నెక్స్ట్ ఏంటి అంటున్న నాని ఫాన్స్

మరిన్ని వార్తలు

ఇండస్ట్రీలో ఎలాంటి సపోర్ట్ లేకుండా కష్ట పడి పైకి వచ్చిన హీరో నాని. నాని కెరియర్ లో సక్సెస్ రేట్ ఎక్కువే. నాని సినిమా హిట్ టాక్ తో సంబంధం లేకుండా అందరూ చూస్తారు. దసరా, హాయ్ నాన్న లాంటి వరుస హిట్లతో దూసుకుపోతున్న ఈ హీరో ప్రస్తుతం కన్ఫ్యూజన్ లో ఉన్నాడట. త్వరలో వివేక ఆత్రేయ తెరకెక్కించిన సరిపోదా శనివారంతో ప్రేక్షకుల  ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. నెక్స్ట్ నాని చేతిలో మూడు ప్రాజెక్ట్ లు ఉన్నాయి. శ్రీకాంత్ ఓదేల, బలగం వేణు, సుజిత్, ఈ ముగ్గురితో సినిమాలు కమిట్ అయ్యాడు. కానీ ఏ సినిమా ముందు పట్టాలెక్కించాలనే  కన్ఫ్యూజన్ లో ఉన్నాడట నాని.    


నాని కెరియర్ లో దసరా లాంటి సూపర్ హిట్ ఇచ్చి, నానిలో ఉన్న మాస్, అండ్ యాక్షన్ ఎలివేషన్స్ ని బయట పెట్టిన శ్రీ కాంత్ ఓదెలతో ప్రాజెక్ట్ పట్టాలెక్కిద్దాం అంటే ఆ మూవీ స్క్రిప్ట్ వర్క్ ఇంకా పూర్తి కాలేదు. సుజిత్ తో సినిమా చేద్దామంటే , సుజిత్ పవన్ కళ్యాణ్ తో OG మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ పవన్  పొలిటికల్ వర్క్ కారణంగా  బ్రేక్ పడింది. ఇప్పుడు ఎన్నికల హడావిడి ముగిసి పవన్ ఫ్రీ అయిన తర్వాత OG ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు సుజిత్. అదీ కాకుండా సుజిత్, నాని మూవీ గ్యాంగ్ స్టార్ కథతో పాన్ ఇండియా రేంజ్ లో రూపొందనుంది. ఈ మూవీని డీవీవీ దానయ్య నిర్మించనున్నారు. కానీ ఈ మూవీ బడ్జెట్ నాని మార్కెట్ కి మించి ఉందని, ప్రస్తుతం నానికి ఉన్న మార్కెట్ దృష్టిలో పెట్టుకుని 100 కోట్లకి పైగా బడ్జెట్ పెట్టేందుకు దానయ్య వెనుకంజ వేస్తున్నారని టాక్.  


బడ్జెట్ కారణంగా సుజిత్, నాని సినిమాకి బ్రేక్ పడింది. ఇక చేసేదేం లేక బలగం వేణుతో చేయబోయే సినిమాకి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేపనిలో ఉన్నట్టు సమాచారం. బలగం సినిమాని తక్కువ బడ్జెట్ లో తీసి ప్రశంసలు పొందాడు వేణు. ఈ సారి  దాదాపు 50 కోట్ల బడ్జెట్ తో నానితో సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. దిల్ రాజు నిర్మాణంలో ఈ మూవీ రానుంది.

Tags:

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS