'పుష్ప' మూవీ రివ్యూ & రేటింగ్

మరిన్ని వార్తలు

నటీనటులు: అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్అ, నసూయ భరద్వాజ్ తదితరులు
దర్శకత్వం : సుకుమార్
నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై రవిశంకర్
సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: మిరోస్లా కూబా  బ్రోజెక్
ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్


రేటింగ్: 2.75/5


'పుష్ప' సెట్స్ పైకి వెళ్లినపుడే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కారణం.. అల్లు అర్జున్- సుకుమార్ ల కాంబినేషన్. అల్లు అర్జున్ ని హీరోగా నిలబెట్టిన దర్శకుడు సుకుమార్. బన్నీని ఆర్యగా ప్రేక్షకుల మదిలో గుర్తిండిపోయేలా విజయాన్ని అందించాడు. ఇప్పుడు ఈ ఇద్దరు మళ్ళీ కలిశారు. ఇది బ్లాక్ బస్టర్ కలయిక. 'అల వైకుంఠపురములో' లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత బన్నీ,.. . రంగస్థలం లాంటి క్లాసిక్ తర్వార సుకుమార్... కలసి 'తగ్గేదేలే' అన్నారు. అంతేకాదు.. బన్నీ కెరీర్ లోనే మొదటి పాన్ ఇండియా సినిమాగా వచ్చింది పుష్ప. మరి ఇన్ని విశేషాలు వున్న పుష్ప అభిమానుల అంచనాలు అందుకుందా? ఇంతకీ ఏమిటీ పుష్ప రాజ్ కథ ? 


కథ:


పుష్ప రాజ్ (అల్లు అర్జున్) ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న ఓ గ్రూపులో డైలీ కూలీ. పుష్ప కి భయం వుండదు. ఎవరికీ లొంగడు. పుష్ప ని ఇంటి పేరుతో పిలిస్తే నచ్చదు. కారణం పుష్ప.. సవతి కొడుకు బిడ్డ. మొదటి తల్లి పిల్లలు పుష్పని అవమానిస్తుంటారు. ఎప్పటికైనా పవర్ ఫుల్ గా ఎదగాలనేది పుష్ప లక్ష్యం. డైలీ కూలీ నుంచి రెడ్డి బ్రదర్స్ గ్రూప్ కి ఒక పార్టనర్ అవుతాడు పుష్ప. ఈ క్రమంలో మంగళం శ్రీను ( సునీల్) నుంచి పెద్ద ముప్పు పొంచివుంటుంది, ఏమిటా ప్రమాదం ? భన్వర్ సింగ్ షెకావత్ (ఫహద్ ఫాసిల్) ఎవరు ? శ్రీవల్లి (రష్మిక)తో పుష్ప రాజ్ ప్రేమ కథ ఏమిటి ? అడ్డంకులన్నీ దాటుకొని పుష్ప ఎలా ఎదిగాడు అనేది మిగిలిన కథ.


విశ్లేషణ:


అల్లు అర్జున్ స్టయిలీస్ స్టార్. సుకుమార్ క్రియేటివ్ డైరెక్టర్. ఆలాంటి ఇద్దరు పుష్ప లాంటి ఓ రా కథని తీసుకున్నారు. తమని తాము కొత్తగా ప్రజంట్ చేయాలని అనుకున్నారు. ఆ ప్రయత్నం చాలా వరకు సఫలం అయ్యింది. అల్లు అర్జున్ తన స్టయిల్ ని పక్కన పెట్టి   నటనకు ప్రాధాన్యత వుండే పాత్ర చేస్తే ఎలా వుంటుందో.. సుకుమార్ తన ట్రిక్కి స్క్రీన్ ప్లేయ్, లాజిక్స్ మ్యాజిక్స్  పక్కన పెట్టి ఒక మాస్ సినిమాని తీస్తే ఎలా వుంటుందో.. పుష్ప అలా వుంటుంది. అయితే బన్నీ నుంచి స్టయిల్ ని,..  సుకుమార్ నుంచి మ్యాజిక్ ఆశించి థియేటర్ లో అడుగుపెడితే మాత్రం కొంచెం నిరాశ తప్పదు.


సినిమా ఆరంభం నుంచి ఫ్లాట్ నేరేషన్ లో సాగుతుంది పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపధ్యం, పుష్ప రాజ్ పాత్ర పరిచయం ఇవన్నీ ఆసక్తికరంగా వుంటాయి. అయితే కథలోకి వచ్చేసరికి అంత కొత్తదనం ఏమీ కనిపించదు. సింపుల్ కథ ఇది. ఒక గ్యాంగ్ స్టార్ డ్రామా. ఒక మామూలు కూలీ..  డాన్ గా ఎదిగే క్రమాన్ని చూపిస్తుంది పుష్ప. అయితే అడవి, ఎర్రచందనం నేపధ్యం కావడంతో కొంత కొత్తదనం వచ్చింది. అల్లు అర్జున్ ని పుష్ప రాజ్ పాత్రలో చూడటం నిజంగా కొత్త అనుభూతి. పుష్ప పాత్రని చాలా అద్భుతంగా డిజైన్ చేశాడు సుకుమార్. అయితే ఇదే సమయంలో మిగతా పాత్రల గురించి అంత కేర్ తీసుకున్నట్లు కనిపించదు. తెరపై చాలా పాత్రలు కనిపిస్తాయి కానీ పెద్దగా రిజిస్టర్ అవ్వవు. 


