'తిమ్మరసు' మూవీ రివ్యూ & రేటింగ్!

మరిన్ని వార్తలు

 

నటీనటులు : సత్యదేవ్, ప్రియాంక జవాల్కర్, అజయ్ తదితరులు 
కథ: ఎం.జి. శ్రీనివాస్ 
దర్శకత్వం : శరన్ కొప్పిశెట్టి
నిర్మాత‌లు : మహేష్ కోనేరు, సృజన
సంగీతం : శ్రీ చరణ్ పాకాల
సినిమాటోగ్రఫర్ : అప్పు ప్రభాకర్
ఎడిటర్: బిక్కిన తమ్మిరాజు


రేటింగ్: 2.75/5


సత్యదేవ్ యంగ్ హీరోస్ లో మంచి నటుడు అనే గుర్తింపు తెచ్చుకున్నాడు. మంచికథలు, పాత్రలతో ప్రయాణం సాగిస్తున్నాడు. సత్యదేవ్ నుంచి ఒక సినిమా వస్తుందంటే విషయం కి ఉంటుందనే నమ్మకం కలిగించాడు. ఇప్పుడు 'తిమ్మరుసు' తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ట్రైలర్ ఆకట్టుకుంది. సెకెండ్ లాక్ డౌన్ తర్వాత థియేటర్ లో వచ్చిన మొదటి సినిమా కావడంతో థియేటర్ కి వెళ్లాలని ఆసక్తి చూపుతున్న ప్రేక్షకుల చూపు 'తిమ్మరుసు' పై పడుతుంది. మరి తిమ్మరుసు ఎలా వున్నాడు ? అసలు ఏమిటీ కథ ? 


కథ:


వాసు హోటల్ లో సర్వర్ గా పని చేస్తుంటాడు. ఓ హత్య జరుగుతుంది. ఈ హత్య కేసులో అమాయకుడైన వాసు ముద్దాయిగా ఎనిమిదేళ్ళ జైలు శిక్ష అనుభవిస్తాడు. ఈ కేసుని మళ్ళీ రిఓపెన్ చేస్తాడు లాయర్ రామ్ ( సత్యదేవ్). వాసులో కేసులో లోతుగా వెళుతున్న కొద్ది కొత్త విషయాలు బయటపడుతుంటాయి. ఈ క్రమంలో కేసుని వాదిస్తున్న లాయర్ రామ్ పై హత్య ప్రయత్నాలు కూడా జరుగుతాయి. మరి కేసులో నిజాలు ఏమిటి ? అసలు ముద్దాయిలు ఎవరు? వాసుని ఈ కేసులో ఎవరు ఇరికించారు ? లాయర్ రామ్ పై హత్య ప్రయత్నం చేసింది ఎవరు ? వాసు కేసులో ఇంకెన్ని షాకింగ్ ఎలిమెంట్స్ వున్నాయి ? తెలుసుకోవాలంటే 'తిమ్మరసు' సినిమా చూడాల్సిందే.


విశ్లేషణ:


లాయర్ పాత్రలో సత్యదేవ్. ఫస్ట్ లుక్, ట్రైలర్ లో చూపించిన కోర్టు సీన్స్.. ఇవన్నీ చూసి తిమ్మరుసు కోర్టు డ్రామా అనుకుంటారు. కానీ తిమ్మరుసు కోర్టు డ్రామా కంటే కోర్ట్ బయట నడిచిన డ్రామా. కధని చాలా ఎక్సయి టింగ్ మూడ్ ప్రారంభించాడు దర్శకుడు. ఒక అమాయకుడిని మర్డర్ కేసులో ఇరికించడం, దాని చుట్టూ అల్లుకున్న స్పస్పె న్స్ తో కైమాక్స్ వరకూ కూర్చోబెట్టె ప్రయత్నం చేశాడు దర్శకుడు. చిన్న చిన్న ట్విస్ట్ లతో క్లైమాక్స్ వరకూ తీసుకెళ్ళాడు. సినిమా నిడివి రెండు గంటలు మాత్రమే. పాటలు, రొమాంటిక్ ట్రాక్ జోలికి పోకుండ మంచి పని చేశారు. కధ చుట్టూనే సీన్స్ రాసుకోవడం బావుంది. ఈ విషయంలో దర్శక నిర్మాతలని అభినందించాలి. బాలీవుడ్ లో ఇలాంటి సినిమాలు వచ్చాయి. కేవలం ఒక కేసు చుట్టూ కధనం నడిపి సక్సెస్ కొట్టిన సినిమాలు వున్నాయి అక్కడ. తెలుగులో ఈ మధ్య కాలంలో 'నాంది' అనే సినిమా వచ్చింది. ఐతే ఇందులో కొంత లవ్ స్టొరీ పాటలు పెట్టే ప్రయత్నం జరిగింది. కానీ తిమ్మరుసులో కేవలం కేసు చుట్టే డ్రామా నడిపించారు. ఇక సినిమాకి బలం అనుకున్న క్లైమాక్స్ ట్విస్ట్ ని బాగానే ప్లాన్ చేశాడు. 


