'రాజా విక్రమార్క' మూవీ రివ్యూ & రేటింగ్!

మరిన్ని వార్తలు

నటీనటులు: కార్తికేయ, తాన్యా రవిచంద్రన్,  తనికెళ్ళ భరణి తదితరులు
దర్శకత్వం : శ్రీ సారిపల్లి
నిర్మాత: ’88’ రామారెడ్డి
సంగీత దర్శకుడు: ప్రశాంత్ ఆర్. విహారి
ఎడిటింగ్: జస్విన్ ప్రభు


రేటింగ్: 2.5/5


'ఆర్ఎక్స్ 100' కార్తికేయకి సూపర్ హిట్ ఇచ్చింది. అదే సమయంలో డైలామాలో పడేసింది. 'ఆర్ఎక్స్ 100' తర్వాత తనకు ఎలాంటి ఇమేజ్ వచ్చిందో సరైన అంచనాకి రాలేకపోతున్నాడు కార్తికేయ. హిప్పీ, 90ఎంఎల్, చావుకబురు చల్లగా .. ఈ మూడు సినిమాలు నిరాశ పరిచాయి. అయితే ఇమేజ్ అంచనాలు లేకుండా కేవలం కథని నమ్మి 'రాజా విక్రమార్క' చేశానని చెప్పాడు కార్తికేయ. మరి అంతలా నమ్మిన 'రాజా విక్రమార్క' కధ ఏంటి ? ఈ సినిమా కార్తికేయకి ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందో తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్ళాల్సిందే.


కథ:

 

విక్రమ్ (కార్తికేయ) ఎన్ ఐ ఎ ఏజెంట్. హోం మంత్రి సుకుమార్ ( సాయి కుమార్ ) కి ఓ ప్రమాదం పొంచి వుంటుంది. హోం మంత్రిని కాపాడే మిషన్ లోకి  వస్తాడు విక్రమ్. ఇదే క్రమంలో హోమ్ మంత్రి కూతురు కాంతి (తాన్య రవిచంద్రన్)ని ప్రేమిస్తాడు. మరి కాంతి, విక్రమ్ ని ప్రేమించిందా ? అసలు హోమ్ మంత్రికి ఎవరి వల్ల ముప్పు వుంది ? ఈ మిషన్ లో విక్రమ్ కి ఎలాంటి అనుభవాలు ఎదురైయ్యాయనేది మిగిలిన కథ.  


విశ్లేషణ: 


స్పై థ్రిల్లర్స్ హాలీవుడ్ లో పాపులర్ జానర్. నెలకో స్పై థ్రిల్లర్ వస్తుంటుంది అక్కడ. ఈ సినిమా ప్రమోషన్స్ లోనే 'మిషన్ ఇంపాజిబుల్' స్పూర్తితో రాజ 
రాజా విక్రమార్క తీశానని చెప్పాడు దర్శకుడు. స్ఫూర్తి వరకూ ఓకే. కానీ ఆ స్ఫూర్తిని తెరపై చూపించడంలో రాజా విక్రమార్క్ వెనకబడింది. యాక్షన్, కామెడీ, థ్రిల్ .. మిక్స్ చేసి రాజా విక్రమార్క్ ని కథ రాసుకున్నాడు దర్శకుడు. అయితే వాటిని బ్యాలెన్స్ చేసి తెరపైకి తీసుకురావడంలో తడబడ్డాడు. సీరియస్ డ్రామాలో కామెడీ మిక్స్ చేయడం ఒక ఆర్ట్. అది వర్క్ అవుట్ అయితే భలే పేలుతుంది. కానీ మిస్ ఫైర్ ఐతే మాత్రం మొత్తం ప్రయత్నమే సిల్లీ అనిపిస్తుంది. రాజా విక్రమార్క్ కి కూడా ఇలాంటి ఇదే సమస్య వచ్చింది. 


