'ఆర‌డుగుల బుల్లెట్‌' మూవీ రివ్యూ & రేటింగ్!

మరిన్ని వార్తలు

నటీనటులు: గోపీచంద్, నయనతార, ప్రకాష్ రాజ్ తదితరులు
దర్శకుడు: బి. గోపాల్
నిర్మాతలు: తండ్ర రమేష్
సంగీత దర్శకుడు: మణిశర్మ
సినిమాటోగ్రఫీ: బాల మురుగన్
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర రావు


రేటింగ్: 2/5
 

ఆర‌డుగుల బుల్లెట్‌..  ఇప్పటి సినిమా కాదు. దశాబ్ధం కింద రావాల్సిన సినిమా. గోపీచంద్‌, నయనతార జంటగా  నటించారు బి.గోపాల్‌ దర్శకత్వం. సినిమా ఎప్పుడో మొదలైయింది. ఆర్ధిక, నిర్మాణ ఇలా అనేక చిక్కుల్లో పడి ఆగిపోయింది. అయితే ఎట్టకేలకు సినిమాకి మోక్షం దొరికింది. అన్నీ సమస్యలని దాటుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఇంతకాలం ల్యాబ్ లోనే వుండిపోయిన ఈ బుల్లెట్ ఫోర్స్ ఎలా వుందో తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్ళాల్సిందే 


కథ:


శివ (గోపీచంద్) ఆవారా. ముప్ఫై ఏళ్ల వయసు వచ్చినా బాధ్యత తెలుసుకోకుండా అల్లరి చిల్లరిగా తిరుగుతుంటాడు. తండ్రి మూర్తి (ప్రకాష్ రాజ్‌) ప్రభుత్వ ఉద్యోగి. శివకి బాధ్యత లేదని ఎప్పుడూ తిడుతుంటాడు. ఇలాంటి ఆవారా కుర్రాడు ప్రేమలో పడతాడు. న‌య‌న (న‌య‌న‌తార‌)ని తొలి చూపులోనే ప్రేమించేస్తాడు. త‌ను కూడా శివ ప్రేమ‌ని ఒప్పుకుంటుంది. కానీ... శివ తండ్రి మాత్రం 'సంపాదన లేని వాడికి  ప్రేమ ఎందుకు?' అని అవమానిస్తాడు. ఒకానొక సమయంలో ఇంటి నుండి బయటకు గెంటేస్తాడు. ఐతే శివ తండ్రికి  కాశీ (అభిమ‌న్యు సింగ్) అనే గుండా నుంచి ఓ ముఫ్ఫు వ‌చ్చి ప‌డుతుంది. అదేమిటి?  దాన్నుంచి త‌న తండ్రిని, కుటుంబాన్నీ శివ ఎలా కాపాడాడు?  అనేది తెరపై చూడాలి. 


విశ్లేషణ
 

ఐడియా అప్పడం ఒకటే. వేడిగా ఉన్నపుడే వాడేయాలి. లేదంటే ముతకైపోతాయి. ఆరడుగుల బుల్లెట్ కూడా ఇలాంటి ముతక వాసన కొట్టే సినిమా జాబితాలోకే వెళ్ళిపోతుంది. పదేళ్ళ క్రితం ఇలాంటి కధల కమర్షియల్ సినిమాలు కొన్ని వచ్చాయి. దాదాపు ఒకే ఫార్మెట్ లో సాగేవి. కానీ ఇప్పుడు పూర్తిగా ట్రెండ్ మారిపోయింది.

 

ఈ సినిమాలో చుస్తున్నాంత సేపు మనకి ఇష్టం లేని చొక్కా పాత పెట్టిలో పెట్టి అటకెక్కించేసి ఓ పదేళ్ళ తర్వాత దాన్ని చుసుకున్నపుడు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో ఈ బుల్లెట్ పరిస్థితి కూడా అదే. ముందుగా చెప్పినట్టు ఇది పాత సినిమా. ఈ పదేళ్ళలో కమర్షియల్ అంశాల పరంగా ఇండస్ట్రీలో కొన్ని మార్పులు వచ్చాయి. దీంతో 'ఆరడుగుల బుల్లెట్' రొటీన్  రొడ్ద కొట్టుడు సినిమా కంటే రోత సినిమాగా అనిపిస్తుంది. నిజానికి పదేళ్ళ క్రితం ఈ సినిమా వచ్చిన ఫ్లాఫ్ లిస్టు లోనే చేరేది. అంత రొటీన్ గా వుందీ సినిమా. 


కథ పరంగాం విశ్లేషించడానికి కూడా పెద్దగా ఏమీ దొరకదు. ఇందులో తండ్రీ కొడుకుల ఎమోష‌న్ కీల‌కం. కానీ దాన్ని చాలా సాదాసీదాగా రాసుకున్నారు. విలనిజం కూడా పండలేదు. కేవలం ఫైట్ సీన్స్ కోసం విలన్ అన్నట్టుగా ఆ పాత్ర చిత్రీకరణ వుంది. న‌య‌న‌తార మెరుపులు కూడా లేవు. అమెది ఏమాత్రం ప్రాధ్యాన్యత లేని పాత్ర.  బ్రహ్మానందం కామెడీ ట్రాక్ బోర్ కొడుతుంది. గోపాల్ సినిమాలు కమర్షియల్ హంగులకు పెట్టింది పేరు. కానీ ఆరడుగుల బుల్లెట్ లో మాత్రం ఆ హంగులు మరీ నాసిరకంగా వున్నాయి. మొత్తనికి సినిమా ఆరంభం నుంచి చివరి వరకూ ఏ దశలోనూ సినిమాపై ఆసక్తి పెంచలేకపోయింది. 


నటీనటులు:


పాత సినిమా కావడంతో గోపిచంద్ కాస్త యంగ్ గా కనిపించాడు. కానీ గోపి పాత్ర మాత్రం ఇప్పటి ట్రెండ్ కి అస్సల్ షూట్ కాలేదు. యాక్షన్ సీన్స్ బాగా చేశాడు. నయనతార ఓకే. కేవలం పాటలకు అన్నట్టుగానే వుంది. ప్రకాష్ రాజ్ పాత్ర రెగ్యులర్ గా సాగింది. అభిమన్యు సింగ్ ఓకే అనిపించాడు.   బ్రహ్మానందం ట్రాక్ పెద్దగా ఆకట్టుకోదు. 


సాంకేతిక వర్గం:


సినిమాటోగ్రఫీ ఓకే అనిపిస్తుంది. అయితే పాత సినిమా అని ప్రతి ఫ్రేములో అర్ధమౌతుంటుంది.  మణిశర్మ మ్యూజిక్ లో మెరుపులేమీ లేవు. నేపధ్య సంగీతం ఓకే. సీజీ వర్క్ సరిగ్గా కుదరలేదు. నిర్మాణ విలువలు సోసోగా వున్నాయి. 


ప్లస్ పాయింట్స్:


గోపిచంద్, నయనతార కొంచెం యంగా కనిపించడం 
కొన్ని యాక్షన్ సీన్స్ 


మైనస్ పాయింట్స్:


కథ , కథనం 
ఆకట్టుకొని కమర్షియల్ హంగులు 


ఫైనల్ వర్దిక్ట్ : ఫోర్స్ లేని బుల్లెట్!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS