తనపైన తన భర్త అయిన రాజశేఖర్ పైన మహిళా హక్కుల కోసం పోరాడే సంధ్య అనుచిత వ్యాఖ్యలు చేసిందంటూ నిన్న జీవిత రాజశేఖర్ జూబిలీహిల్స్ పొలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది.
తన ఫిర్యాదులో సంధ్య, అలాగే టీవీ చర్చలో సమన్వయకర్తగా వ్యవహరించిన ప్రముఖ జర్నలిస్ట్ పేర్లని పేర్కొన్నది. ఇక దానికి సంబంధించి సాక్ష్యాలు కూడా ఇవ్వడంతో పోలీసులు వాటిని పరిశీలించారు. అన్ని ఆధారాలు చూసాక, ఈ ఇరువురి పైన పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసినట్టు సమాచారం.
ఇక ఈ అంశంలో ఆధారాలు ఉంటే బయటపెట్టమని జీవిత విసిరిన సవాలుకి సంధ్య సమాధానమిచ్చారు. ఇలాంటివి జరిగాయి అని తనవద్దకి వచ్చి చెప్పడంతోనే తాను అలాంటి వ్యాఖ్యలు చేశాను అని చెప్పారు. కచ్చితంగా ఈ కేసుని ఎదురుకుంటాను అని చెప్పింది.
ఇండస్ట్రీలోని కొందరు ఇచ్చిన సమాచారంతోనే తాను మాట్లాడాను అని జీవిత రాజశేఖర్ గురించిన ఆధారాలు ఇంకా చాలానే ఉన్నాయి అంటూ చెప్పడం కొసమెరుపు.