ఒక సీరియస్ కథని హ్యుమరస్ గా ప్రజెంట్ చేయాలని భావించాడు దర్శకుడు. సినిమా ఆరంభం నుంచి అదే ప్రయత్నం కనిపించింది. అయితే హ్యుమర్ పండటం అంత ఈజీ కాదు. రైటింగ్ టేబుల్ దగ్గర చాలా కసరత్తు చేయాలి. రాజా విక్రమార్క లో హ్యుమర్ కాస్త సిల్లీగా అనిపిస్తుంది. కామెడీని ఇరికించినట్లు,యాక్షన్ ని అతికించినట్లుగా సాగుతుంది. ఇంటర్వెల్ వరకూ అసలు కధ ముందుకు జరగదు. పోనీ హీరో హీరోయిన్ మధ్య నడిచే లవ్ ట్రాక్ కొత్తగా డిజైన్ చేసినా కొంత ఫ్రెష్ నెస్ వుండేది. కానీ ఆ లవ్ ట్రాక్ కూడా ఇది వరకు సినిమాల్లో చూసినదే కావడంతో ఆవలింతలు తెచ్చుకోవడం ప్రేక్షకుడి వంతు. 


ఇంటర్వెల్ బాంగ్ లో వచ్చిన మలపు సెకండ్ హాఫ్ పై ఆసక్తిని పెంచుతుంది. అయితే ఆ ఆసక్తిని కొనసాగించడంలో కూడా దర్శకుడు విఫలమయ్యాడు. ద్వితీయార్ధంలో వచ్చే రెస్క్యూ మిషన్ ఏమంత ఆసక్తిగా వుండదు. మధ్యలో వచ్చిన ఒక ట్విస్ట్ సీన్ని ఎలివేట్ చేసిందే కానీ కధకి బలం చేకూర్చలేదు. చివరికి క్లైమాక్స్ కూడా ప్రేక్షకుడి ఊహకు అందిపోతుంది. వెరసి ప్రేక్షకుడు నీరసంగా సీట్ నుంచి లేవాల్సిన పరిస్థితి.


నటీనటులు :


కార్తికేయ చూడ్డానికి బావున్నాడు. ఎన్ఐఎ ఏజెంట్ రోల్ షూట్ అయ్యాడు. అయితే ఈ కథని కామెడీ టచ్ లో రాసుకున్నాడు దర్శకుడు. యాక్షన్ చేసినంత ఈజీ కాదు హ్యుమర్ పండించడం. కార్తికేయ కామెడీ టైమింగ్ పెద్దగా కుదరలేదు. ఈ విషయంలో ఇంకా మెరుగుపడాలి. తాన్య రవిచంద్రన్  అందంగా కనిపించింది. కానీ నటన పరంగా ఇంకా మెరుగుపడాలి. తనికెళ్ల భరణి తన అనుభవంతో అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశారు. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ ఫేం సుధాకర్ కి మంచి కీలకమైన పాత్ర దక్కింది. అయితే ఈ పాత్రని ఇంకా సమర్దవంతగా చేసే అవకాశం వుంది. సాయి కుమార్, పశుపతి, హర్షవర్ధన్ పాత్రలు ఓకే.  


సాంకేతికంగా :


టెక్నికల్ గా సినిమాకి వంకపెట్టలేం.  కెమరాపనితనం బావుంది. మంచి ఆర్ఆర్ కుదిరింది. ఎడిటర్ ఇంకాస్త పొదుపుగా వుండాల్సింది. నిర్మాణంలో రాజీపడలేదు.  


ప్లస్ పాయింట్స్


కార్తికేయ 
కొన్ని యాక్షన్ సీన్లు 
అక్కడక్కడ హ్యుమర్ 
 

మైనస్ పాయింట్స్ 


బలహీనమైన కథ
బోరింగ్ స్క్రీన్ ప్లే  


ఫైనల్ వర్దిక్ట్ : థ్రిల్ లేదు రాజా..


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS