జైలర్ మూవీ రివ్యూ & రేటింగ్

మరిన్ని వార్తలు

చిత్రం: జైలర్

నటీనటులు: రజనీకాంత్, మోహన్ లాల్, జాకీ ష్రాఫ్, శివ రాజ్ కుమార్, సునీల్, రమ్య కృష్ణన్, వినాయకన్, మీర్నా మీనన్, తమన్నా

దర్శకత్వం: నెల్సన్ దిలీప్ కుమార్
 

నిర్మాత: సన్ పిక్చర్స్, కళానిధి మారన్
సంగీతం: అనిరుధ్ రవిచందర్
ఛాయాగ్రహణం: విజయ్ కార్తీక్ కన్నన్ 
కూర్పు: ఆర్ నిర్మల్
 

బ్యానర్స్: సన్ పిక్చర్స్
విడుదల తేదీ: 10 ఆగష్టు 2023


ఐక్లిక్ మూవీస్ రేటింగ్‌: 2.75/5

రజనీకాంత్‌ అందరినీ ఆకర్షించే మాగ్నైట్. అందుకే ఆయన సినిమా వస్తుందంటే అందరూ ఎలర్ట్ అయిపోతారు. తన కెరీర్ లో ఎక్కువ శాతం సీనియర్ దర్శకులతో పని చేసిన రజనీ ఈసారి మూడు సినిమాలు అనుభవం వున్న నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ తో చేతులు కలిపి 'జైలర్' చేశారు. డార్క్ కామెడీలు తీయడంలో నెల్సన్ దిట్ట. రజనీకి ఈ జోనర్ కాస్త కొత్తే. మరి ఈ ఇద్దరి కాంబినేషన్ వెండితెరపై ఎలాంటి వినోదాల్ని పంచిందో చూద్దాం.


కథ: ముత్తు అలియాస్ ముత్తువేల్ పాండ్యన్ (ర‌జ‌నీకాంత్‌) ఓ రిటైర్డ్ జైలర్. త‌న భార్య (ర‌మ్యకృష్ణ),  ఏసీపీగా ప‌నిచేస్తున్న త‌న‌యుడు అర్జున్‌(వసంత రవి), మ‌న‌వ‌డు తో హ్యాపీగా గడిపేస్తుంటాడు. ఇదీలావుండగా విగ్రహాల దొంగ‌త‌నం ముఠా నాయ‌కుడైన వ‌ర్మ (వినాయ‌క‌న్‌) తన దారి అడ్డు వస్తున్నాడని ముత్తు కొడుకు అర్జున్ ని మాయం చేస్తాడు. అర్జున్ కి కోసం వెదుకుతున్న ముత్తుకి ఇక తను లేడని తెలుస్తుంది. దీంతో ముత్తు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు ? అసలు ముత్తుని టైగర్ ని ఎందుకు పిలుస్తారు ? తన గతం ఏమిటి ? వర్మ ముఠాని ముత్తు ఎలా అంతం చేశాడనేది మిగతా కథ.


ఇదొక రివెంజ్ స్టొరీ. ఐతే దీనిని దర్శకుడు మలచిన విధానం మాత్రం కొత్తగా వుంటుంది. ర‌జ‌నీకాంత్ మార్క్ మాస్ స్టైల్‌, హీరోయిజంని చాలా సహజంగా వాడుకుంటూ ఈ కథని రాసుకున్నాడు దర్శకుడు. ఓ మాఫియా ముఠా ప‌రిచ‌యంతో కథ   ఆరంభ‌మ‌వుతుంది. ఒకొక్క పాత్రని పరిచయం చేస్తూ మెల్లగా కథలోకి వెళ్ళాడు. దిని కోసం కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నా తర్వాత వచ్చే సన్నివేశాలకు దాన్ని  పునాదులుగా మలచుకున్నాడు. అర్జున్ మాయమైన తర్వాత కథలో సీరియస్ నెస్ వస్తుంది. దాన్ని మరీ మెలోడ్రామాలా కాకుండా వెంటనే డార్క్ కామెడీ కి మార్చాడు. ఈ క్రమంలో ర‌జ‌నీకాంత్ - యోగిబాబుల మ‌ధ్య కామెడీ ట్రాక్ న‌వ్విస్తుంది. వర్మ నుంచి పొంచిన ఆపద కథలో కీలకంగా మారుతుంది.  వర్మ నుంచి కుటుంబాన్ని కాపాడుకునేందుకు చేసే ప్ర‌య‌త్నాలు చాలా ఆసక్తికరంగా చిత్రీకరించారు.  ఇంటర్వెల్ సీక్వెన్స్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా వుంటుంది.


