నటీనటులు: నాగ శౌర్య, మాళవిక నాయర్, శ్రీనివాస్ అవసరాల, మేఘా చౌదరి, అశోక్ కుమార్, అభిషేక్ మహర్షి, శ్రీవిద్య
దర్శకుడు : శ్రీనివాస్ అవసరాల
నిర్మాతలు: టి జి విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి
సంగీత దర్శకులు: కళ్యాణి మాలిక్
సినిమాటోగ్రఫీ: సునీల్ కుమార్ నామా
ఎడిటర్: కిరణ్ గంటి
రేటింగ్: 2.25/5
నటుడిగా పరిచయమై దర్శకుడిగా మారారు శ్రీనివాస్ అవసరాల. ఇప్పటి వరకూ రెండు సినిమాలు తీశారు. ఈ రెండు సినిమాల్లో నాగశౌర్యనే హీరో. ఇప్పుడు వీరి కలయికలో మూడో సినిమాగా వచ్చింది ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి. ప్రామెసింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో ఆసక్తిని పెంచిన ఈ సినిమా ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇచ్చింది ? ఇంతకీ ఆ ఫలానా కథ ఏమిటి ?
కథ :
సంజయ్ (నాగశౌర్య), అనుపమ (మాళవిక నాయర్) ఇద్దరూ ఒకే కాలేజ్ లో ఇంజనీరింగ్ చేస్తారు. సంజయ్ కంటే అనుపమ ఏడాది పెద్ద. కాలేజ్ లో వీరి మధ్య స్నేహం ఏర్పడుతుంది. ఆ తర్వాత మాస్టర్స్ చదువుకునేందుకని లండన్ వెళతారు. అక్కడ ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారి సహజీవనం చేస్తారు. అనుకోని కొన్ని సంఘటనలు వారిని వేరు చేస్తాయి. మళ్లీ ఆ ఇద్దరూ ఎప్పుడు కలుసుకున్నారు? ఎలాంటి విషయాలు వారిద్దరి మధ్య దూరానికి కారణమయ్యాయనేది ? మిగతా కథ.
విశ్లేషణ :
కథగా చూస్తే చాలా చిన్న కథ ఇది. అయితే దిన్ని చాప్టర్ లుగా విడదీసి పదేళ్ళ ప్రయాణం చూపించాడు అవసరాల. సంజయ్, అనుపమ ఓ రెస్టారెంట్ లో కలుసుకోవడంతో కథ మొదలౌతుంది. తర్వాత కథ గతంలోకి వెళుతుంది. ఇంజనీరింగ్ కాలేజీ స్నేహం, లండన్ లో మాస్టర్స్ చేస్తున్న సమయంలో ప్రేమ.. ఇలా చాప్టర్ వైజ్ గా చూపించుకుంటూ వెళ్ళారు. ఆరంభంలో ఆసక్తిగా అనిపించిన ఈ ప్రయాణం రానురాను సహనానికి పరీక్షపెడుతుంది. అసలు కథలో సంఘర్షణ ఏమిటనేది ఇంటర్వెల్ తర్వాత కూడా తెరపైకి రాదు.
చిన్న పాయింట్ తీసుకున్నప్పుడు కథనం ఎక్కడా బోర్ కొట్టకుండా ప్లాన్ చేసుకోవాల్సింది. కానీ అదీ జరగలేదు. సంజయ్, అనుపమల ప్రయాణాన్ని అలా సాగదీసుకుంటూ వెళ్లారు. ఇంటర్వెల్ తర్వాత అసలు ఈ కథ గమ్యం ఏమిటో కూడా అంతు చిక్కదు. తెరపై జరుగుతున్న సన్నివేశాలని ప్రేక్షకుడు క్లూ లెస్ గా చూస్తూ వుండటం తప్పితే వాటిని ఎంజాయ్ చేయడం కానీ ఇన్వాల్ అవ్వడం కానీ జరగదు. కథకి ఇచ్చిన ముగింపు కూడా చాలా చప్పగా వుంటుంది. అసలు ఈ పాయింట్ పట్టుకొని సినిమా తీశారా ? అనే ఫీలింగ్ కలుగుతుంది.
నటీనటులు :
నాగశౌర్య డిఫరెంట్ లుక్స్ లో కనిపించడానికి అవకాశం ఇచ్చిన కథ ఇది. పాత్రకు తగ్గట్టుగా తనని తాను మార్చకున్న విధానం మెప్పిస్తుంది. నాగశౌర్య, మాళవిక నాయర్ ల కెమిస్ట్రీ బావుంది. పదేళ్ల ప్రయాణంలో ఆయా దశలకు తగ్గట్టుగా కనిపించిన తీరు ఆకట్టుకుంటుంది. శౌర్య, మాళవిక సహజంగా తెరపై కదిలారు. శౌర్య స్నేహితుడి పాత్రలో కనిపించిన నటుడు ఓకే అనిపిస్తాడు. అతను అవకాయ్ గురించి చెప్పే సీన్ నవ్విస్తుంది. అలాగే నీలిమ రత్నబాబు పాత్ర కూడా నవ్విస్తుంది. అవసరాల చిన్న పాత్రలో కనిపించారు. మేఘా చౌదరి పాత్రకు అంత ప్రాధన్యత లేదు. మిగతా పాత్రలు అలా కనిపించాయి అంతే.
టెక్నికల్:
సాంకేతికం గా సినిమా బావుంది. కళ్యాణి మాలిక్ మ్యూజిక్ మోలోడీయస్ గా ఆకట్టుకుంది. కెమరాపని తనం డీసెంట్ గా వుంది. ఫ్రేమ్స్ అన్నీ రిచ్ గా కనిపించాయి. చాలా సీన్స్ ఇంకా శార్ఫ్ చేయాల్సింది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా వున్నాయి. అవకాయ్ గురించి చెప్పే సీన్ లో అవసరాల మార్క్ కనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్
నాగశౌర్య , మాళవిక
సంగీతం, నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్
బలహీనమైన కథ
సాగదీత
భావోద్వేగాలు పండకపోవడం
ఫైనల్ వర్దిక్ట్ : పస లేని అబ్బాయి.. నస పెట్టే అమ్మాయి