కాకపొతే తిమ్మరసులో కోఇన్సీడెంట్స్ ఎక్కవ. కేసులో నడిచే విధానం, హీరో దొరికే క్లూస్ అన్నీ కోఇన్సీడెంట్స్ గా రాసుకున్నారు. ఉదాహరణకు సత్యదేవ్ కేసు గురించి అలోచిస్తున్నప్పుడు వీధిలో పాత పేపర్లు అమ్మేవాడు వెళ్తుంటాడు. అది చూసి పాత పేపర్లు చూస్తే కేసుకు సంబధించిన ఏదైనా క్లూ దొరుకుతుందేమోనని హీరో ప్రయత్నించడం ,, ఇలా ప్రతిది ఎదో ఒక కోఇన్సీడెంట్ కి లింక్ చేసి వెళ్ళిపోవడం కొన్ని చోట్ల సీరియస్ ని దెబ్బ తీసింది. ఇంకొన్ని సీన్స్ లో సినిమా లిబరిటీ ఎక్కువ తీసుకున్నారేమో అనే భావన కూడా కలుగుతుంది. కధలో సీరియస్ నెస్, డ్రామా వుంది. కానీ ఎమోషన్ సరిగ్గా క్యారీ అవ్వలేదు. సస్పెన్స్ డ్రామాలని ఎత్తుకున్నపుడు రివిల్ చేసే ట్విస్ట్ బలంగా వుండాలి. తిమ్మరుసులో ట్విస్ట్ ని బాగానే రివిల్ చేసినా అది కధకు ఎలాంటి ఎమోషన్ యాడ్ చేయలేదు. ట్విస్ట్ కోసం క్లైమాక్స్ వరకూ కూర్చోబెట్టిన దర్శకుడు .. ఆ ట్విస్ట్ ని అంత బలంగా మలచడంలో మాత్రం తడబడ్డాడు. 


నటీనటులు:


బాగా నటించడం సత్యదేవ్ కి అలవాటైపోయింది. తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. లుక్ పరంగా కూడా జాగ్రత్తలు తీసుకున్నాడు. పాత్ర చాలా బలంగా వుంటుంది. సత్యదేవ్ హీరోయిజం జోలికి పోలేదు ఇప్పటివరకూ. కానీ ఈ పాత్రలోనే ఓ హీరోయిజం వుంది. ఆ హీరోయిజాన్ని ఎక్కడ అతి లేకుండా బాగానే ప్రదర్శించాడు. హీరోయిన్ చేసిన ప్రియాంక జవాల్కర్ కధకు ఎలాంటి ఆకర్షణ ఇవ్వలేదు. పైగా ఆమె లుక్ కూడా బాలేదు. కొన్ని చోట్ల మరీ ఎబ్బెట్టుగా కనిపించింది. 

 

కధలో కీలకమైన పాత్ర బ్రహ్మాజీది. అతని సినియరిటీ కధకు ప్లస్ అయ్యింది. బ్రహ్మాజీ పంచులు నవ్విస్తుంటాయి. ఈ కధకు రవి బాబు , అజయ్ ప్రధానమైన విలన్స్. వాళ్ళ నటనకి వంకపెట్టలేం. సునిశిత్ ఎపిసోడ్ అంతగా మెప్పించలేదు. 


సాంకేతిక వర్గం: 


దర్శకుడు కధని బాగా రాసుకున్నాడు. ట్విస్ట్ లు బావున్నాయి. కానీ ఎమోషన్ మిస్ అయ్యింది. కొన్ని చోట్ల లాజిక్స్ వుండవు. కొన్ని చోట్ల తనకి అనుకూలంగా సినిమాటిక్ గా రాసుకున్నట్లనిపిస్తుంది. పాటలు లేకుండా చేయడం మంచి పని. నేపధ్య సంగీతం, సినిమాటోగ్రఫి బాగా కుదిరాయి. 


ప్లస్ పాయింట్స్: 


సత్యదేవ్ నటన 
ట్విస్ట్ లు 
కొన్ని డైలాగ్స్ 

 

మైనస్ పాయింట్స్:

 

ఎమోషన్ పండకపోవడం 


చివరిగా .. 'తిమ్మరుసు' టైం పాస్ కి చూడొచ్చు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS