమ్స్ , స్టయిల్ ని నమ్ముకొని బండి లాగించాడు దర్శకుడు. కీర్తి సురేష్ పాత్ర రూపంలో ఇంటర్వెల్ కి ఒక ఆసక్తికరమైన బ్రేక్ ఇచ్చినప్పటికీ సెకండ్ హాఫ్ మొదలైన నిమిషాల్లోనే మిగతా మొత్తం ప్రేక్షకుడి ఊహకు అందిపోతుంది. 90 దశకం నాట్ ట్రీట్ మెంట్ తో ఓవర్  మెలోడ్రామాతో  సినిమా నీరుగారిపోతుంది. ఇక క్లైమాక్స్ కూడా రొటీన్ గా సాగిపోతుంది. రజనీకాంత్ తప్పా చెప్పుకోవడానికి ఇంకేమీ లేని సినిమాగా మిగిలిపోతుంది పెద్దన్న.


నటీనటులు : 


రజనీ కాంత్ నటన గురించి ఇప్పుడు చెప్పడానికి కొత్తగా ఏమీ లేదు. తన అనుభవంతో పెద్దన్న పాత్రని ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఆయన మార్క్ స్టయిల్ సినిమాలో కనిపించింది. అయితే సీన్స్ లో బలం లేకపోవడంతో మెనరిజమ్స్ తేలిపోయాయి. పాటల్లో , యాక్షన్ సీన్స్ లో హుషారుగా కనిపించారు రజనీ. అయితే వయసు మీద పడిన సంగతి తెరపై సులువుగానీ తేలుస్తుంటుంది. 


కీర్తి సురేష్ నటన కు వంకపెట్టలేం. ఎమోషనల్ సీన్స్ లో ఆకట్టుకుంది. అయితే ఆమె పాత్రకి కొత్త ట్రీట్మెంట్ లేదు. నయనతార ని స్టార్ హీరోయిన్ అని పెట్టుకున్నారు తప్పితే ఆమె నుంచి నటన ఏమీ పెద్దగా ఆశించలేదు. ఖుష్బూ, మీనా పాత్రలు కూడా పాత గానే సాగాయి. జగపతి బాబు, ప్రకాశ్‌రాజ్‌ ,అభిమన్యు పాత్రల్లో విలనిజం వున్నా అవి అంత బలంగా లేవు. మిగతా నటులు పరిధి  మేరకు కనిపించారు.
 

టెక్నికల్ గా : 


సాంకేతికంగా సినిమా రిచ్ గా వుంది.  డి. ఇమ్మాన్‌ సంగీతం బావుంది. రెండు పాటులు చూడడానికి బావున్నాయి. నేపధ్య సంగీతం కూడా హెవీగా సాగింది. కెమరా పనితనం బావుంది. విజువల్స్ రిచ్ గా చూపించారు.  ఎడిటింగ్ ఇంకొంచెం సార్ఫ్ గా చేయాల్సింది. నిర్మాణ విలువలు ఓకే.


ప్లస్ పాయింట్స్


రజనీకాంత్
కొన్ని కమర్షియల్ హంగులు
రెండు పాటలు


మైనస్ పాయింట్స్


పాత కాలపు కథ
బోరింగ్ స్క్రీన్ ప్లే
మితిమీరిన మెలో డ్రామా


ఫైనల్ వర్డిక్ట్ : పెద్దన్న .. చాలా పాతన్న.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS