తెలుగు సినిమా వాళ్లకు సెంటిమెంట్స్ ఎక్కువ. తెలుగు ప్రేక్షకులు కొన్ని విషయాల్ని జీర్ణించుకోలేరు. హీరో చనిపోతే.. సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతుందన్నది సినీ జనాల నమ్మకం. అందుకే యాంటీ క్లైమాక్స్ జోలికి ఎవ్వరూ వెళ్లరు. అయితే `ఆచార్య`లో యాంటీ క్లైమాక్స్ ఉండబోతోందన్నది విశ్వసనీయ వర్గాల టాక్. చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న సినిమా `ఆచార్య`. ఇందులో రామ్ చరణ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో చిరు - చరణ్ గురు శిష్యులుగా నటించబోతున్నారని టాక్.
చరణ్ పాత్ర ఫ్లాష్ బ్యాక్‌లో వస్తుందట. సెకండాఫ్ అంతా ఆ పాత్ర చుట్టూనే నడుస్తుంది. అయితే ప్రీ క్లైమాక్స్ లో చరణ్ పాత్ర చనిపోతుందని, ఆ తరవాత... చరణ్ ఆశయాల్ని చిరంజీవి నెరవేరుస్తాడని సమాచారం. అలా ఓ హీరో చనిపోవడం యాంటీ క్లైమాక్స్ కిందే లెక్క. మరి... దీన్నిమెగా అభిమానులు జీర్ణించుకుంటారా? అనేది పెద్ద డౌటు. ఆ సీన్ క్లిక్కయితే.. మాత్రం ఈసినిమా రేంజ్ ఓ స్థాయిలో ఉంటుంది. చరణ్ ని చంపేయడమేంటి? అనుకుంటే మాత్రం.. ఫలితంలో తేడా వచ్చే ప్రమాదం ఉంది. మరి ఈ సీన్ ని కొరటాల శివ ఎలా డీల్ చేశాడో చూడాలి.