రెండు రెళ్లు ఆరు తెలుగు మూవీ రివ్యూ & రేటింగ్స్

మరిన్ని వార్తలు

తారాగణం: అనిల్, మహిమ, నరేష్, రవికాలే, తాగుబోతు రమేష్
సంగీతం: విజయ్
ఎడిటర్: పీ జానకి రామ రావు
ఛాయాగ్రహణం: బీ వీ అమరనాథ్ రెడ్డి
సమర్పకులు: సాయి కొర్రపాటి
నిర్మాతలు: ప్రదీప్ చంద్రన్, మోహన్
దర్శకత్వం: నందు మల్లెల

యావరేజ్ యూజర్ రేటింగ్:3/5 

న‌వ‌త‌రం ద‌ర్శ‌కులు ఎక్కువ‌గా ప్రేమ క‌థా చిత్రాల‌తో త‌మ ప్ర‌యాణం ప్రారంభిస్తుంటారు.  అయితే ఎక్కువ మంది....  రొటీన్ ప్రేమ క‌థ‌ని... కాస్త కొత్త‌గా చూపించే ప్ర‌య‌త్నం చేస్తుంటారు. ఆ తూకంలో తేడా వ‌స్తే.. 'రొటీన్ సినిమా చూశాం' అన్న ఫీలింగ్ క‌లుగుతుంది ప్రేక్ష‌కుల‌కు. అదే... క‌థ‌లోనే కాస్త వైవిధ్యం చూపించే ప్ర‌య‌త్నం చేస్తే... కొత్త సినిమా చూశామ‌న్న తృప్తి మిగులుతుంది. 'రెండు రెళ్లు ఆరు'తో తెరంగేట్రం చేసిన నందు మ‌ల్లెల కూడా కొత్త ద‌ర్శ‌కుడే. మ‌రి ఇది కొత్త క‌థా?  లేదంటే... పాత క‌థ‌నికొత్త‌గా చెప్పే ప్ర‌య‌త్నం చేశాడా? 'రెండు రెళ్లు ఆరు' టైటిల్‌కి న్యాయం జ‌రిగిందా, లేదా??   తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.  

*  క‌థ‌...

రాజు (న‌రేష్‌) రావు (ర‌వికాలే)లవి  ఎదురుబ‌దురు ఇళ్లులు.  ఇద్ద‌రూ ఒకేసారి నాన్న‌ల‌వుతారు. రాజు భార్య‌ మాడీ (అనిల్ ) కి జ‌న్మ నిస్తే... రావు భార్య కి మాగీ (మ‌హిమ‌)  పుడుతుంది. అయితే అనుకోని ప‌రిస్థితుల్లో అమ్మ‌ల‌కు తెలియ‌కుండా.. పిల్ల‌ల్ని మార్చేస్తారు. రాజు త‌న బిడ్డ మాడీని రావుకి ఇచ్చేస్తాడు.  రావు త‌న‌కు పుట్టిన మాగీని రాజుకి ఇచ్చేస్తాడు.  మాగీ, మాడీ ఇద్ద‌రూ పెరిగి పెద్ద‌వాళ్ల‌వుతారు. ఇద్ద‌రికీ ఒక్క క్ష‌ణం కూడా ప‌డ‌దు. కొట్టు కొంటూ, తిట్టుకొంటూ.. ఇంట్లో వాళ్ల‌కు త‌ల‌నొప్పి తెప్పిస్తుంటారు. అయితే.. అనూహ్య‌మైన రీతిలో మాడీ, మాగీ ప్రేమించుకొంటారు. వీళ్ల ప్రేమ‌కు త‌ల్లులిద్ద‌రూ ఒకే చెప్పినా, తండ్రులు మాత్రం తిర‌స్క‌రిస్తారు.   ఇద్ద‌రి ప్రేమ‌ని తండ్రులు ఎందుకు ఒప్పుకోలేదు?  అస‌లు బిడ్డ‌ల్ని మార్చుకోవాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింది?    మాగీ, మాడీలు ఎలా క‌లిశార‌న్న‌దే 'రెండు రెళ్లు ఆరు' క‌థ‌.

* న‌టీన‌టులు ఎలా చేశారు?

న‌రేష్‌, ర‌వికాలే, తాగుబోతు ర‌మేష్ మిన‌హాయిస్తే అంతా కొత్త వాళ్లే. ముఖ్యంగా హీరో హీరోయిన్ల‌కు ఇదే తొలి సినిమా.  అనిల్ తేలిపోయాడు. త‌న న‌ట‌న‌, డైలాగ్ డెలివ‌రీ కృత్రిమంగా అనిపిస్తాయి. హీరో ఈ సినిమాకి మైన‌స్ అనే చెప్పాలి. మ‌హిమ ఓకే.  మ‌రీ అంత అందంగా కాక‌పోయినా.... ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించింది. త‌న న‌ట‌న కూడా స‌హ‌జంగా ఉంది. న‌రేష్‌కి మ‌రోసారి మంచి పాత్ర ద‌క్కింది. ర‌వికాలే.. కి ఈ త‌ర‌హా పాత్ర దొర‌క‌డం కొత్త‌గా అనిపిస్తుంది. సౌమిత్రిగా తాగుబోతు ర‌మేష్ న‌వ్విస్తాడు.

* విశ్లేష‌ణ‌... 

ద‌ర్శ‌కుడు నందు రాసుకొన్న క‌థ‌లో కొత్త‌ద‌నం క‌నిపించింది. ఇలాంటి క‌థ‌ని ఎలా తీసినా.. బాగానే ఉంటుంది. వీలైనంత వ‌ర‌కూ తాను క‌న్‌ఫ్యూజ్ అవ్వ‌కుండా.. ప్రేక్ష‌కుల్ని క‌న్‌ఫ్యూజ్‌కి గురికాకుండా క‌థ‌నాన్ని న‌డిపించాడు. ఓ ఇంట్ర‌స్టింగ్ పాయింట్ తో సినిమా మొద‌ల‌వుతుంది. ఆ త‌ర‌వాత స‌ర‌దా స‌ర‌దా స‌న్నివేశాల‌తో క‌థ హాయిగా సాగిపోతుంది. మ‌ధ్య‌లో న‌డిపిన రెండు లవ్ ట్రాక్‌లూ ఆక‌ట్టుకొన్నాయి. సీరియ‌ల్ హీరోని హీరోయిన్ ప్రేమించ‌డం, దాన్ని హీరో చెడ‌గొట్ట‌డం... తాను వెంట ప‌డిన అమ్మాయితో హీరో రాఖీ క‌ట్టించుకోవ‌డం.. ఈ సన్నివేశాలు బాగా పండాయి. ప‌ల్లెటూరి నేప‌థ్యంలో సాగిన సన్నివేశాలు కూడా ఓకే అనిపిస్తాయి. గిల్లిక‌జ్జాలు ఆడుకొనే ఓ అమ్మాయి, అబ్బాయి ప్రేమ‌లో ప‌డే విధానం ఆకట్టుకొనేలా తీశాడు ద‌ర్శ‌కుడు. ప‌తాక సన్నివేశాలు భారంగా సాగుతుంది. అక్క‌డ ఎమోష‌న్‌గా తీర్చిదిద్దాల్సిన అవ‌స‌రం వ‌చ్చింది. లేనిపోని స‌న్నివేశాల్ని ఇరికించ‌కుండా.. కేవ‌లం క‌థ‌ని మాత్రమే హైలెట్ చేస్తూ.. స‌న్నివేశాల్ని తీర్చిదిద్దిన విధానం ఆక‌ట్టుకొంటుంది. ప‌తాక సన్నివేశాలు హెవీగా అనిపిస్తాయి. పైగా.. క్లైమాక్స్ సుదీర్ఘంగా సాగిన ఫీలింగ్ క‌లుగుతుంది. 'గీతాంజ‌లి' త‌ర‌హా ముగింపు తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంత వ‌ర‌కూ న‌చ్చుతుందో చూడాలి.

సాంకేతికంగా చూస్తే..

సంగీతం బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌లో వినిపించే పాట‌లు ఆక‌ట్టుకొంటాయి. నేప‌థ్య సంగీతం కూడా హాయిగా ఉంది. ప‌ల్లెటూరి అందాల్ని ఫొటోగ్ర‌ఫీ బాగా చూపించింది. సంభాష‌ణ‌లు అక్క‌డ‌క్క‌డ ఆక‌ట్టుకొంటాయి. ద‌ర్శ‌కుడికి ఇదే తొలి సినిమా అయినా ఎక్క‌డా త‌డ‌బ‌డ‌కుండా తీయ‌గ‌లిగాడు.  క్లిష్ట‌మైన క‌థ‌ని.. సింపుల్‌గా చూపించాడు.

* ప్లస్ పాయింట్స్‌

+ కొత్త క‌థ‌
+ వినోదం
+ సంగీతం

* మైన‌స్ పాయింట్స్‌

- హీరో

* ఫైన‌ల్ వ‌ర్డిక్ట్: ఒక్క‌సారైనా చూడాల్సిందే 

రివ్యూ బై శ్రీ


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS