‘ఆచార్య’ సినిమాకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా ‘ఆచార్య’ ఐదో ఆటకు అనుమతి ఇచ్చింది. ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు అదనపు షో ప్రదర్శించుకునేలా థియేటర్ల యాజమాన్యాలకు అవకాశం కల్పించింది. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ రవి గుప్తా.. అన్ని జిల్లాల కలెక్టర్లు, లైసెన్స్ అథారిటీలు, పోలీసు కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు.
ఐదో ఆటతోపాటు టికెట్ ధరలు పెంచుకునేలా ప్రభుత్వం వెసులు బాటు కల్పించింది. ఒక్కో టికెట్‌పై మల్టీప్లెక్స్‌ల్లో రూ.50, సాధారణ ఏసీ థియేటర్లలో రూ. 30 పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగ ఆంధ్ర ప్రదేశం కు సంబధించిన వివరాలు ఇంకా తెలియాల్సివుంది. చిరంజీవి, చరణ్ కలిసి నటించిన ఈ సినిమాపై మెగా అభిమానుల్లో అంచనాలు భారీగా వున్నాయి. కొరటాల శివ హిట్ ట్రాక్ రికార్డ్ కూడా సినిమా పై అంచనాలు పెంచుతుంది. ఆర్ఆర్ఆర్ వచ్చిన నెల వ్యవధి లోనే చరణ్ నుంచి వస్తున్న మరో సినిమా కావడం కూడా మరో విశేషం.