హాస్య నటుడు బ్రహ్మాజీపై హైదరాబాద్ వాసులు గరం గరంగా ఉన్నారు. ఓ వైపు హైదరాబాద్ వరదలకు అతలాకుతలం అవుతుంటే, దానిపై జోకులు వేస్తావా? అని మండిపడుతున్నారు. హైదరాబాద్ లో వరదల్ని ఉద్దేశిస్తూ.. బ్రహ్మాజీ వెటకారంగా ఓ పోస్ట్ చేశారు.‘ ఓ మోటరు బోటు కొనాలనుకుంటున్నా.. దయచేసి ఏదైనా మంచి పడవ గురించి సలహా ఇవ్వండి’’ అని ట్వీటారు.
సరదాగానే ఈ ట్వీట్ చేసినా... హైదరాబాద్ వాసులు మాత్రం కోపం వచ్చింది. ఎక్కడి నుంచో హైదరాబాద్ వచ్చి, ఇక్కడి తిండి తింటూ.. ఇంత వెటకారం చేస్తావా? అంటూ నెటిజన్లు ఫైర్ అయ్యారు. బ్రహ్మాజీపై భారీ ఎత్తున ట్రోలింగ్ జరిగింది. చాలామంది తిట్ల పురాణం అందుకున్నారు.
ఈ ఫ్లోటింగ్ తట్టుకోలేక.. చివరికి ట్విట్టర్ నుంచి వైదొలిగారు బ్రహ్మాజీ. కొన్ని విషయాలు చాలా సెన్సిటీవ్ గా ఉంటాయి. వాటిపై జోకులు వేయకూడదు. నిజానికి బ్రహ్మాజీ నివాసం కూడా వరదలకు మునిగిపోయింది. ఆయన అపార్ట్మెంట్ నిండా నిళ్లేనట. ఆయన ఇంటికి వెళ్లే దారి లేకపోవడంతో.. కారు ఎక్కడో పార్క్ చేసుకుని నడుచుకుంటూ వెళ్లాల్సివచ్చిందని, ఆ సందర్భంగానే ఈ ట్వీట్ చేశారని తెలుస్తోంది.