టాలీవుడ్ సీనియర్ హీరో రాజేంద్రప్రసాద్ కుటుంభం తీవ్ర విషాదంలో ఉంది. కారణం రాజేంద్ర ప్రసాద్ ఒక్కగానొక్క కూతురు గుండె పోటుతో మరణించారు. ఆమె పేరు గాయత్రి, ఆమె వయసు 38 ఏళ్ళు. ఇంత చిన్న వయసులోనే గాయత్రి మరణం ఆ కుటుంభానికి తీవ్ర విషాదాన్ని నింపింది. శుక్రవారం రాత్రి గాయత్రికి గుండెపోటు రావటంతో ఏఐజీ హాస్పటల్ లో జాయిన్ చేసారు. ఏఐజీ డాక్టర్స్ అత్యవసర చికిత్స అందిస్తుండగా ఆమె తుదిశ్వాస విడిచారు. రాజేంద్రప్రసాద్ కు ఒక కుమారుడు, ఒక కుమార్తె. ఇప్పుడు కూతరు ఇలా తనని వదిలేసి వెళ్లినందుకు రాజేంద్రప్రసాద్ కుంగిపోతున్నారు.
గాయత్రికి తేజస్వని అనే కూతురు ఉంది. తేజస్వని బాల నటిగా సినిమాలో నటిస్తోంది. మహానటి సినిమాలో సావిత్రి చిన్నప్పటి పాత్రలో కనిపించింది రాజేంద్రప్రసాద్ మనవరాలే. గతంలో రాజేంద్ర ప్రసాద్ ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ, తన పదేళ్ల వయసులో తల్లి చనిపోయిందని, అందుకే తనకి కూతరు పుట్టాక ఆమెని తన తల్లిలా చూసుకున్నానని చెప్పారు. కానీ గాయత్రి తనని కాదని లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయింది. తరవాత నుంచి నేను తనతో మాట్లాడటం మానేశా అని పేర్కొన్నారు. కానీ ఇప్పడు గాయత్రి ఏకంగా ఇలా విడిచి వెళ్ళిపోవటం బాధాకరమే.
రాజేంద్ర ప్రసాద్ కి పలువురు సంతాపం తెలియజేస్తున్నారు. ఈ ఏడాదిలో రాజేంద్రప్రసాద్ ఇంట్లో రెండో విషాదం. సెప్టెంబర్ లో రాజేంద్రప్రసాద్ సోదరుడు వీరభద్రస్వామి విజయవాడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఇప్పుడు కూతురు మరణం.