ఇది వరకు ఓ సినిమా వంద కోట్ల బిజినెస్ చేసిందంటే... అంతా ఆశ్చర్యపోయేవారు. అంత స్థాయి ఉందా? ఉంటుందా? అసలు ఓ సినిమాకి వంద కోట్లేంటి? అని ఆరా తీసేవారు. కానీ.. క్రమంగా తెలుగు సినిమా మార్కెట్ మారిపోయింది. బడ్జెట్లు పెరిగిపోయాయి. దాంతో పాటు... వసూళ్లూ అదే స్థాయిలో జరుగుతోంది. ఇప్పుడు ఓ స్టార్ హీరో సినిమా అంటే కనీసం 100 కోట్లు రావాల్సిందే. ఆచార్య టార్గెట్ అయితే ఇప్పుడు ఏకంగా 200 కోట్లు.
చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ఆచార్య. కాజల్ కథానాయిక. రామ్ చరణ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. మేలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాకి మార్కెట్ మొదలైపోయింది. చాలా ఏరియాలలో డీల్ ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. అన్ని ఏరియాలూ, థియేటరికల్ నాన్ థియేటరికల్ రైట్స్, శాటిలైట్, డిజిటల్ రైట్స్.. ఇలా మొత్తం అన్నీ కలుపుకుని కనీసం 200 కోట్లు రాబట్టాలని చిత్రబృందం భావిస్తోందని తెలుస్తోంది. ఈ సినిమాకి చిరు పారితోషికంతో కలుపుకుని 130 కోట్ల వరకూ... ఖర్చయ్యే అవకాశం ఉంది. అంటే... దాదాపుగా 70 కోట్ల రాబడి అన్నమాట.