ఐతే సెకండాఫ్‌ లో ఈ కథ సైడ్ ట్రాక్ పట్టేస్తుంది. కిరీటం తీసుకొచ్చే స‌న్నివేశాలు కథలో సీరియస్ నెస్ ని తగ్గించేశాయి. ఇక్కడే హీరోయిజం వీక్ అయిపొయింది. సునీల్ తమన్నా ల ట్రాక్ కూడా పండలేదు. అర్జున్  పాత్రలో ఇచ్చిన ట్విస్ట్ కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు.  అయితే ప్రీ క్లైమాక్స్‌కి ముందు వ‌చ్చే సీన్స్ కాస్త ఆసక్తిని పెంచాయి. శివరాజ్‌కుమార్‌, మోహ‌న్‌లాల్‌, జాకీష్రాఫ్‌ల అతిథి పాత్రలు సినిమా బోనస్.  నిజానికి చాలా మంచి పాయింట్ ని ఎత్తుకున్నాడు దర్శకుడు. కానీ దానికి సెకండ్ హాఫ్ లో న్యాయం చేయలేకపోయాడు.


నటీనటులు: ఇది రజనీ వన్ మ్యాన్ షో. వింటేజ్ రజనీ చాలా చోట్ల కనిపిస్తారు. వయసుకు ఇమేజ్ కి తగ్గట్టు చేసిన పాత్ర ఇది. రమ్యకృష్ణ హుందాగా కనిపించింది. మిర్నా, వసంత రవి ఓకే అనిపిస్తారు. యోగి బాబు ఒక మేజర్ హైలెట్. ఆయన ట్రాక్ నవ్విస్తుంది. విలన్ గా చేసిన వినాయకన్ ఆకట్టుకున్నాడు. సునీల్ పాత్రఅంతగా పండలేదు. తమన్నా ఒక పాటకి పరిమితమైయింది.ఆ పాట కలర్ ఫుల్ గా వుంది.  శివరాజ్‌కుమార్‌, మోహ‌న్‌లాల్‌ ప్రజన్స్ మరింత ఎనర్జీని నింపింది. మిగతా పాత్రలు పరిధిమేర వున్నాయి.


టెక్నికల్: అనిరుద్ మ్యూజిక్ కి ఫుల్ మార్కులు పడతాయి. నేపధ్య సంగీతం నెక్స్ట్ లెవల్ లో చేశాడు. కెమరాపనితనం. ఎడిటింగ్, నిర్మాణ విలువలు డీసెంట్ గా వున్నాయి. దర్శకుడు నెల్సన్ డార్క్ కామెడీ బాగానే  పట్టుకున్నాడు. ఐతే ఆ పట్టు సెకండ్ హాఫ్ లో జారింది.


ప్లస్ పాయింట్స్ :

రజనీకాంత్ 
ఫస్ట్ హాఫ్ 
యాక్షన్ 


మైనస్ పాయింట్స్ :

సెకండ్ హాఫ్ 
రొటీన్ క్లైమాక్స్ 


ఫైనల్ వర్దిక్ట్: ఫస్ట్ హాఫ్ బావుంది రాజా....


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS