ఆమీర్ ఖాన్ ఒక ప్రముఖ హీరోనే కాదు ఒక మంచి బాధ్యత గల పౌరుడు కూడా. దీనికి నిదర్శనమే ఆయన పలు రకాలుగా చేస్తున్న సామజిక సేవా కార్యక్రమాలు.
ఇక ఆయనలోని బాధ్యత గల పౌరుడు మరొకసారి బయటకి వచ్చాడు. గుజరాత్, అస్సాం రాష్ట్రాల్లో అకస్మాత్తుగా వచ్చిన వరదల కారణంగా జనజీవనం అస్తవ్యస్తం అయింది. చాలా స్థాయిలో ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్టు సమాచారం.
ఈ వరదల కారణంగా నష్టపోయిన వారిని ఆదుకోడానికి అందరు ముందుకి రండి అంటూ తన ట్విట్టర్ ద్వారా అందరికి పిలుపు ఇచ్చాడు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి అందరు తమ తమ వంతు విరాళాలు పంపించండి అని అందరికి విజ్ఞప్తి చేశాడు.