మలయాళ చిత్రసీమలో ఇప్పుడు వినిపిస్తున్న ఏకైక పేరు- దిలీప్. అయితే ఈయన చేసిన పనితో ఒక్కసారిగా మలయాళ చిత్రం పరిశ్రమతో పాటు అక్కడి అభిమానులు సైతం షాక్ కి గురయ్యారు.
ఇప్పటికే కిడ్నాప్ కి కుట్ర పన్నిన్నట్టుగా అనుమానం పైన అరెస్ట్ అయిన దిలీప్ కి కోర్టులో చుక్కెదురయ్యింది. తనకి ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు అని దిలీప్ వేసిన బెయిల్ పిటిషన్ ని కోర్టు కొట్టేసింది.
దీనితో ఆయన పొలిసు కస్టడీలోనే విచారణ నిమిత్తం ఉండాల్సి ఉంది. అరెస్ట్ అయిన వెంటనే ఆయనని సెంట్రల్ జైలుకి తరలించినా, పోలీసులు అభ్యర్ధన మేరకు ఆయనకు పొలిసు కస్టడీ ఇచ్చారు.
కిడ్నాప్ అలాగే కుట్రపూరితమైన చర్యలకు పాల్పడినట్టు తమ వద్ద ఆధారాలు ఉన్నట్టు పోలీసులువర్గాలు చెబుతున్నాయట!