ఒక కూలీ డాన్ ఎదిగే క్రమంలో వచ్చే అడ్డంకులు.. పుష్ప ఈజీగా దాటుకుంటూ వెళ్ళిపోతుంటాడు. దీంతో తర్వాత ఏమౌతుందన్న ఆసక్తి  కనిపించదు. దాక్కో మేక, చూపే బంగారం, ఊ అంటావా పాటలు ఫస్ట్ హాఫ్ లోనే వచ్చేస్తాయి. మొదటి సగంతో పోల్చుకుంటే రెండో సగం సాగాదీతగా అనిపిస్తుంది. శ్రీవల్లితో ప్రేమ, సవతి సోదరుల ఎపిసోడ్స్ లాగ్  అనిపిస్తాయి. రెండో పార్ట్ కి షిప్ట్ చేసే ఆలోచన కారణంగా బహుశా రెండో సగాన్ని కొంచెం సాగాదీతగానే మలిచారు. ఫాహాద్ పాజిల్ పాత్రని రెండో పార్ట్  కోసం వాడుకునే ఆలోచనతో ప్రవేశ పెట్టారనే సంగతి ఈజీగా అర్ధమైపోతుంది. అయితే బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు ? అనే ఆసక్తిని సెకెండ్ పార్ట్ పై రేపినట్లు .. పుష్ప సెకండ్ హాఫ్ పై ఆసక్తి కలిగించే మలుపు పుష్ప పార్ట్ వన్ లో ఇవ్వలేకపోయారు.


నటీనటులు:


అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో పుష్ప. తన కెరీర్ లో ఎన్నడూ లేనంత హార్డ్ వర్క్ ..పుష్ప కోసం చేశాడు  బన్నీ. ఈ సంగతి తెరపై బన్నీని చూస్తుంటే అర్ధమౌతుంది. ఇలాంటి స్టోరీలు తమిళ హీరోలు చేస్తుంటారు. కానీ తెలుగు హీరోలు కూడా ఇలాంటి రా రస్టిక్ పాత్రలు చేస్తారని పుష్పతో నిరూపించడం బన్నీ. పుప్ప నిలబడే విధానం, మాట్లాడే తీరు, ప్రతి కలలిక .. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ చేస్తుంది. యాక్షన్ లో అయితే అదరగొట్టాడు. అయితే అల్లు అర్జున్ ని స్టయిలీస్ గా కోరుకునే ఫ్యాన్స్ మాత్రం బన్నీని అంత సేపు అలాంటి గెటప్ చూడడానికి కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి కూడా వుంది. ఎలా వున్న .. అల్లు అర్జున్ ని నటుడిని మరో స్థాయిలో ఆవిష్కరించిన సినిమా పుష్ప.


శ్రీ వల్లి పాత్ర చేసిన రష్మిక కూడా కొత్తగా కనిపిస్తుంది. ఆమె పాత్రలో ఫన్ వుంటుంది. నా సామీ పాటలో రష్మిక డ్యాన్స్ ఆకట్టుకుంటుంది. అయితే శ్రీవల్లి పాత్రని ఇంకా ఆసక్తికరంగా డిజైన్ చేసే అవకాశం వున్నా .. సుకుమార్ కేవలం బన్నీ పైనే ఫోకస్ చేసినట్లు కనిపిస్తుంది. సునీల్ పాత్ర అంత బలంగా వుండదు. ఇది కూడా ఒక మైనస్. దక్షాయనిగా ఆనుసుయా .. మూడు సీన్లకే పరిమితమైయింది. మిగతా పాత్రలు వుంటాయి కానీ అవేం ప్రభావవంతంగా వుండవు. 


టెక్నికల్ గా:


నిర్మాణ పరంగా సినిమా ఉన్నంతగా వుంది. దేవిశ్రీ పాటలన్నీ ఆకట్టుకుంటాయి. అయితే ఐటెం సాంగ్ మాత్రం సుకుమార్, దేవి మార్క్ లో వుండదు. అది కొంత నిరాశ. పాటలతో పాటు అద్భుతమైన నేపధ్య సంగీతం సమకూర్చాడు దేవిశ్రీ. కెమరా పనితనం ఉన్నతంగా వుంది. అడవి, ఎర్రచందనం నేపధ్యం కావడంతో తెరపైకి ఒక ఫ్రెష్ ఫీలింగ్ కనిపిస్తుంది. డైలాగులు కొన్ని బావున్నాయి. చిత్తూరు యాస అందరినోట్లు బాగా పలిగింది. యాక్షన్ సన్నీవేషాలు కొత్తగా డిజైన్ చేశారు, ఎడిటింగ్ కొంచెం షార్ఫ్ గా ఉండాల్సింది, ముఖ్యంగా సెకెండ్ హాఫ్ లో. నిర్మాతలు ఎక్కడా రాజీ పడలేదు. 


ప్లస్ పాయింట్స్


అల్లు అర్జున్ యాక్షన్ 
ఎర్రచందనం నేపధ్యం 
యాక్షన్ సీన్లు , పాటలు 


మైనస్ పాయింట్స్


సాదాసీదా స్క్రీన్ ప్లేయ్ 
సుకుమార్ మార్క్ మ్యాజిక్స్ లేకపోవడం 
సాగాదీత సాగిన సెకెండ్ హాఫ్ 
కథలో మలపులు లేకపోవడం 


ఫైనల్ వర్దిక్ట్ : పుష్ప.. ఫైరు తగ్గింది


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS