ప్రతీ సినిమాకీ కథ చాలా అవసరం. కమర్షియల్ సినిమాల్లో కథ ఎలా ఉన్నా - హీరోయిజం ముఖ్యం. ఫ్యాన్‌కి కావల్సింది ఇచ్చేస్తే ఖుషీ అయిపోతారు. మరీ ముఖ్యంగా ఇంట్రడక్షన్ సీన్, ఇంట్రవెల్ బ్యాంగ్, క్లైమాక్స్.. ఇలా కొన్నింటిపై దృష్టి పెడితే కమర్షియల్ గా సక్సెస్ అయిపోవొచ్చు. చాలా సినిమాలకు ఇంట్రవెల్ బ్యాంగే.. ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇప్పుడు `ఆచార్య`కీ అలాంటి ఇంట్రవెల్ బ్యాంగ్ ప్లాన్ చేశాడట కొరటాల శివ. చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రం `ఆచార్య`. కాజల్ కథానాయిక.
రామ్ చరణ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. తనకు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. ఆచార్యలో ఇంట్రవెల్ బ్యాంగ్ పై చాలా ప్రత్యేకమైన దృష్టి పెట్టాడట కొరటాల. సరిగ్గా అప్పుడే... చరణ్ పాత్ర పరిచయం అవుతుందట. ఓ భారీ ఫైట్, చరణ్ ఎంట్రీ.. దాంతో... ఇంట్రవెల్ పడుతుందని, మెగా అభిమానులకు ఆ సన్నివేశాలు గూజ్‌బమ్స్ మూమెంట్స్‌ని అందిస్తాయని తెలుస్తోంది. ఇంట్రవెల్ తరవాత 20 నిమిషాల పాటు చరణ్ పాత్ర సాగబోతోందని సమాచారం.
ఇలా... ఇంట్రవెల్ నుంచి 20 నిమిషాల వరకూ... మెగా ఫ్యాన్స్‌ని ఉర్రూతలూగించే సన్నివేశాలే ఉంటాయని.. క్లైమాక్స్ కూడా.. ధీటుగా తెరకెక్కించారని సమాచారం. మరి ఆ సన్నివేశాలు ఎంత రోమాంచితంగా ఉంటాయో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.