'ఏజెంట్‌ ఆత్రేయ' తక్కువోడేం కాదే.!

మరిన్ని వార్తలు

షార్ట్‌ ఫిలింస్‌ ద్వారా పాపులరైన నవీన్‌ పోలిశెట్టి 'ఏజెంట్‌ సాయి శ్రీనివాస్‌ ఆత్రేయ' ద్వారా వెండితెరకు పరిచయమయ్యాడు. ఈ కుర్రాడి నటనకు ఆడియన్స్‌ నుండి రెస్పాన్స్‌ బాగానే వచ్చింది. లేటెస్ట్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఓకే అనిపించుకుంది. ఇదిలా ఉంటే, మనోడు తదుపరి బాలీవుడ్‌లో సందడి చేయబోతున్నాడు. నితేష్‌ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'చిచోరి' సినిమాతో బాలీవుడ్‌లో అడుగు పెట్టబోతున్నాడు నవీన్‌ పోలిశెట్టి. నితేష్‌ తివారి ఏమీ ఆషామాషీ డైరెక్టర్‌ కాదండోయ్‌. అమీర్‌ఖాన్‌తో 'దంగల్‌' వంటి సూపర్‌ హిట్‌ చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్‌. ఈ సినిమాలో మన ఏజెంట్‌ ఛాన్స్‌ దక్కించుకోవడమంటే అది అదృష్టం కాక ఇంకేంటి చెప్పండి. తెలుగులోనూ నవీన్‌కి అవకాశాలు బాగానే వస్తున్నాయట.

 

ఇప్పటికే రెండు, మూడు కథలు విన్నాడట. వాటిలో రెండు కథలపై నవీన్‌ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే వాటిపై క్లారిటీ ఇవ్వనున్నాడట. అంటే, త్వరలోనే మనోడు తెగ బిజీ అయిపోనున్నాడన్న మాట. కథలుండీ, మినిమమ్‌ బడ్జెట్‌లో సినిమాలు తెరకెక్కించగల సత్తా ఉన్న దర్శక, నిర్మాతలకు ఇలా నవీన్‌లాంటి ఆర్టిస్టులు బాగా ఉపయోగపడతారు. కొద్దో గొప్పో సోషల్‌ మీడియా క్రేజ్‌ ఉన్న వాళ్లకు బెనిఫిట్స్‌ ఇంకా ఎక్కువ. సో నవీన్‌కి భవిష్యత్తు బంగారు బాటవుతుందనడం సబబేనేమో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS