నటినటులు: మంచు మోహన్ బాబు,మీనా,శ్రీకాంత్,ప్రగ్యా జైశ్వాల్ తదితరులు
దర్శకుడు: డైమండ్ రత్నబాబు
నిర్మాత: మంచు విష్ణు
సంగీతం: ఇళయరాజ
ఎడిటింగ్: గౌతమ్ రాజు
సినిమాటోగ్రఫీ: సర్వేశ్ మురారి
రేటింగ్: 2/5
మోహన్ బాబు నుంచి సినిమా వచ్చి చాలా కాలమైయింది . ఆయన సోలోగా సినిమాలు చేయడం తగ్గించేశారు. సరైన కథలు ఆయనకి దగ్గరికి రాకపోవడం ఒక కారణం ఐతే .. మార్కెట్, ట్రెండ్ , క్రేజు .. మరికొన్ని కారణాలు. ఐతే డైమాండ్ రత్నబాబు .. ఇన్నాళ్లుకు ఆయన్ని మళ్ళీ తెరముందుకు తీసుకొచ్చాడు. 'సన్ అఫ్ ఇండియా' కథ మోహన్ బాబుకి నచ్చి మళ్ళీ తెరపై అలరించే ఉత్సాహం ఇచ్చింది. మరి మోహన్ బాబు అంతలా ఉత్సహపడిన 'సన్ అఫ్ ఇండియా' కథలోకి వెళితే..
కథ:
కడియం బాబ్జీ (మోహన్ బాబు ) ఎన్. ఐ. ఏ అధికారి ఐరా ( ప్రగ్యా జైస్వాల్ ) దగ్గర డ్రైవర్ గా పని చేస్తుంటాడు. కేంద్రమంత్రి మహేంద్ర భూపతి (శ్రీకాంత్ ) కిడ్నాప్ కి గురౌతాడు. తర్వాత వరుసగా మరో ముగ్గురి ప్రముఖ కిడ్నాపులు జరుగుతాయి. ఈ కేసుని ఛేదించడం కోసం ఐరా రంగంలోకి దిగుతుంది. కిడ్నాపులు వెనుక వున్న సూత్రధారి బాబ్జీ ని తెలుస్తుంది. అసలు బాబ్జీ ఎందుకు కిడ్నాపులు చేశాడు ? బాబ్జీ నేపధ్యం ఏమిటి ?అనేది మిగిలిన కథ
విశ్లేషణ:
అద్భుతాలు సృష్టించాలంటే ప్రయోగాలు చేయాలసిందే. కానీ ఒక ప్రయోగంతో ఫలితం ఉండదని తెలిసి కూడా ప్రయోగం చేయడం తెలివితక్కువ పని. 'సన్ అఫ్ ఇండియా' లో ప్రయోగం చేశామని చెప్పారు. ఏమిటా ఆ ప్రయోగం అంటే కేవలం మోహన్ బాబుని మాత్రమే చూపించి మిగతా నటీనటులని వాయిస్ లో, సజెషన్ లో , డూపులతో చిత్రీకరించారు. ఈ కథకి ఇలాంటి ప్రయోగం అనవసరం. బడ్జెట్ తగ్గించుకోవడానికి చేసిన ప్రయోగం తప్పితే కథకు అవసరమైన ప్రయోగం కాదని ప్రతి ఫ్రెములో ప్రేక్షకుడు ఫీలౌతుంటాడు.
కథ పోనీ కొత్తగా ఉందంటే అదీ కాదు. అరిగిపోయిన రివెంజ్ డ్రామా. ఖైదీలు, వాళ్ళ శిక్షలు అని ఎదో టాపిక్ ని తెరపైకి తెచ్చినా అది ఆల్రెడీ నాంది లాంటి సినిమాలో చుసిన లైన్ కావడంతో అసలు కొత్తదనం లేకపోగా విసుగు పుడుతుంది. ఆరంభంలో కథ ఆసక్తిగా సాగిన ముందుకు పోయేకొద్దీ సన్ అఫ్ ఇండియాలో విషయం లేదనే సంగతి స్పష్టమౌతుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ రక్తికట్టలేదు. మోహన్ బాబు పాత్ర తప్ప ఇందులో ఎలాంటి పాత్రలకు ప్రాధాన్యత లేకపోవడం కూడా సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని దెబ్బకొట్టింది. ఓటీటీ కోసం తీసిన సినిమా అని అనుకుందాం అనుకున్నా .. కేవలం మోహన్ బాబు కోసమే చూసే ఓటీటీ ఆడియన్స్ ఎంతమంది వుంటారో ఒకసారి లెక్క చూసుకోవలసింది. ఒక దశలో ఇంకచాలు వెళ్ళిపోదాం అనే ఫీలింగ్ కూడా కలిగించిన సినిమా ఇది.
మోహన్ బాబు నుంచి సినిమా వచ్చి చాలా కాలమైయింది . ఆయన సోలోగా సినిమాలు చేయడం తగ్గించేశారు. సరైన కథలు ఆయనకి దగ్గరికి రాకపోవడం ఒక కారణం ఐతే .. మార్కెట్, ట్రెండ్ , క్రేజు .. మరికొన్ని కారణాలు. ఐతే డైమాండ్ రత్నబాబు .. ఇన్నాళ్లుకు ఆయన్ని మళ్ళీ తెరముందుకు తీసుకొచ్చాడు. 'సన్ అఫ్ ఇండియా' కథ మోహన్ బాబుకి నచ్చి మళ్ళీ తెరపై అలరించే ఉత్సాహం ఇచ్చింది. మరి మోహన్ బాబు అంతలా ఉత్సహపడిన 'సన్ అఫ్ ఇండియా' కథలోకి వెళితే..
నటీనటులు:
మోహన్ బాబు వన్ మ్యాన్ షో ఇది. ఆయన తప్పా మరో నటుడు రిజిస్టర్ కాడు . మోహన్ బాబు నటన గురించి మళ్ళీ ఇప్పుడు కొత్త చెప్పాల్సిన పనిలేదు. ఆయన స్టయిల్ చేసుకుంటూ వెళ్లిపోయారు. శ్రీకాంత్ లాంటి సీనియర్ హీరోని తీసుకున్నప్పటికీ రెండు సీన్లుకి పరిమితం చేశారు. ప్రగ్యా తో పాటు పృద్వి , పోసాని, వెన్నల కిషోర్, అలీ .. అంతా గెస్ట్ అప్పీరియన్స్ లా కనిపిస్తారు తప్పితే కథలో వాళ్లకి భాగం లేదు. మిగతా నటులు గురించి చెప్పడానికి ఏమీ లేదు.
సాంకేతిగంగా:
ఇళయరాజా ఇచ్చిన బాణీలు ఇప్పటితరం వారికి ఎంతవరకూ కనెక్ట్ అవుతాయనేది ప్రశ్నార్ధకం. శ్లోకాలతో చేసిన ఓ పాట బావుంది. నేపధ్య సంగీతం ఓకే. ఎడిటర్ ఇంకాస్త సార్ఫ్ గా వుండాలసింది. కెమెరా పనితనం అంత గొప్పగా లేదు. బడ్జెట్ లోటు తెరపై కనిపిస్తుంటుంది.
ప్లస్ పాయింట్స్
మోహన్ బాబు
కొన్ని డైలాగ్స్
మైనస్ పాయింట్స్
బలహీనమైన కథ
బెడిసికొట్టిన ప్రయోగం
ఎమోషన్ లేకపోవడం
ఫైనల్ వర్దిక్ట్ : టైటిల్ లో వున్న సౌండ్ సినిమాలో లేదు