చిత్రం: ప్రసన్న వదనం
నటీనటులు: సుహాస్, రాశీ సింగ్
దర్శకత్వం: అర్జున్ వై.కె
నిర్మాతలు: మణికంఠ జె ఎస్, ప్రసాద్ రెడ్డి టి ఆర్
సంగీతం: విజయ్ బుల్గానిన్
ఛాయాగ్రహణం: ఎస్.చంద్రశేఖరన్
కూర్పు: కార్తీక శ్రీనివాస్ ఆర్
బ్యానర్స్: లిటిల్ థాట్స్ సినిమాస్ మరియు అర్హ మీడియా
విడుదల తేదీ: 3 మే 2024
ఐక్లిక్ మూవీస్ రేటింగ్: 2.5/5
ఫ్యామిలీ డ్రామా, కలర్ ఫోటో, అంబాజీపేట.. ఇలా ఒకొక్క సినిమాతో ప్రేక్షకులకి దగ్గరయ్యాడు సుహాస్ . ఇప్పుడు తన నుంచి 'ప్రసన్న వదనం' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుకుమార్ వద్ద పని చేసిన అర్జున్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ట్రైలర్ లో చూపించిన ఫేస్ బ్లైండ్ నెస్ కాన్సెప్ట్ సినిమాపై ఆసక్తిని పెంచింది . మరి ఈ కాన్సెప్ట్ లో వున్న కొత్తదనం ఏమిటి ? ప్రేక్షకులకు థ్రిల్ పంచిందా ?
కథ: ఓ యాక్సిడెంట్ లో తల్లితండ్రులని కోల్పోతాడు సూర్య(సుహాస్). అదే యాక్సిడెంట్ కారణంగా తనకి ఫేస్ బ్లైండ్ నెస్ డిజార్డర్ వస్తుంది. అంటే .. తను మొహాలని గుర్తుంచలేడు. ఓ రోజు అమృత( సాయి శ్వేత)అనే అమ్మాయిని ఎవరో దుండగుడు లారీ కింద తోసి హత్య చేస్తాడు. ఈ ఘటనని ప్రత్యక్షంగా చూస్తాడు సూర్య. అయితే తనకి ఫేస్ బ్లైండ్ నెస్ వుండటం కారణంగా ఆ తోసిన వ్యక్తి ఎవరని గుర్తుపట్టలేడు. కానీ బాదితురాలికి న్యాయం జరగాలని భావించి కాయిన్ బాక్స్ నుంచి పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి జరిగినది చెబుతాడు. ఈ కేసుని ఎసిపీ వైదేహి( రాశి సింగ్) ఎస్ఐ( నితిన్ ప్రసన్న) విచారిస్తారు. అయితే విచారణ జరుగుతుండగా సూర్యని మూడు మర్డర్ కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది. తర్వాత ఏం జరిగింది ? అసలు అమృత ఎవరు? అమృతని చంపాల్సిన అవసరం ఎవరికి వుంది ? ఫేస్ బ్లైండ్ నెస్ కారణంగా సూర్య ఎలాంటి కష్టాలు ఎదుర్కున్నాడు ? ఇదంతా తెరపై చూడాలి.
విశ్లేషణ: కాన్సెప్ట్ కుదిరితే సరిపోదు. దాన్ని ఆకట్టుకునేల ప్రజెంట్ చేయాలి. ఫేస్ బ్లైండ్ నెస్ కాన్సెప్ట్ తో తెలుగులో ఇప్పటివరకూ సినిమా రాలేదనే మాట నిజమే. ఇలాంటి కొత్త పాయింట్ ని తీసుకున్న దర్శకుడు అర్జున్ ఆ పాయింట్ అంతే కొత్తగా తెరపై చెప్పడంతో పట్టుతప్పాడు సూర్య తల్లితండ్రులు యాక్సిడెంట్ లో చనిపోవడం, సూర్యకి ఫేస్ బ్లైండ్ నెస్ రావడం, అధ్య( పాయల్ రాధకృష్ణ) ఓ ప్రేమకథ.. ఇవన్నీ కథకు డీసెంట్ ఓపెనింగ్ నే ఇస్తాయి.
కానీ కథలో క్రైమ్ ఎలిమెంట్ వచ్చిన తర్వాతే అసలు సమస్య. ఇక్కడే సినిమా బలంగా ఉండాల్సింది కానీ అది జరగలేదు. ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ ఓకే అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ మాత్రం నీరుగార్చేశాడు దర్శకుడు ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఎపిసో తేలిపోయింది. క్లైమాక్స్ కూడా సాగదీతగా నడిచింది. టోటల్ గా కేవలం ఐడియా మాత్రమే బావుందనే అనుభూతిని కలిగిస్తుంది ప్రసన్న వదనం.
నటీనటులు: సూర్య పాత్రలో సహజంగా చేశాడు సుహాస్. ఇందులో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ చేసే అవకాశం కూడా వచ్చింది. పాయల్ లవ్ ట్రాక్ కథలో సరిగ్గా ఇమగలేదు. ఆ పాత్రని క్లైమాక్స్ లో వాడుకున్న విధానం మాత్రం బావుంది. రాశి సింగ్ కి ఒక వెరైటీ పాత్రే దక్కింది. ఆమె నటన కాస్త 'అతి' ధ్వనించింది. నితిన్ ప్రసన్న నటన ఓకే . హర్ష, సత్య కొన్ని సీన్స్ లో నవ్విస్తారు. నందు పాత్రని ఇన్ యాక్టివ్ చేశారు. పాటు మిగతా నటీనటులు పరిధిమేరకు వున్నారు.
టెక్నికల్: విజయ్ బుల్గానిన్ పాటలు తేలిపోయాయి. నేపధ్య సంగీతం మాత్రం పరవాలేదనిపిస్తుంది. కెమరాపనితనం సోసోగానే వుంది. ప్రొడక్షన్ డిజైన్ లో బడ్జెట్ పరిమితులు కనిపిస్తాయి. దర్శకుడు కాన్సెప్ట్ పట్టుకున్నాడు కానీ కథనంను వదిలేశాడు.
ప్లస్ పాయింట్స్
సుహాస్
కాన్సెప్ట్
నేపధ్య సంగీతం
మైనస్ పాయింట్స్
స్క్రీన్ ప్లే
సెకండ్ హాఫ్
తేలిపోయిన థ్రిల్
ఫైనల్ వర్దిక్ట్ : ప్రసన్న వదనం.. కాన్సెప్ట్ లోని కిక్ కథలో లేదు.