సామాన్యుడు మూవీ రివ్యూ & రేటింగ్

మరిన్ని వార్తలు

నటీనటులు: విశాల్, డింపుల్ హయతి, యోగిబాబు

దర్శకత్వం : తు ప శరవణన్

నిర్మాత: విశాల్

సంగీత దర్శకుడు: యువన్ శంకర్ రాజా

సినిమాటోగ్రఫీ: కెవిన్ రాజా

ఎడిటర్ : ఎన్ బి శ్రీకాంత్

 

 

రేటింగ్: 2.5/5

 

 

యాక్షన్ థ్రిల్లర్‌ సినిమాలు విశాల్ కి బాగా కలిసొచ్చాయి. విశాల్ కూడా అలాంటి సినిమాలు చేయడానికి మొగ్గు చూపుతున్నాడు. ఇప్పుడు విశాల్ నుంచి మరో యాక్షన్ థ్రిల్లర్ వచ్చింది. దీనికి క్రైమ్ కూడా తోడైయింది. 'సామాన్యుడు' టైటిల్ తో ఓ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విశాల్. ఈ సినిమా రివ్యూలోకి వెళితే..

 

 

కథ :

 

 

పోరస్ (విశాల్) ఓ మధ్యతరగతి కుర్రాడు. పోలీస్ ఆఫీసర్ కావాలనేది పోరస్ కల. మైథిలి (డింపుల్ హయాతి)తో ప్రేమలో ఉంటాడు. పోలీస్ ఆఫీసర్ కావాలనే కల, ఫ్యామిలీ, ప్రేమించిన అమ్మాయి మైథిలీ తప్పా మరో లోకం లేదు. ఇలా హాయిగా గడిచిపోతున్న పోరస్ జీవితంలో ఒక విషాదం. పోరస్ చెల్లెలు ద్వారక హత్యకు గురవుతుంది. ద్వారక హత్యకు కారణాలు వెతికే క్రమంలో పెద్ద రాజకీయం ఉచ్చు బయటపడుటుంది. ఆ హత్య వెనుక వున్న రాజకీయం ఏమిటి ? హంతకులను పోరస్ ఎలా పట్టుకున్నాడనేది మిగతా కథ.

 

 

విశ్లేషణ :

 

 

క్రైమ్ డ్రామా ఎప్పుడూ ఆసక్తికరమే. అయితే దాన్ని తెరపై చూపించే కిటుకు మీద సినిమా విజయం ఆధారపడివుంటుంది. ఒక హత్య జరుగుతుంది. ఆ హత్య చేసింది ఎవరు ? కారణం ఏమిటి ? హత్య వెనుక ఎవరున్నారు ? చివరికి ఎలా పట్టుపడ్డారు? ఏ క్రైమ్ డ్రామా తీసుకున్న ఈ లైనే వుంటుంది. అయితే ఈ లైన్ ని ఎంత కొత్తగా, గ్రిప్పింగా చూపించామనేది ఇక్కడ పాయింట్. విశాల్ సామాన్యుడులో కూడా అదే లైన్ వుంది. ఈ లైన్ ని కొంతవరకూ ఆసక్తిగానే మలిచారు.

 

 

సినిమా బిగినింగ్ కొత్త లాగ్ అనిపించినా వరుస హత్యలు జరిగిన తర్వాత కధలో వేగం వస్తుంది. మొదటి సగం అంతా హత్యలు వాటి నేపధ్యాలు చూపించుకుంటూ వెళ్ళిన దర్శకుడు రెండో సగంలో హత్యలు వెనుకున్న రాజకీయం చూపించే విధానం కూడా ఆకట్టుకుంటుంది. మొదటి సగంతో పోల్చుకుంటే రెండో సగంలో వేగం వుంటుంది. అయితే ఇలాంటి కధలకు మలపులు ప్రధానం. సామాన్యుడులో అంత చెప్పుకోదగ్గ మలపులు వుండవు. ఇక క్రైమ్ రివిల్ అయినపుడు కూడా అంత కొత్తదనం అనిపించదు. చివరి మలుపులు కనుక కొంచెం కొత్తగా ప్లాన్ చేసివుంటే సామాన్యుడు ఇంకాస్త ఆసక్తికరంగా వుండేది.  

 

నటీనటులు :

 

 

విశాల్‌ ఇలాంటి పాత్రలు కొత్తకాదు. ఈ పాత్రని చాలా ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. విశాల్ యాక్షన్ సీన్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇందులో కూడా సామాన్య యువకుడి పాత్రలో విశాల్ యాక్షన్ ఆకట్టుకుంటుంది. డింపుల్ హయాతి పాత్ర ఓకే. యోగిబాబు నవ్వించే ప్రయత్నం చేశాడు. చెల్లె పాత్రలో కనిపించిన రవీనారవి ఆకట్టుకుంటుంది.మిగతా పాత్రలు పరిధిమేర చేశాయి.  

 

 

 

 

టెక్నికల్ గా :

 

 

యువన్ శంకర్ రాజా నేపధ్య సంగీతం బావుంది. కెవిన్ కెమెరా పనితనం ఓకే. యాక్షన్ సీన్స్ బావున్నాయి. మొదటిసగంలో ఎడిటింగ్ కాస్త శార్ఫ్ గా వుండాల్సింది. నిర్మాణ విలువలు బావున్నాయి.

 

 

ప్లస్ పాయింట్స్

 

 

విశాల్ నటన

గ్రిప్పింగ్ కధనం

థ్రిల్లింగ్ గా సాగే సెకండ్ హాఫ్  

 

 

మైనస్ పాయింట్స్

 

 

ఫస్ట్ హాఫ్ లో కొంత లాగ్

కథలో కొత్త పాయింట్ లేకపోవడం

 

 

ఫైనల్ వర్దిక్ట్ : సామాన్యమైన కథే


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS